ఇలా ఎందుకు???

అంతా భగవంతుని అనుగ్రహమే అనుకుంటే
అనురాగ అనుకోని అతిధుల ప్రవేశమెందుకు?

మూసిఉన్న మది చీకటి తలుపులు తట్టి తెరచి
వ్యధ వెలుగునిచ్చి విధిని నింధించడమెందుకు?

నాకు నేనెవరో తెలియక తెగిపడిన తోకచుక్కనైతే
అలజడిని అమాయకంగా జత చేయడమెందుకు?

ప్రేమచమురు ఇంకని దీపమై వెలుగొందుతుంటే
విహరించని వనంలో విశ్రాంతిని కోరడమెందుకు?

ఆశాకిరణాల మేలుకొల్పుతో వగలు విసరనీయకనే
విరియనిమొగ్గపై విరహసెగల వడగాల్పులెందుకు?

మైలురాయిగామారి మార్గబాటలో దారిచూపుతుంటే
బూటక విమర్శల సోపాన మాటల మార్గమెందుకు?

బంగారపు సాలెగూటిలో చిక్కి బంధమేదో తెలియకనే
విశాలగగనంలో వింతబంధపు వలపుయాత్రలెందుకు?

53 comments:

  1. ఇలా ఎందుకు ఎందుకు ఎందుకు??? అని అడగడం ఎంత కష్టమో జవాబులు రెట్టింపు కష్టం.
    అయినా అన్ని బంధాలకీ రీజన్స్ ఏం చెప్తాం, కొన్ని తెలిసీ తెలియనట్లు అంటీ అంటనట్లు ఉంటేనే బాగుంటుందని మీరు చెప్పకనే ఎన్నో సార్లు చెప్పారు. బొమ్మ ఆప్ట్ గా కుదిరింది. ఈసారి కాస్త గాప్ తీసుకుని రాసారు. కారణం అడిగినా చెప్పరు అని తెలుసు అందుకే అడగను :)

    ReplyDelete
    Replies
    1. ఎందుకు? ఏమిటి? ఎలా? అని అడగ్గా అడ్గ్గా ఎవరైనా చెప్పగపోతారా మహీ?:-) కొన్ని నీవన్నట్లుగానే బాగుంటాయి :-)

      Delete
  2. అదే జీవితం

    ReplyDelete
    Replies
    1. నిజమే ఇంకా మీ అంత అనుభవం లేని అల్పజీవిని కదండి :-)

      Delete
  3. Why this kolavari???

    ReplyDelete
  4. Good one!!!

    ReplyDelete
  5. Avunu.enduko teliste answer telsukovachu anukuntaamu.kani enduko telisina emi cheyyalemu konni vishayaallo.

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి స్వాగతం అనామికగారు. మీరు చెప్పింది తెలిసీ తెలియని లాజిక్ లా బాగుందండి. :-)

      Delete
  6. మనిషి తనకున్న బంధాలలోనే సంతృప్తిని పొందగలిగితే...వారితోనే అనుబంధాన్ని పెనవేసుకుంటే వేదన అనేదే ఉండదుగా...ఎంతో సంతోషాన్ని పొందగలరు....కాదంటారా?

    ReplyDelete
    Replies
    1. నిజమే అలా సంతృప్తి పడితే దాన్ని మించిన సంతోషం ఇంకేముంటుంది.....కానీ అలా తృప్తిపడ్డం రాకనే కదా ఇలా....ఎందుకు??? :-)

      Delete
  7. మదిలో మెదిలే భావాలు మాటలై నిను చేరేందుకు
    ఒంటరిగా పయనిస్తున్న నీకు ఊతమిచ్చేందుకు
    భారమైన కన్నుల్లో కునుకు జాడను వెతికి తెచ్చేందుకు
    వసివాడిన నీ అలక మోముపై చిరునవ్వు దివిటి వెలిగించేందుకు

    మీ ఎందుకు ??? ప్రశ్నకు జవాబుగా రాయాలని ...

    ప్రతి పదం లో ఏదో ఆర్ద్రత , భావభూతి ను చాల చక్కగా పదికరణ గావించారు పద్మగారు.

    శ్రీధర్ భుక్య

    ReplyDelete
    Replies
    1. చక్కని చిరుకవితతో జవాబిచ్చారుగా....థ్యాంక్యూ

      Delete
  8. ఎందుకో మీకైనా అంతుచిక్కుతుందేమో చూడండి.

    ReplyDelete
    Replies
    1. ఆలోచించి బుర్ర పనిచేయకే ఇలా.....మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నానేమో మీరాజ్ గారు :-)

      Delete
  9. ఎందుకంటూనే మీ ప్రశ్నలలోనే జవాబులు చెప్పే మీ తాత్వికత నాకెప్పుడూ ఇష్టం పద్మార్పిత గారూ.. వేలి ఆసరా విడిచి స్వేచ్చను కోరుకుంటున్న చిరు మనసును అక్కున చేర్చుకోవడమే జవాబు కాదా? చిత్రం ఎప్పటికంటే బాగుంది. ఇది మీ ఎంపికలో మీరు చూపే నూతనత్వానికి సజీవ సాక్ష్యం. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. ప్రశ్నలు వేసి జవాబులుకూడా చెప్పుకుని మనసుని సరిపుచ్చుకోవడం నా అలవాటండి....దీన్ని కొందరు ప్రశ్నా మీదే జవాబూ మీదే అనుకోవచ్చు కానీ తప్పదు కదా:-) నా ఈ ప్రక్రియ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీ కళాస్వాధ మనసు నెనర్లండి.

      Delete
  10. enduku ante anduke...:P


    --Roopa

    ReplyDelete
  11. పదిరోజుల అనంతరం పొందికైన పదాలతో పలికారు పద్మార్పితగారు....మీలా ట్రై చేస్తున్నాను, సారీ:-)

    ReplyDelete
    Replies
    1. నాలా ట్రై చేయడం ఏంటి....నాకన్నా బాగా రాయగలరు యోహంత్

      Delete
  12. దేవుడ్ని అయినా మానవుడ్ని అయినా అలా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు. అన్నీ కూడా జీవితంలో వచ్చే ఆటుపోట్లు అని నీకు చెప్పక్కర్లెద్దు అనుకుంటాను అర్పితా. ఎలా ఉన్నావు? ప్రేమ ఎడబాటు గురించి అనుభవం లేకుండానే సగంజీవితం సాగిపోయింది.....ఇలా నీ కవితల ఎడబాటు ఇప్పుడు అవసరామా చెప్పు? చక్కగా రాస్తుండు. ఆశిస్సులతో-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు.....మీ అంత తెలిసిన దాన్ని కాదులెండి. ఇలా కవితా ఎడబాటు కూడా ఉంటుందని ఇప్పుడేగా తెలిసింది :-).thank you

      Delete
  13. మూసి వున్నా మనసుని తెరచుకు వచ్చిన అతిధి మొదట్లో
    చీకటిని ప్రారద్రోలె చిరు దీపం అయితే , కాలక్రమేనా
    హృదయాన్ని జ్వలించే జ్వాల లా మారుతోంది
    మన ఉనికినే గుర్తించని శిలలా
    నిద్రలో కరిగి పోయిన కలలా
    చిరిగిపోయిన వల లా
    సునామిని సృష్టించే అలలా
    కాల గర్భం లో కరిగి పోయిన జ్ఞాపకం లా
    జీవితాన్ని చిదిమేసిన చితా భస్మం లా
    నిజమే మరి ఎందుకో అలా
    కళ్ళల్లో నీరు వలవలా
    అందుకే మనసు కోరుకుంటోంది రాకోయి అనుకోని అతిధి అని .

    ReplyDelete
    Replies
    1. రవిగారు..... ఇలా అనుకోకుండా వచ్చి, మాకు తెలిసీ తెలియని విషయాలని చెప్పనా మాననా అన్నట్లుగా చెప్పి అదృశ్యమవ్వక అప్పుడప్పుడూ విచ్చేస్తూ ఉండండి....ఎంతైనా బ్లాగ్ లో ఎప్పటి నుండో పలకరించుకునే పరిచయం మనది :-) thanks Q

      Delete
  14. అందంగా అడిగారు అడగాల్నినవి.

    ReplyDelete
    Replies
    1. అడిగానే కానీ సరైనా సమాధానం ??? :-)

      Delete
  15. ఎందుకు ఎందుకు అని చాలా ప్రశ్నలే అడిగెసావు. ఎవరి జీవితం వారి ప్రశ్నలకు సమాధానం చెపుతుంది. చాల చాల బాగుంది:-)) ఇమేజ్ చాలా బాగుంది:-))

    ReplyDelete
    Replies
    1. శృతి...ఇలా అడిగి విసుగు తెప్పించానా :-)

      Delete
  16. ప్రేమచమురు ఇంకని దీపమై వెలుగొందుతుంటే
    విహరించని వనంలో విశ్రాంతిని కోరడమెందుకు?....meeu vishraanti korukunte...endariko shanti dooram avutundi ....meeru raastu undalani...o abhimani..

    ReplyDelete
    Replies
    1. నేను విశ్రాంతి తీసుకుంటే అప్పుడొచ్చే ఆలోచనలతో మీ బుర్రల్ని ఇంకా పాడుచేస్తానని ఇలా ఇండైరెక్ట్ గా చెప్పారా? :-) thank you abhimaani

      Delete
  17. Nicely Xpressed !!! :) cheers

    ReplyDelete
  18. మీ భావుకతకు, మీలోని భావావేశాలకు దర్పణం ఈ కవిత.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానంలా అన్నమాట!

      Delete
  19. Excellent blog and every post is an master piece. Decorated as an beautiful art gallery. Keep on going padmarpita.

    ReplyDelete
    Replies
    1. thank you very much anonymous for visiting my blog and appreciating me with your comments.

      Delete
  20. మది తలపుల్లో గది తలపుల పై పేర్చిన భావాల దొంతరల కదలికలన్నీ
    ఆర్చికూర్చి పేర్చారు..ప్రశ్నలే జవాబులుగా మారి ఓ నవాబు చేసిన చట్టాలను మనసుగీతికలుగా చెప్పిన తీరు అద్బుతం పద్మాగారు

    ReplyDelete
    Replies
    1. మీ ఈ ప్రశంసా పదాలు మదిలో పదిలం....థ్యాంక్యూ

      Delete
  21. పాత పోస్ట్లకి ప్రస్తుతం రాస్తున్నవాటికి వ్యత్యాసం కనిపిస్తుందండి పద్మార్పితగారు.....కాస్త పదాల మధ్య సంధిని విడగొడితే సులువుగా అర్థమౌతుందేమో నాలాంటివారికి.

    ReplyDelete
    Replies
    1. నిజమే అనికేత్ దిన దిన ప్రవర్థమానమవుతూ తమ కవితాభినివేశంతో ఇంతమంది మదిని దోచిన పద్మార్పిత గారికి హేట్సాఫ్ కదా.. కాస్తా వయసొచ్చాక అర్థమవుతాయిలే విడగొట్టకుండానే..:-)

      Delete
    2. విడిగా రాస్తే ఒక్కసారే చదువుతారు ఇలా అయితే మరోమారు చదువుతారన్న ఆశ అనికేత్. :-)

      Delete
    3. ధన్యవాదాలండి మీ అభిమానానికి అనానిమస్ గారు.

      Delete
  22. 300 కవితలు దాటిన బ్లాగును వర్ణ రంజితముగా కనువిందులు చేస్తూ ముందుకు నడుపుచున్న మీకు అభినందనలు.

    కందము:
    అందరు మెచ్చిన కవితల
    నందముగా వర్ణచిత్ర మాధారముగా
    వందలు మూడును దాటుచు
    విందులనందించినారు వివిధపు రుచులన్.

    ReplyDelete
    Replies
    1. బ్లాగ్ కి విచ్చేసి వీక్షించిన మీకు మీ ఈ ప్రశంసా కందమునకు ప్రణామములు

      Delete
  23. నేర్చుకున్న పాఠాలకి
    వల్లెవేసే సమయమొచ్చింది
    మాట వినని మనసులకి
    కళ్లెమేసే సమయమొచ్చింది

    కొత్త బంధాలు నీ నీప్రేమలో పరిపూర్ణతకి
    పరమాత్మిచ్చే అనుమతి లాంటివి
    అవి మనసుకి ఇంకాస్త వేడిచేసి
    మెరుగులు దిద్దుతాయి వెలుగునిస్తాయి.

    మలుపులు జీవితంలో నేనా?
    కాలం లో నేనా? లేక
    వాటితో పాటు నీలో కుడానా?
    అన్న ప్రశ్నలు వేస్తాయా బంధాలు.

    సాలీడు తన గూటిలోని ధారాల
    నడుమ ఎప్పుడూ చిక్కుకోదు
    ప్రేమతో నేసుకున్న బంధమెప్పుడూ
    అవరోధాంగా మారబోదు


    తగిలించుకున్న తయారుచేసుకున్న
    నందన వనాలు వీడి
    ఎదుర్కోవలిసిన బంధన వనాలలోనే
    నిజమైన "సేద" తీర్చుకోవచ్చు


    ఉత్కంఠని కాస్త ఆస్వాదిస్తే
    వనమంతా నందన వనమే
    చీకటితో కాస్త చెలిమేచేస్తే
    రేయంతా వెలుగుల దినమే


    ఎక్కువ చీకటిలో మునిగితే
    వెలుగులో వెలుగు కానలేం
    ఎక్కువ వెలుగులో మరిగితే
    చీకటినీ చూడలేం. అది సహజం.

    ప్రేమలు నిండితేనే యాత్రలు
    వలపులమయమౌతాయి
    పరిణయానికి ప్రణయానికి
    ప్రేమలే ప్రమాణాలవుతాయి

    "చేతులు నిండుగా చాస్తున్న
    వింతబంధమే నీ గగన ప్రపంచమౌతుంటే
    ప్రతీ కొత్త మలుపుతో ఓ మైలురాయే
    నీకు శుకాంక్షలందిస్తుంది"


    మాటలదేముంది అవి వినటానికే
    వింపించుకోవడానికి కాదు
    సమస్యలదేముంది తగిలిపోడానికే,
    తగిలించుకోవడానికికాదు.

    believe in you. :)

    - సత్య






    ReplyDelete
  24. Can I meet u once as I admire u as a great woman with will power n i am ur great fan ? I stay @tarnaka ,hyd. If ur comfortable only ....

    ReplyDelete
    Replies
    1. Thanks for your admiring & encouraging words my dear Anu. Why not? one fine day we will....let us wait for that day :-)

      Delete
  25. శైలిమారినా ప్రేమభావం పొంగిపొర్లుతుంది.

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత మదియే ప్రేమమయం.....ఇంక శైలిమారినా భాషమారినా భావం మారునా :-)

      Delete
  26. నాకు నేనెవరో తెలియక తెగిపడిన తోకచుక్కనైతే
    అలజడిని అమాయకంగా జత చేయడమెందుకు?

    ఇలా తోక చుక్కలా వెలిగి ఆరిపోతే చాలు కదండీ పద్మార్పితాజీ.. జీవితంలోని నలుపు తెలుపుల విడదీయని బంధాన్ని చక్కని చిత్రంతో ఆవిష్కరించారు. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మరీ ఇంత అల్పసంతోషిలా మాట్లాడితే ఎలాగండి.....thank you.

      Delete