ఒప్పేసుకోనా?

మంచిగంధం తీసి, ఒంటికి పసుపురాసి
నలుగెట్టి, కుంకుళ్ళతో తలస్నానం చేసి
కురులారబోసి, సాంబ్రాణి ధూపం వేసి

వాలుజడలో బొడ్డుమల్లెల మాలతో
కుచ్చీళ్ళు జీరాడు పట్టు పరికిణీతో
సన్నంచున్న ఎర్రని సిల్కు ఓణీతో

కలువకళ్ళకి చలువనిచ్చే కాటుకద్ది
నుదుటిన గుండ్రంగా సింధూరందిద్ది
పెదవికి గులాబీవంటి చిరునవ్వునద్ది
ముస్తాబై పెళ్ళిచూపులని కూర్చుని
సూటుబూటోడని ఓరకంట చూడగా..

జీన్స్ ప్యాంట్, చారల టీషర్ట్ అనేదోవేసి
తైలంలేని జుట్టుని నిక్కబొడిపింప చేసి
ట్రిమ్మింగని గీయనిగెడ్డానికి మసిపూసి

లోపలికొచ్చికూడా తీయని కళ్ళజోడుతో
చూస్తున్నది ఎటో కనిపెట్టలేని చూపుతో
మోడ్రన్ అంటూ అవేవేవో కొత్త టేస్ట్ లతో

నాలుకళ్ళతో ఎటోచూసి....ఇలా వలదని
చిన్నిచిల్లుల చొక్కా, పొట్టి ప్యాంటేసుకుని
పెదాలకెరుపు, గోళ్ళకి నలుపురంగేసుకుని..
ఎగుడుదిగుడులతో జుట్టు విరబోసుకోమని
ఇంకేవో అరడజనుకు పై ప్యాషన్ పేర్లు చెప్పి


అలాగైతే ఓకే అన్న ఆ "తెలింగీష్ బచ్చాని" ఒప్పేసుకోనా వద్దననా?
"NO" అంటే ఎందుకనో? "YES" అనడం ఎందుకో చెప్పొచ్చుగా:-)

54 comments:

  1. పెదవికి గులాబీవంటి చిరునవ్వునద్ది
    సూటుబూటోడికి నే చెప్తాను "NO"
    ఎందుకంటే
    చిన్నిచిల్లుల చొక్కా ప్యాంటులు
    ఎగుడుదిగుడుల జుట్టు పట్లు సరికావు నాకు.

    ReplyDelete
    Replies
    1. సరికానివారిని సరిచేయలేమంటారా?:-) అంటే మొదటి "No" అన్నమాట!

      Delete
  2. ఎవడో ఒకడు నచ్చిన వాణ్ణి పెళ్ళి చేసేసుకోతల్లీ ఓ పనైపోతుంది :)

    ReplyDelete
    Replies
    1. ఎవరినో ఒకరిని చేసుకుని ఇంకా డౌట్లు పెరిగి మిమ్మల్ని ఇంకా విసిగిస్తే? పనైపోతుందని, మిమ్మల్ని ప్రశాంతంగా ఉందనిస్తానని ఎలా అనుకున్నారండి:-)

      Delete
  3. అయన్నీ ఏమో గానీ...బొమ్మ మాత్రం పెళ్ళిచూపులకి ముస్తాబయిన తెలుగమ్మాయిలానే ఉంది....

    ReplyDelete
    Replies
    1. బొమ్మంతా ఒకెత్తు...ఆ అమ్మాయి చూపుముందు ఎవరైనా చిత్తు!
      అనేట్లుంది కదంటి...నాకూ భలే నచ్చేసింది.

      Delete
  4. According to Law of magnetic poles opposite poles attract each other, so say "Yes". Not a bad idea :-)

    ReplyDelete
    Replies
    1. May be opposite poles attract each other, after loss of that Magnetic Power?.....Just thinking about this:-)
      "Yes"I too agree its not a bad idea, lets wait and see what our other friends suggest:-)

      Delete
  5. ఇలా అభిప్రాయ సేకరణ లోనే కాలం గడిపేసేటట్టున్నారు ;)

    ReplyDelete
    Replies
    1. ఆ ఏదో లెండి....ఇలా సేకరించిన సమాచారం నాకు కాకపోయినా నాపిల్లలకైనా ఉపయోగపడేలా చేద్దామని:-)

      Delete
  6. మీ ఆవిష్కరణ చూస్తే , మీ అభిప్రాయం మాత్రం ' వద్దు ' అని చెబుతోందనిపిస్తోంది...

    ReplyDelete
    Replies
    1. ఆవిష్కరించిన అలంకరణలకి ఆకర్షించబడి అలా అభిప్రాయానికి వచ్చేస్తే ఎలాగండి:-)

      Delete
  7. అవునండి ఏది ఏమైనా అలంటి వాల్లను "నో" అనే చెప్పాలి, సంప్రదాయలకు విలువ ఇవ్వలి కదా అండి.అప్పుడె కదా మనకు కుడా విలువ ఇస్తారు... చాలా బాగుంది పద్మ...

    ReplyDelete
    Replies
    1. శృతిగారూ.....సంప్రదాయాలకి విలువను ఇవ్వబట్టే పెళ్ళిచూపులకొచ్చాం అంటారండి మనం అలాగంటే.....:-) ఏది ఏమైనా సంప్రదాయం వేరు అభిరుచులు వేరు అని అతని వాదన:-), అయినా మీరు "No" అన్నట్లే కదా!!

      Delete
  8. ఇమేజ్ సుపర్ అండి, నేను కాపి చేసుకోవచ్చా పద్మార్పిత గారు...

    ReplyDelete
    Replies
    1. కదా సూపర్ గా నచ్చింది నాకు కూడా....తీసుకోండి, నేనూ కాపీ కొట్టిందే:-)

      Delete
  9. ఊహు. నచ్చలే. ఇంత వివరంగా చెప్పేసి కూడా ఒప్పుకొనా అంటే ఎలా!!!ఒప్పేసుకోవద్దు:) ఓ తెలుగబ్బాయ్ ఒస్తాడులే:)))))

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా?.......ఏమో కొన్నాళ్ళకి తెలుగుతనంలో తీపికి వెగటుపుట్టి పులుపంటే!!:-)
      (అతిగా ఆలోచించక నోరుమూసుకుని తలని అడ్డంగాఊపి "No" చెప్పమంటారు అంతేనా:-)OK!

      Delete
  10. సూటు బూచోడికి నో చెప్పచ్చనుకుంటా :)ఆ అమ్మాయి అలంకారం కన్నా మీరు కవిత కి అంత్య ప్రాసతో చేసే అలంకారం ఇంకా బాగుంది .... అయినా మీ కవిత అంత అందం గా ఉంది ఆ అమ్మాయెవరో ..

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చిందా? ఎవరో అంటూ ఆరాలు తీయడమేంటండి...మీ "కవిత" ఏనండి:-)
      మీరు కూడా "No" అనమంటారా?

      Delete
  11. ఆ తెలింగీష్ బచ్చా ఈ తెలుగమ్మాయిని తెలింగీష్ బచ్చీగా చూడాలనుకున్నా కాదులెండి:)

    ReplyDelete
    Replies
    1. చూడాలనుకోవడం, అలాగే ఉండాలని కోరడం వేరు వేరనుకుంటానండి......అయితే మీరు "Yes" అన్నమాట.

      Delete
  12. వద్దులెండి మీకు సరిపడరు :)

    ReplyDelete
  13. ఆ అబ్బయి ఏమో కాని అలా ముక్కుమొఖం తెలియని వాడిముంది అలా అలంకరించుకొని కుర్చున్న ఆ అమ్మయి నచ్చలేదు నాకు.......డౌన్ డౌన్ పెళ్ళి చూపుల విధానం.. వ్యతిరేకిద్దాం అమ్మాయిలు అలంకరించుకునే విధానాన్ని....అభిప్రాయాల కలయికతో ఒకటయ్యే విధానం రావాలని ఆశిస్తూ.......(dont take serious this comment just for fun)

    ReplyDelete
    Replies
    1. ముక్కు ముఖం తెలియక పోవడం ఏంటి! అమ్మా నాన్న ఫోటో చూపించి వివరాలు చెపితేనే కదా.....అలా అలంకరించుకుని కూర్చుంది.....ఆ అయినా చూసుకున్న వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారా ఏంటండి? చోద్యం కాకపోతే:-)
      "SMILE PLEASE"

      Delete
  14. ఇదేదో మనకి నచ్చిన మ్యాటర్ పై రాసారు కదా...... "Yes" or "No" చెప్తా!
    అందరి అభిప్రాయాలు చదివి ఒక కమిటీవేసి అప్పుడు చెప్తా:-)

    ReplyDelete
    Replies
    1. తెలుగమ్మాకి తెలివెక్కువే:-)

      Delete
  15. పద్మ గారూ!...
    మీ సందేహం సరైనదే...
    ఎక్కడో కనిపిస్తున్నారు అలాంటి చక్కని అలంకరణతో
    అమ్మాయిలు.
    ఆ అమ్మాయినే అడిగి చూద్దాం మరి ఏమంటుందో...
    ఒకవేళ వద్దంటే...
    నేను మాత్రం చూడటానికి అలా వెళ్ళను గాక వెళ్ళను...:-)
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. అమ్మానాన్నలచాటు అమ్మాయిని ఏమడుగుతాం చెప్పండి...
      మీరు గుడ్ బాయ్ అందుకే అలావెళ్ళరని నాకుతెలుసుగా:-)

      Delete
  16. ఆ అబ్బాయితో మనకెందుకు కాని ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి ఫోన్ నంబర్ ఇవ్వండి. సంబంధం మాట్లాడాలి.

    ReplyDelete
    Replies
    1. అబ్బా.... అయితే చూడ్డానికి వస్తారని మళ్ళీ రెడీ అవ్వాలన్నమాట, మళ్ళీ పెళ్ళిచూపులా!!!:-)

      Delete
  17. మీ కవిత, చిత్రం చక్కగా ఉన్నాయి పద్మగారూ.
    అంత అందమైన అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారు.

    ReplyDelete
    Replies
    1. అంతేలెండి.....అందంచూసే ఇష్టపడతారన్నమాట, అందుకే కాబోసు అలా మారిపొమ్మంది ఆ తెలింగీష్ బచ్చా:-)

      Delete
  18. మరీ అలా అడిగేసారు కానీ పెళ్ళి చూపులు వరకే ఆ అలంకరణ కానీ వారు కారెక్కగానే అవన్నీ పీకి మీరూ 3/4th లోకి మారి పోతారు కదండీ ఈ కాలం అమ్మాయిలు...:-)
    ఏమైనా మార్పు సహజంగా జరుగుతునే వుంటుంది...
    అది మంచి వైపు జరగాలనే కోరిక...
    సంస్కృతీ సంప్రదాయాలు కూడా కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి...
    welcome the change in all attitudes...:-) Pic ఎప్పట్లానే ఆకట్టుకుంది మీరన్నట్టు కళ్ళు..

    ReplyDelete
    Replies
    1. మరీ నేను అడిగేసానని 3/4th నిజాలు చెప్పేస్తే ఎలాగండి:-)? ఈ ప్రశ్న అడిగింది 1/4th కోవకి చెందిన ఈ తరం అమ్మాయండి:-)
      మంచి మార్పుని సహజంగా అందరూ మెచ్చుకుని హర్షిస్తారు...
      కాలానుగుణంగా సంస్కృతీ సంప్రదాయాలు మారాలి, వాటితో పాటు ఆలోచనాధోరణి కూడా కాస్త ఉపయుక్తమైనదైతే బాగుంటుందేమోనండి!
      Thanks for sharing your views with us.....మీరూ ఆ కళ్ళని చూస్తూండిపోయారా:-)

      Delete
    2. ఆ కళ్ళు చూడ్డానికే మళ్ళీ వచ్చేనండీ..:-)

      Delete
    3. అలా చూస్తూ ఆదివారమంతా గడిపేతే మీ ఆవిడగారు అట్లకాడతిరగేస్తే నన్నాడిపోసుకోకండి:-)

      Delete
  19. అమ్మోలమ్మో..
    సోకుల్జూసి మోసపోవడానికి నువ్ నాలా పల్లెటూరి సికాకుళం పిల్లవి కాదు కదా?
    హైటెక్ సిటీ పిల్లవు..నీకే ఇన్ని అనుమానాలొత్తే మరి నేనేటై పోవాలా??

    ReplyDelete
    Replies
    1. ఎట్టెట్టా....
      సోకుల్జూసి మోసపోవడానికి సికాకుళం అయినా స్విజ్జర్లాండ్ పిల్లైనా ఒకటే కదేటి?
      అనుమానాలొత్తే నానడిగి తెలిసేసుకుంటే తప్పేటి?? నవ్వేసి ఊరుకుంటేపోలా:-)

      Delete
  20. అంతలేసి కళ్ళ , అథరాల దరహాస
    హాస భాసుర ముఖ వాసి చూడ
    'సూటు బూటు' వాడు ఘాటుగా నచ్చాడు
    'కాకి-దొండ పండు' కథ యెరుగమ ?
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. "సూటు బూటు" వేసుకోక పోయినా సంస్కారవంతుడైతే చాలంటి!
      "కాకి-దొండపండు" కధ కోకిలగానం కూడా విని మంచి మనసున్నోడు కావాలంటి:-)

      Delete
  21. padma garu....ye bandha apka layak nahi.. beshak "no" kahe dijiye
    kyunki..... zindagi tasveer bhi hai aur
    taqdeer bhi...!
    farq to rangon ka hai..!
    manchaahe rangon se bane to tasveer,
    aur
    anjaane rangon se bane to taqdeer........

    ReplyDelete
    Replies
    1. Malleshji.....har ek bandhe ke andhar koeyi na koeyi khameetoe zaroor hoga!
      taqdeer se bigidi huyi tasveer bhi banaale sakhtea hai agar ichchaa hotho...... kyaa kehethe hai aap:-)

      Delete
    2. udaasi tumpe beetegi to, tum bhi jaan jaoge,
      nazar andaaz honey se, badi takleef hoti hai......,

      Delete
    3. बरसता है कहीं बादल, तुम्हारी याद आती है l
      बिखरता है कहीं काजल, तुम्हारी याद आती है ll

      कभी बचपन, कभी टूटे खिलौने याद आते हैं,
      कहीं जब बजती है पायल, तुम्हारी याद आती है ll

      हथेली पे रखा चेहरा, रहेल पे जैसे रामायण,
      महकता है कहीं संदल, तुम्हारी याद आती है ll

      अकेला जब भी होता हूँ, किसी सुनसान कमरे में,
      तो धड़कन बोलती है चल, तुम्हारी याद आती है ll

      कभी खिड़की के परदे से, कभी दिवार औ दर से,
      कहीं जब उड़ता है आँचल, तुम्हारी याद आती है ll

      Delete
  22. chala chakkaga undi andi..

    ReplyDelete
    Replies
    1. mee prasamha naaki santhosam....intaki Yes or No cheppaledandi:-)

      Delete
  23. "ముక్కు ముఖం తెలియక పోవడం ఏంటి! అమ్మా నాన్న ఫోటో చూపించి వివరాలు చెపితేనే కదా.....అలా అలంకరించుకుని కూర్చుంది".....పరవాలేదండి. మరి పోటో చూసిన మీ అమ్మా నాన్న ఆ అబ్బాయి ఇలా మోడ్రన్ గా ఉంటాడు అని చెప్పలేదండి? చెప్పినా ఆ మోడ్రన్ అబ్బాయి ఎలా ఉన్నాడో చూద్దాం అనుకున్నారా ఏంటి?

    ReplyDelete
    Replies
    1. ఫోటో కోసం ఫోజులిచ్చేవారు చాలా మంది ఉంటారు కదా ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే ప్రయత్నమే ఈ పెళ్ళిచూపులనుకున్నాలెండి.

      Delete
  24. మీకైతే 'YES' అనే అంటాను పద్మార్పితా....ఎందుకంటే అన్ని సవ్యంగా ఉన్నవాడితో అయితే రొటీన్ లైఫ్ కదా! ఇలా అయితే కాస్త కిక్ ఉంటుందేమో:-)Picture is Marvelous!

    ReplyDelete
    Replies
    1. ఇదేదో మొదటికే ముప్పులా ఉందండి:-)

      Delete
  25. No anandi ...tarvata chepta enduko:)

    ReplyDelete
    Replies
    1. maree serial la tarvatendukandi...ippude cheppeste pola:-)

      Delete