విరిబోణి పిలుపు...

పెదవి పలుకలేని పలుకులు
చూపులు చెప్పునేమో చూడాలి
పగలు రాల్చిన సిగ్గుదొంతరలు
రేయంతా పరిమళం చిందించాలి!

మనువుతో కలసిన మనసులు
ప్రేమతో తనువులను ఏకంచేయాలి
తమకంతో మూతపడిన కనురెప్పలు
కౌగిలిలో కలువరేకులై విచ్చుకోవాలి!

దాచిఉంచిన మకరందకుసుమాలు
లాలనగా తన్మయంతో ఆస్వాధించాలి
చీరపై మెరుస్తున్న చెంకీ తళుక్కులు
సిగ్గుపడుతూ చీకటి ఆశ్రయం కోరాలి!

అలవాటులేని పెదవిగాట్ల సరసరాగాలు
తీయని రాగమై అలవోకగా ఆలపించాలి
దాగిన నెలవంకను పిలిచి విసిగిన తారలు
మన్మధునితో కయ్యానికి కాలుదువ్వాలి!

40 comments:

 1. మీ కవిత సహజ భావ సామగ్రితో అందంగా ఆనందంగా చాలా చాల బాగుంది.నేపధ్య సంగీతంకూడా అద్దిరిందండీ!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి బ్లాగ్ కి విచ్చేసి కమెంటిడిన మీకు.

   Delete
 2. Simply superb madam.
  Lovely feelings poetry.

  ReplyDelete
 3. కొత్త పెళ్ళి కూతురి మనసును కవిత్వీకరించి యింత మధురమైన భావాగ్నిని చిత్రీకరించిన మీకు అభినందనలు పద్మాజీ...

  ReplyDelete
  Replies
  1. సామాన్యంగా వ్యాఖానించని మీరు ఇలా విచ్చేసి మెచ్చినందుకు నెనర్లండి!:-)

   Delete
 4. చక్కని కవితకు అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. భాస్కర్ గారు అభివందనములు:-)

   Delete
 5. ఈ రోజుల్లో ఇంత అందమైన భావాలు ఉన్న అమ్మాయిలు అతితక్కువేమోనండి:)

  ReplyDelete
  Replies
  1. Good question Aniketh..nenadigite bagodu anujunna bhale adigav naa manasulomata...thanq:)

   Delete
  2. తరచిచూస్తే తగలకపోరు అనికేత్.....మనలో కూడా అవేభావాలు ఉంటేనే ఎదుటివారిలో కూడా వెతుకుతామేమో వాటికోసం:-)

   Delete
  3. వర్మగారు....జగమెరిగినవారు మీకు సందేహమా!!??

   Delete
 6. Some how, I felt it as most routine.

  ReplyDelete
  Replies
  1. Thanks for visiting my blog.
   Its may be routine, but sharing our feelings is not.... what I think:-)

   Delete
 7. పద్మ గారూ! ఎట్టకేలకు వ్యాఖ్య చేసేందుకు వీలుపడింది.
  నిన్న పోస్ట్ చూసి కామెంట్ చేయడానికి ఎంత ట్రై చేసినా అవలేదు...
  నవ వధువు కన్నె మనసును ఆవిష్కరించారు బాగా...
  కానీ.....:-)
  దాచిఉంచిన మకరందకుసుమాలు
  లాలనగా తన్మయంతో " ఆస్వాధించాలి"
  వధువు పరంగా చెప్తున్నపుడు అవి ఆస్వాదించ బడేవి కదండీ?
  ఏమంటారు?
  ఈ భావం క్లియర్ చేయగలరు...
  శృంగారభావాన్ని కవితలో చక్కగా మిశ్రితం చేసారు...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీగారూ ముందుగా మీకు ధన్యవాదాలు! ఏదో చదివేసాము అని కాకుండా ఇంత శ్రద్దగా చూసి మరీ కమెంట్ వ్రాసి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు.
   ఇక్కడ వధువు ఎన్నో మధురభావాలుగల సుకుమారి. ఆస్వాధించే అధికారమొచ్చె కదా మనువుతో అని వరుడు ఎక్కడ బలవంతంగా మోటసరసం చేస్తాడో అని అలా లాలనగా తన్మయత్వంతో ఆస్వాధించమని భావం:-)
   తప్పంటారా?
   కవిత మెచ్చినందుకు థ్యాంక్సండి!

   Delete
  2. పద్మ గారూ!
   మీ ప్రతిస్పందనకి ధన్యవాదాలు...
   తప్పు కాదు మీ భావం..
   మిగిలిన అన్ని భావాలు వధువు పరంగానే ఉన్నాయి...
   ఇదొక్కటే వరుని పరంగా ఉందన్నమాట (మీ వివరణ ప్రకారం)..:-)
   ....
   అన్నట్లు మీరు ఇంతకూ ముందు చేసిన పోస్ట్ లో చిత్రం (తెలిసి కూడా)
   ఒరిజినల్ చిత్రాన్ని చూసి వేసినదే ఐతే,
   మీ చిత్రం చాలా దగ్గరగా ఉంది ఒరిజినల్ చిత్రానికి..
   అభినందనలు మీకు....
   @శ్రీ

   Delete
  3. That is the painting of the great artist Antonio Xavier Trindade original pic. This pic is also not mine.
   అంతగొప్పగా పెయింట్ చేసిననాడు నా జన్మ ధన్యమైనట్లేనండి. అది మొదలుపెట్టి అవుట్లైన్ దగ్గరే ఆపేసాను చూడాలి ఎప్పటికి పూర్తిచేస్తానో, మీ అభిమానానికి కృతజ్ఞతలు.

   Delete
 8. Good mng Padma, chala bagundi. roju roju kotta kotta kavitalato mammalni santoshapedutunnaru..

  ReplyDelete
  Replies
  1. Thanks for encouraging me with your comments.

   Delete
 9. ఈ మధురభావాలసుమమాల ఇప్పటి జెనరేషన్ కి వర్తిస్తుంది అని చెప్పడానికి కాస్త సంశయించాల్సి వస్తుందేమో పద్మార్పిత!poetry wise nice feelings:-)

  ReplyDelete
 10. నిజమే....భూమి గుండ్రంకదా.... మళ్ళీ తిరిగి ఆ భావాలసుమమాలలనే కోరుకుంటారేమో!:-)Thank you.

  ReplyDelete
 11. నవ వదువు మనోగతం మా పద్మమ్మ కవిత్వంలో అందంగా అలంకారమైనది. బాగుంది పద్మగారూ.

  ReplyDelete
  Replies
  1. అందంగా కవితని అలంకరించానని మెచ్చిన మీకు నెనర్లు!

   Delete
 12. తేనియలు చిందు పదములు ,
  పూనిన రస,భావము - 'విరిబోణి పిలుపు' లై
  వేణువున వెడలు తియ్యని
  గానము తలపించె ' పద్మకవిత 'మథురమై .
  -----సుజన-సృజన

  ReplyDelete
  Replies
  1. ఆనందముతో పరవసించింది మది మీ ప్రసంశతో....నెనర్లు!

   Delete
 13. వరుడు భావాలని అర్థం చేసుకుని
  వధువు అతని బరువు భాధ్యతలను పంచుకుంటే ఇంకా రమ్యంగా ఉంటుందేమో:)

  ReplyDelete
  Replies
  1. నిజమే ప్రేరణ మీరు చెప్పింది. ధన్యవాదాలు!

   Delete
 14. చిత్రానికి కవిత రాసారా!లేదా కవితకు ఆ చిత్రాన్ని ఉంచారా!సరళ మైన పదాలతో చక్కగా వర్ణించారు.

  ReplyDelete
 15. చిత్రం చూసే భావం పలికిందండి.
  ధన్యవాదాలండి!!

  ReplyDelete
 16. మీరు keka పద్మ garu .. చిత్రం చూసి, కవిత్వం రాశారు

  ReplyDelete
 17. మంచి కవిత. చాలా బాగుంది.

  ReplyDelete
 18. శ్రీ పద్మగారికి, నమస్కారములు.

  `చేజారాక'; `విరిబోణిపిలుపు' ....మొదలైన కవితలు ఒక్కొక్కటి, ఒకొక్క `తారై', తారాపధంలో చంద్రుని ఉక్కిరిబిక్కిరి చేయుగాక!!

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  ReplyDelete
 19. ధన్యవాదాలండి!!

  ReplyDelete