నిజమయ్యే కల!

ఎందుకో మౌనమంటే భయం వేస్తుంది
మనసువిప్పి మీకో నిజం చెప్పాలనుంది
నాకు కలలు కనడమంటే ఎందుకో భీతి
నేడు కలిగె సత్యమంటే అమితమైన ప్రీతి!

కనులుగన్న కలలెన్నడూ నిజం కాలేదు
కల నిజమన్న భ్రమలో సత్యం దరిచేరలేదు
కలలు నేర్పిన పిరికితనం నిజానికి ముసుగేసింది
తెలివిలేనితనం సత్యాన్ని వీడి స్వప్నాల్లో తేలింది!

నేడు అనుకోని నిజాలు ఆకస్మికంగా వచ్చి వాలాయి
కలలో తేలి ఆడుతున్న నన్ను తట్టి నిదుర లేపాయి
సత్యానిది తప్పులేదు, అది హెచ్చరించి ఎదురునిలచింది
వెన్నుతట్టి ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకి నడిపించింది!

కలలను మరచి నిజాన్ని నిర్భయంగా కౌగలించుకోవాలి
సత్యబాటలో నడుస్తూ ధైర్యంతో కొత్తదిశలో పయనించాలి
చెడు అగ్నికి ఆహుతైతే సత్యం మౌనంవీడి చిందులేసింది
జ్ఞానాన్ని సత్యంతో చేతులు కలిపి నవ్వుతూ సాగమంది...

27 comments:

  1. మీరేదో దారి తప్పినట్లుందే! :)

    ReplyDelete
    Replies
    1. దారి తప్పనా దారిలో పడ్డానా?....డౌట్:-)

      Delete
  2. కలలను మరచి నిజాన్ని నిర్భయంగా కౌగలించుకోవాలి
    సత్యబాటలో నడుస్తూ ధైర్యంతో కొత్తదిశలో పయనించాలి...

    great lines Padmarpita గారు..
    ఉత్తేజకరమైన భావాన్ని పలికించారు.
    హృదయపూర్వక అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. మెచ్చేసుకున్నందుకు బోలెడు థ్యాంకులు :-)

      Delete
  3. U r something Different, & something special.. Nice:))- & image is a symbolic of Dream na...

    ReplyDelete
    Replies
    1. Of course I want to be my dear:-) Thanks for your compliments.

      Delete
  4. నిజంగా జరగనివాటినే ఊహించి కలలు కంటాం
    జరగని వాటిని తలచుకుని భయపడ్డం సహజం
    మీ కవిత INSPIRINGగా ఉందండి PADMA

    ReplyDelete
    Replies
    1. మీ వివరణకు ధన్యవాదాలు.

      Delete
  5. పంధా మార్చిన పద్మార్పిత గారు మంచి కవితనందించారు.. ..
    మీ చతుర్షష్టి కళలను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైనది కాబోలు.

    ReplyDelete
    Replies
    1. పంధా మార్చలేదండి పయనిద్దామన్న చిరుప్రయత్నం.
      ఏ ఒక్క కళా సరిగ్గా ఒంటబట్టని నన్ను చతురష్ట కళల గురించి కలలు కనమంటారా!.....అమ్మో నాకు భయ్యం:-)

      Delete
  6. మనిషి కలలు కనాలి. కాని ఆ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయకపోతే మాత్రమే అపజయాన్ని తన కళ్ళారా చూడాల్సి వస్తుంది. మీరు కలలే అసత్యాలు అన్నట్లు రాసారు. కలలు మనిషి అంతర్ముఖం లో ఉన్న భావాలకు ప్రతీకలే కదా. అయితే సత్యాన్ని మరిచి వాస్తవిక దృష్టి తో ఆలోచించకపోతే అనర్ధాలే ఎదురవుతాయి. మీ కవిత సత్యం వైపే అడుగులు వేస్తుంటే అదే నాకు హేతువాద ధోరణిలా అనిపించింది. అయినా వాస్తవిక విలువలను కాంక్షించిన మీ కవిత బేషుగ్గా ఉంది.

    ReplyDelete
  7. మీరు వ్యక్తపరచిన భావాలే నేను చెప్పాలనుకున్నవి కూడా....కలలు కంటూ అందులో విహరించడం మూలంగా అవి నేరవేరవు అంటే అవి నిజం కాదు ఊహలే అన్నభావం. బహుశా అది సరిగ్గా చెప్పలేకపోయానేమో! మీ విశ్లేషణాత్మక వ్యాఖ్యలకు ధన్యవాదాలు:-)

    ReplyDelete
  8. అయితే కలలు కనడం మానేసి,
    కార్యసాధనకు కృషిచేయమంటారు
    మీరేది చెప్పినా వెరైటీగా చెప్తారండి:-)

    ReplyDelete


  9. ఇదేమిటి పద్మార్పిత గారు ఇట్లాంటి కవితలు రాస్తారేమిటి ? అబ్బా, ఇట్లాంటివి రాయటానికి వేరే వాళ్ళు ఉన్నారండి. పద్మార్పిత కవితలు రాద్దురూ....

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. అదేంటో అలా వెలివేసి రాయొద్దంటే ఎలా...కలనైనా:-)

      Delete
  10. మీరు ఏ కవిత రాసినా అది అందమైన కలంత బాగుంటుంది. నిజం. ఇదిగో, ఈ పాటంత ...ఎన్నెన్నో వర్ణాలు చూపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన అంత అందమైందండి....నెనర్లు.

      Delete
  11. Loved your post until I bumped in to this line..
    "కలలను మరచి నిజాన్ని నిర్భయంగా కౌగలించుకోవాలి"
    I dont think living in 'reality' needs us to forget the dreams.. and also cant really accept the 'fear of reality' keeps someone in dreams.. it's actually the courage to redefine the 'reality' makes someone to dream.. :)
    Reality is such a funny and relative term u know.. what's real to me may not be real to someother.. and vice versa..
    for instance no body ever thought a piece of metal can ever fly in air until wrightbro's showd it and redefined the 'reality' the world know till then.. and it needs lot of courage to dream something like this while the rest of the world is ridiculing them saying how 'unreal' they are u know.. they holdon to ther dream until they redefined the reality..

    and u know those dreams are actually brooding place for the so called 'realities' the world teaches us... and cant really underestimate them :) they deserve a LOT of respect I think.. :)

    Nice image by the way.. and also loved the way u present ur thoughts :)

    ReplyDelete
    Replies
    1. Thanks for expressing your views and comments.

      Delete
  12. కలకీ, వాస్తవానికీ జరిగే (సం)ఘర్షణలో చివరికి వాస్తవమే గెలిచింది లా ఉంది మీ కవితలో.
    వాస్తవంలో జరగనివి కలల్లో కనిపిస్తేనే కలలు తీపి గా అనిపిస్తాయి.
    కలలోంచి వాస్తవంలోకి రావటం...మీదైన శైలిలో కవితలో చెప్పిన తీరు చాలా బాగుంది.
    అవునూ, ఆ బొమ్మా మీ సృష్టేనా?

    ReplyDelete
    Replies
    1. వాస్తవానికి అతీతంగా జరిగే ఊహించి కలలుకనే లోకాన్నే ఫాంటసీ అంటారేమో. కలో వాస్తవమో మీకు నచ్చినందుకు హ్యాపీ. ఆ చిత్రం ఒక సీనరీపైన కాస్త జిమిక్కులు చేసానంతేనండి:-)

      Delete
  13. check this.. :)
    http://www.youtube.com/watch?v=N2QZM7azGoA

    ReplyDelete
  14. Meeru yem cheppina right analanea untundandi ala mesmerism chestaru raatalatho:)

    ReplyDelete