సరసరాగాలు...

మునివేళ్ళు ముంగురులతో సరసమాడుతుంటే
నీవు చెంతనజేరి చిలిపి ఊహవై ఊసులాడమాకు

గోరింట ఎరుపును చెంపలు అప్పుగా అడుగుతుంటే
నీవు చేసిన అల్లరిని గురిచూసి గుర్తుకురానీయకు

అద్దం నా అందానికి దాసోహమై దాహమని అంటే
నీవు నా ప్రతిబింబమై పెదవిపై గాటుగా మారిపోకు

కనుల కౌగిలిలో కనుపాపలు కలిసి కాపురముంటే
నీవు కలగావచ్చి కన్నుగీటి కలవరపెట్టేసి పోమాకు

మెడవంపున మెత్తగ ఏదో తాకి మైమరచి నేనుంటే
నీవు మదిలో మెదిలి మోహంతో పరవసింపజేయకు

స్వేదం చెక్కిలి చేజారి ముత్యపుమాలై మత్తెక్కిస్తుంటే
నీవు చెలికాడినని తలపుకొచ్చి తికమకపెట్టి జారుకోకు

కుచ్చిళ్ళు నన్ను తాకిన భాగ్యానికే తబ్బిబైపోతుంటే
నీవు తనువంతా తడిమిమేస్తున్న భావమై రెచ్చిపోకు

45 comments:

  1. కనుల కౌగిలిలో కనుపాపలు కలిసి కాపురముంటే
    --------------------
    వర్ణన బాగుంది.

    ReplyDelete
    Replies
    1. వర్ణన బాగుందని వక్కాణించిన మీకు ధన్యవాదాలండి:-)

      Delete
  2. చక్కని చిలిపి భావాలన్నీ ఏరీకోరి ఏరుకొచ్చి పరిచినట్లున్నారండి, అభినందనలు.........

    ReplyDelete
    Replies
    1. :-) నచ్చాయని మెచ్చిన మీకు అభివందనములు......

      Delete
  3. ప్రతి వాక్యం చెక్కినట్టు చక్కగా ఉందండి.ఇంత అద్బుతంగా అమ్మాయిల ఊహలుంటాయా!

    ReplyDelete
    Replies
    1. చక్కని శిల్పాలని చెక్కడం అమ్మాయిలకి చేతకాదేమో కానీ ఊహలకేం బ్రహ్మాండంగా ఊహిస్తాం....
      వాటికి రెక్కలు రానీయకండి, వస్తే విరిచేయండి అంటారని కూసింత భయమండి:-)
      ప్రోత్సాహాన్నిస్తున్న మీకు నమసుమాంజలి.

      Delete
  4. గోరింట ఎరుపును చెంపలు అప్పుగా అడుగుతుంటే...
    స్వేదం చెక్కిలి చేజారి ముత్యపుమాలై మత్తెక్కిస్తుంటే...
    మెడవంపున మెత్తగ ఏదో తాకి మైమరచి నేనుంటే...
    లాంటి భావాలు
    సున్నిత శృంగారాన్ని సున్నితంగా స్పృశించి పోకోయి....
    అన్నట్లుంది పద్మగారూ!..
    చక్కని శృంగారోద్దీపన...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. సుతిమెత్తని భావాలని సున్నితంగా స్తుతించిన మీకు నెనర్లండి:-)

      Delete
  5. Wonderful Padmarpitagaru, no words to write.

    ReplyDelete
  6. చిత్రాల ఎంపికలో మీకు మీరేసాటి.
    అందాలరాక్షసి సినిమా చూస్తున్నంతసేపు మీ బ్లాగ్ నా కళ్ళలో మెదిలిందండి!
    మరోసారి అభినందనలు మీకు, మీభావాలకు వాటికి సరిపడ్డ చిత్రాలకు.

    ReplyDelete
    Replies
    1. Thanks for remembering my blog and once again thanks for compliments. Double Dhamaka:-)

      Delete
  7. పద్మా నీ మది ఒక అందమైనభావాల నిధి....అమూల్యం, అమోఘం!

    ReplyDelete
    Replies
    1. అమ్మో! ఇలా అమోఘం అమూల్యం అని భారం వేసి దూరం చేయకండి:-)Thank you Srujanagaru

      Delete
    2. పద్మార్పిత గారు,

      పోనీండి, 'మోహమాల్యం' అంటాం మరి !

      అపురూపం చిత్రం, అపూర్వ రచనా కౌశలం !

      చీర్స్
      జిలేబి.

      Delete
    3. జిలేబి(గారు) మామూలుగా ఊరించరుకదా:-)
      అమ్మో! ఈ తీపితనాన్ని తట్టుకోవడం కష్టమే:-)
      మీ అభిమానపు స్పందనకి కృతజ్ఞతలండి!!!

      Delete
  8. స్వేదం చెక్కిలి చేజారి ముత్యపుమాలై మత్తెక్కిస్తుంటే
    నీవు చెలికాడినని తలపుకొచ్చి తికమకపెట్టి జారుకోకు...
    Fabulous...Marvelous...

    యింత అందమైన ఊహల జాజుల మాలలన్నీ మీ హృదయాకాశంలో రూపుదిద్దుకొని మా మనసులలో వెన్నెల కురిపించడం బ్లాగ్ లోకం చేసుకున్న అదృష్టం పద్మగారూ...అభినందనలు...

    ReplyDelete
    Replies
    1. వర్మగారి నోట Fabulous...Marvelous...అనే పదాలకు నోచుకున్న ఈ "సరసరాగాలు" సన్నజాజులై నన్ను చక్కిలిగిలి పెడుతున్నాయండోయ్. Thank you very much.

      Delete
  9. chaala chaala bagundi padmarpita garu. super. chala interesting a untay mee kavitalu...

    ReplyDelete
    Replies
    1. Mee ee encouraging words baagunnayandi. thank Q!

      Delete
  10. పద్మగారూ, శ్రుంగారాక్షర జల్లులో తడిపేసారు అందరినీ..
    బాగుంది కవిత, మంచి పదాలను ఎన్నుకున్నారు. వెన్నెల దారిలో .. మల్లెల గుభాలింపులా సారిపోయింది మీ కవితాలహరి.

    ReplyDelete
    Replies
    1. సవరణ: సాగిపోయింది మీ కవితాలహరి.

      Delete
    2. ఫాతీమాగారు థ్యాంక్సండి....
      సకలకళాకోవిధురాలు అని మీ అందరి దగ్గర మార్కులు కొట్టేయాలన్న తాపత్రయంలో శృంగారమని, శొంటికొమ్మని ఏమైనా సృతిమించితే తోకని కత్తిరించడానికి మీరంతా ఉన్నారన్న ధీమాతో ఏదో అప్పుడప్పుడూ ఇలా తడిపేస్తుంటాను,
      ఆనందిస్తే అందులో నేను తడిసి ముద్దైపోతాను.....
      జలుబు జ్వరమంటే నా కన్నీట నే తడిసిపోతాను...
      మీరంతా హాయిగా నవ్వేస్తుంటే పరవశించిపోతాను!

      Delete
    3. హలా...పద్మప్రియే , మీరు నిజ్జంగా సకల కళా కొవెడురాలే,
      అందుకే వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది వెన్నెల్లో తడవమన్నది.
      పద్మ డియర్ , చాలా చక్కగా ఉంది కవిత, శృంగారం శ్రుతిమించ కుండా ఇలాగే ఉంటె కవిత బాగుంటుంది.
      మీకు నా అభినందనలు.

      Delete
    4. మీరు బరోసా ఇస్తే ఇంక కుమ్మేస్తాను చూడండి:-)
      Once again thanks to you Fathimaji!

      Delete
    5. dear, meeru nijamgaane baagaa raastaaru.doubt ledu.

      Delete
  11. loved that pic.only a few of ur expressions r new but its ok.ijm eagerly waiting for the new pic.

    ReplyDelete
    Replies
    1. Thanks for loving pics & expressions of mine.
      Patience may give more pleasure....:-):-)

      Delete
  12. deenikina thanks cheppandi plzzzzzzzzzz

    ReplyDelete
    Replies
    1. thanks paina cheppaanu anduke dhanyavaadaalu cheputunna ikkada plzzzzzzzzz:-)

      Delete
  13. padmagaaru nice pic and vvv nice poetry

    ReplyDelete
  14. ఇన్ని అందమైన ఊహలు ఉన్న అమ్మాయికి చిక్కిన ఆ అదృష్టవంతుడెవరో???:)

    ReplyDelete
    Replies
    1. ఇంతకన్నా అందమైనా భావాలు ఉన్న అమ్మాయిలెందరో తరచిచూడండి;-) థ్యాంక్యూ!

      Delete
    2. అనికేత్....మీ ప్రశ్నకి జవాబు పద్మార్పితగారి ద్వార చెప్పించడం కష్టం,
      తరచిచూస్తే కూడాదొరకడం కష్టమేనండి..మీలాంటివారు పద్మార్పితగారు:)

      Delete
  15. గోపాల్ గారి చిత్రానికి మీ వర్ణన మరింత అందాన్నిచ్చింది! చాలా బాగుందండీ!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞగారి రసరమ్యమైన వ్యాఖ్య నన్ను రంజింపజేసింది:-) ధన్యవాదాలండి!

      Delete
  16. ఎప్పుడూ ఇలా అందమైన పదాలతో రాసే పద్మకి మంచి కమెంట్ పెట్టడానికి పదాలురాక బాగుంది అనితప్ప ఇంకేం రాయలేకపోతున్నా:(

    ReplyDelete
    Replies
    1. బాగుంది అన్న దాంట్లోని భావాంతరం తెలుసునండి....ఆప్యాయంగా అది చాలు ప్రేరణగారు:-)

      Delete
  17. ఓ మైగాడ్....ఎన్ని వర్ణనలు...ఎన్ని చిత్రాలు...ఇన్నాళ్ళు వీటిని ఎలా మిస్ అయ్యానో అర్థం కావడంలేదు....పద్మప్రిత గారు మీ చిత్రాలతో కూడిన కవితలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  18. పద్మార్పిత బ్లాగ్ కి స్వాగతం....విచ్చేసి చూసి మెచ్చిన మీకు ధన్యవాదాలండి!

    ReplyDelete
  19. That was a Beautiful painting by gopal swami khetanchi. Thanks to rasagna garu for introducing him in her blog last year.
    That was a beautiful sonnet with exactly 14 lines. Amazing coincedence? ;)

    Loved that she is left handed like me. ;)

    ReplyDelete
  20. శ్రీ పద్మగారికి, నమస్కారములు.

    మొదటగా, మీరు నా బ్లాగ్ ద్వారా నాకు సుపరిచితులే అయినప్పటికీ, మీ బ్లాగ్ ని దర్శించటం ఇప్పటివరకు కుదరలేదు. క్షమిచండి. ఇక ఈ కవిత చాలా సున్నితంగా వున్నది.
    `సరసరాగాలు':-
    సరిసరా? మీ
    సరస
    రస
    సరాగాలు
    ఎవరి కవితలతోనైనా

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  21. మధవరావుగారు.....నా బ్లాగ్ కి విచ్చేసి విడదీసి వ్యాఖ్యిడిన మీకు వందనాలు.

    ReplyDelete