ఎదురుగా ఉంటే చెవిలో చిన్న మాటైనా చెప్పవు!
ఊహల విహంగంలో స్వర్గపుటంచులనే చూపించి...
సరసన చేరి సుతారంగా చేయి అయినా నొక్కవు!
అందాలరాశినంటూ అక్షరాల్లో అనేకసార్లు మెచ్చి...
ఒంటరిగా ఉన్నవేళ ఓరకంట చూసి ఒడిచేర్చుకోవు!
ఎదలో ఎగసిపడుతున్న కోరికలన్నింటినీ అణిచి...
నింధించబోయిన నిగ్రహాన్ని నిద్రపుచ్చి నిలబడ్డావు!
ఇది అదేనా! అని అడిగిన నా కంటనీరును గాంచి...
అడిగిన ప్రశ్నకి జవాబుగా అక్కున చేర్చుకున్నావు!
వీడ్కోలుచెప్పి వెళుతూ నీ గుండెల్లో గుడికట్టి కొలిచి...
నన్ను నీ దేవేరిగా కొలువు ఉండి పొమ్మని అంటావు!
Padmaji lovely poem with sweet painting.
ReplyDeleteThank you Payal
Deleteమీలా భావుకత్వం ఉన్నవారికి అయితే చెప్పకుండానే మనసు భాష అర్థమైపోతుంది కదండీ:-) గతస్మృతులని గుర్తు చేసారు.
ReplyDeleteఅడగంది అమ్మైనా పెట్టదు
Deleteచెప్పంది ప్రేమైనా అర్థంకాదు కదా మహీ :-)
ఎంత చక్కటి హృదయావిష్కరణ. ఎదనిండా ప్రేమ నిండినవారే ఇలా రాయగలరు అనడంలో అతిశయోక్తి లేదండి.ఫెంటాబులస్ పోఎట్రి మేడం...
ReplyDeleteథ్యాంక్యూ...ప్రేమ ఉందని ఒప్పుకున్నారుగా :-)
Deleteచిన్న మాటేం ఖర్మ, నా ప్రేమనంతా మాటల్లోనే చెబుదామనుకున్నాను
ReplyDeleteనిన్ను సంతోషపెట్టేలా ఏ మాట ముందు చెప్పాలో తెలీక కొట్టుమిట్టాడాను
సుతారంగా చేయి నొక్కాలనే అనుకున్నాను
స్వర్గపుటంచుల్లో ఉన్న నీకు అంతకన్నా మించిన స్వర్గం చూపించలేనేమోనని గమ్మునున్నాను
ఓరకంట చూడాలనే అనుకున్నాను
చూపు సెగకు నీ అందం కమిలిపోతుందేమోనని భయపడ్డాను
మరేం చెయ్యమంటావు
ఎగసిపడే కోరికలకు నిన్ను ఎరగా వేయాలనిపించలేదు
ఈ అగ్నిపర్వతాన్ని ఇలాగే రగలనీ
అక్కున చేర్చుకున్నప్పుడైనా నీకనిపించలేదా
ఇది అదేనని
అడగకుండానే వరమిస్తావన్న ఆశతో నిన్ను దేవేరిని చేశాను
అర్థం చేసుకోక కన్నీరు పెదతావెందుకు
భలే సరదాగా సరసాన్ని జోడించి సమాధనం ఇచ్చారు
Deleteమహా గొప్ప ప్రేమికులండీ మీరు :-)
Deleteఅవి ఆనంద భాష్పాలేమో నిశితగా పరిశీలించండి :-)
Deleteమీరు ఇంత అనురాగం మేళవించి అనునయిస్తే మీ దేవేరి మీ గుండెల్లో ఏంటి మీరు వద్దన్నా మీ వెంటే పడి పడి వస్తుంది :-) మంచి కవితను జవాబుగా ఇచ్చారు, థ్యాంక్యు.
Deleteఏం చెప్పలేదని అభాండం వేసారే కానీ గుండెలోనే గుడి కట్టారు గమనించలేదా! :-)
ReplyDeleteఇలా ఫోజ్ కొడితే మరికాస్త ప్రేమ దక్కుతుందని :-) అర్థం చేసుకోవాలి మరి :-)
Deleteబాగుందండీ వ్యాఖ్యలు అంతకంటేను ;)
ReplyDeleteవెల్ కం మేడం. ఇది మీ అందరి అభిమానమండి.
Deleteఅహా ఎంత ఘాటు ప్రేమయో, గుండెనే గుడిగా చేసి కొలువుండమన్నాడు
ReplyDeleteఘాటైన ప్రేమకు ఆటుపోట్లు కూడా ఉంటాయి మరి :-)
Deleteనింధించబోయిన నిగ్రహాన్ని నిద్రపుచ్చి నిలబడ్డావు
ReplyDeleteఇలా నిలబడ్డానికి చాలా నిగ్రహం కావాలి. గ్రేట్ కదా :-)
నిజమే, ఇది అందరికీ సాధ్యం కాదండి :-)
Deleteమగువ మనసు మురిసే వేళ
ReplyDeleteమగని మమకారం తెలిసే వేళ
మనసులో దాగిన మాటలు మౌన రాగాన్నే ఆలపిస్తాయి
తన మనసులో రేగిన ఊహను వ్యక్త పరిచితే ఏమౌతుందోనన్న సంశయం కనుకే ఏ మాట నోట పలకదు. చనువు చొరవ పెరిగే కొలది ఆ మౌనమే పలకరిస్తుంది మదిలొ దాగిన అదే ఉబికి వన్తుంది.
మగువ మనసు సంద్రమైతే అలలు తన మనసులోని మాటలు
చల్లని జాబిల్లి వెన్నెల వెలుగే మగని మనసులోని సరాగాలు.
చక్కగా ఉంది పద్మగారు.
చిత్రం పాత తెలుగు నవల కవర్ పేజి ని తలపిస్తుంది పద్మగారు ఏ యండమూరి వీరేంద్రనాథ్ గారో లేక యద్దనపూడి సులోచన రాణి గారినో ప్రతిబింబిస్తుంది.
It is true, when we know, that we are being loved, it is not so easy to convey the same as fast as we can, because one fears loosing the valuable person one got in his/her life.
Disclaimer: All thoughts in this comment do not point to any person living or dead. If anyone thinks that these are from their lives, they may consider as purely coincidental.
ప్రేమ గురించి అందరికీ ఇంత బాగా తెలుసు నాకేం తెలీదు :-(
Deleteనాకు అసలికి ప్రేమ అంటే ఏంటో కూడా తెలీదు
Delete"మన" అనుకునే వాళ్ళు బాగుంటే అదే పదివేలు
మీరు నమ్మండి నమ్మకండి కాని ఇదే నిజం.
నమ్మకమే వారధి జీవితానా
మనసు చదివి మెలిపెట్టి చెప్పగల మీరు మనసు ప్రేమ గురించి తెలియదు అనడం అన్యాయమండి. మేము అమాయకులమే కానీ మరీ ఇంత కాదు శ్రీధర్ గారు :-)
Deleteఖచ్చితంగా ప్రేమే...కాకపోతే అబ్బాయే కాస్త అమాయుకుడిలా నటిస్తున్నాడు. మొత్తానికి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటే మాటలతో పనిలేదు :-)
ReplyDeleteఏమో నిజమేమో నేను చెప్పిన మాట అదే కదా ఆకాంక్ష గారు. ఏదేమైనా పద్మా గారి కవితలు ఆలోచింపజేస్తాయి.
Deleteఆకాంక్ష చెప్పినది శిలాశాసనం :-)
Deleteశ్రీధర్ గారి ఆలోచనలకి కొదవా చెప్పండి :-)
DeleteLovely poem N romantic feel
ReplyDeleteThank you Srinath
Deleteప్రేమ పోయంస్ మీరు రాసినవి చదువుతుంటే మళ్ళీ మళ్ళీ ప్రేమించాలి అనిపిస్తుంది
ReplyDeleteఆలస్యం ఎందుకు ప్రేమించండి, ప్రేమిస్తూనే ఉండండి అందరినీ :-)
Deleteపద్మగారు ఏంటి మాంచి ఫాంలో ఉన్నారు :-) ప్రేమ పాటలు పాడుతున్నారా.:-) సున్నిత పలుకుల్లో మధుర భావం. పాత జ్ఞాపాకాలని తడుముతుంది చిత్రం.
ReplyDeleteఅయాం ఆల్వేస్ ఇన్ ద ఫాం :-) తలుచుకోండి మీ జ్ఞాపకాలని
Deleteఇది అదేనా! అని అడిగిన నా కంటనీరును గాంచి...
ReplyDeleteఅడిగిన ప్రశ్నకి జవాబుగా అక్కున చేర్చుకున్నావు! touching lies.. mere ilaa raayagalaru..
ప్రేమించే హృదయం మీది అందుకే హత్తుకోగలిగాయి నా అక్షరాలు
Deleteromantic poem ki sentiment tounch icharu madam. nice
ReplyDeleteThank you Roopaji
Deleteఇది తప్పక కమ్మని ప్రేమకావ్యమేనండి.
ReplyDeleteఅంతేనంటారా !
Deleteప్రేమకవితల స్పెషలిస్టు...పద్మర్పితే బెస్టు
ReplyDeleteఓహో...ఇలా అని ఇచ్చారు మీరు ఇచ్చారుగా కమెంట్లో ఒక ట్విస్ట్:-) thank you.
Deleteప్రేమార్పితం.... మీ కవిత :-)
ReplyDeleteధన్యురాలిని :-)
Deleteఎవరు ఎన్ని వ్రాసినా పద్మార్పిత ప్రేమకి అర్పిత మీ స్టైల్లో చెప్పారు. బాగుంది కవిత.
ReplyDeleteనయనిగారు...స్టైల్ అని చెప్పి సైలెంట్ గా సామెతని చెప్పకుండా తప్పించుకున్నారు :-)
Deleteఅదే అదే
ReplyDeleteఅది అంతేనంటారా!
Deleteఅచంగా మాలాగే వీరిరువురు
ReplyDeleteప్రేమే మీలోకం కదండి:-)
Delete