ఓ! కమ్మని కవితా...

కవితా! నాలోని భావానివై ఉరకలు వేయి
నీకు ప్రతి రూపంగా నన్ను పలికించేయి

కవితా! నాలో ఏమూల దాగినా వచ్చేయి
నా ఆలోచనలకి అక్షరాలని జోడించేయి

కవితా! అజ్ఞానినని అలుసుగా చూడకోయి
నాతోడై పదకుసుమాలుగా విరబూసేయి

కవితా! నీకు అనర్హమంటూ ఏదీ లేదోయి
నీవు పలికించే ప్రతిపదంలో జీవంపోయి

కవితా! నన్ను కాదని వేరొకరి సొత్తైపోయి
శూన్యానికి నిదర్శనంగా నన్ను చూపకోయి

కవితా! మందబుద్ధినై తప్పులు చేస్తానోయి
పడిలేచిన నేను లేడినై పరుగిడతానోయి

కవితా! ఆచరించే వాటినే లిఖింపచేయి
సాలెగూడై అల్లుకునే పదాలు వలదోయి

కవితా! పసందైన పదపానకానివి కావోయి
పద్మార్పిత భావాలలో పంచధారవైపోయి!!

31 comments:

  1. కవితా! ఆచరించే వాటినే లిఖింపచేయి
    సాలెగూడై అల్లుకునే పదాలు వలదోయి
    చాలా నచ్చాయండీ పద్మగారూ...
    కవితను కూడా మీ కొంగున ముడివేసారు కదా...సుమాభినందనలు...

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చిందంటే "సాలెగూడు" అనే పదమే కారణమేమో:-)
      ఎక్కడండీ ముడికి చిక్కడంలేదుగా కవిత:-)...ధన్యోస్మి!

      Delete
  2. ROFL
    Sugar???hope no girl named kavitha see this one! ;)

    ReplyDelete
    Replies
    1. No problem, she too become a friend of mine:-)

      Delete
  3. viry nice padma, every time new adventures in Poetry..... so qte.......

    ReplyDelete
    Replies
    1. Is this is an adventure Sruthi....Oh! thank Q:-)

      Delete
  4. కవితలోని కమ్మదనం అంతా మీ ఒక్కరి సొంతమేనా...వెరీగుడ్:)

    ReplyDelete
    Replies
    1. కమ్మదనాన్ని మీకందరికీ పంచాలన్న తాపత్రయమండి...
      నేను అంత స్వార్థపరురాలుని కాదండోయ్:-)

      Delete
  5. Its an pleasure to be with you!
    This is the feel of poetry!:-)

    ReplyDelete
  6. బొమ్మ బాగుందండి, కవితంత అందంగా.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండి...బొమ్మతో పాటు కవితను మెచ్చినందుకు.

      Delete
  7. ఎన్నెన్నో భావాలు
    అన్నింట్లో తియ్యందనాలు

    ReplyDelete
    Replies
    1. తీపి ఎక్కువైందని ముఖమొత్తనీయకండి మరి
      ధన్యవాదాలు తీపిని ఆస్వాధించినందుకు:-)

      Delete
  8. కవితా! పసందైన పదపానకానివి కావోయి
    పద్మార్పిత భావాలలో పంచధారవైపోయి!!
    .......
    పద్మార్పిత పంచే పంచామృత ధారలైపోయి.....
    చాలా బాగుంది పద్మ గారూ!
    మీ చిత్రాలతో ఓ చిక్కు వచ్సిపడుతోంది...
    ఇలాంటి చిత్రం దొరికితే వేరే భావంతో ఓ కవిత వ్రాసేద్దును కదా అనిపించేస్తూ ఉంటుంది...:-)
    చిత్రం చాలా బాగుంది..వ.పా గారి రంగుల కలయికలా అనిపించింది...
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు ధన్యవాధాలండి....
      ఓ! ఇంకేం మరి వ్రాసేయండి
      మీ భావాలలో ఈ బొమ్మలు
      కొత్తరంగులు అద్దుకుంటాయిగా!

      వడ్డాదిపాపయ్యగారి అందాల వయ్యారిభామే...
      నా కుంచెలో కూసింత సుకుమారత్వం తగ్గి
      ఏదో లోపంలా ఉండి అలా మరుగున పెట్టి
      ఇప్పుడు ఇలా మీముందుంచాను...

      Delete
  9. పద్మగారూ,కవితలాగే చిత్రం కూడా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీకు రెండూ నచ్చినందుకు నెనర్లండి!

      Delete
  10. మీ కవితల్లో ఆ పంచదార తీయదనం ఎంజాయ్ చేస్తున్నా పద్మార్పితగారు:)

    ReplyDelete
    Replies
    1. ఎంజాయ్ ది స్వీట్నెస్స్:-)

      Delete
  11. పద్మార్పిత భావాలలో పంచధారవైపోయి!!
    పలికించే ప్రతిపదంలో జీవంపోస్తూ
    ఆలోచనలకి అక్షరాలని జోడించేస్తూ
    పదకుసుమాలుగా విరబూసేస్తూ
    భావానికి ప్రతి రూపంగా పద్మార్పితను పలికించేస్తూ,........
    మాకేమి మిగల్చరనమాట, మొత్తం మీద,
    కానీయండి,కానీయండి, మీ రోజులు నడుస్తున్నాయ్.హి,హి.........

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు...ఏదో పొగిడారనుకున్నా
      అంటే పోయే రోజులు ముందున్నాయంటారా
      కానీయండి చేస్తాం హ:-) హ:-) హ:-)

      Delete
  12. padma garu ..aapke kavita ne bana diyaa hai sarkarii daftar mujhko...

    na koi baat sunta hoon., na koi kaam karta hoon...!!!!

    chitra k sath kavita b bahut acha hi.

    ReplyDelete
    Replies
    1. malleshji....aap sarkaari daftar samajkar aanand leejiye magar tanquaa math poochiye...:-)
      Bahut bahut shukriyaa!

      Delete
  13. కమ్మదనం తీయదనం ఉంది కవితలో.

    ReplyDelete
  14. పద్మార్పిత భావాలలో తియ్యగా ఒదిగిపోయిన కవిత పలికించే అక్షర కుసుమాలతో రంగులద్దిన కవితా చిత్రం...రెండూ ఎంతో బాగున్నాయి.

    ReplyDelete
  15. మీకు రెండూ నచ్చినందుకు థ్యాంక్సండి!

    ReplyDelete
  16. మీ పేరుకు తగ్గట్టుగా ఉంటాయండి మీ కవితలు......
    your templete is very nice

    ReplyDelete