వీడెందుకో నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసాడు...
పుచ్చిన సచ్చు ఆలోచనలు లేని రానివాడు
భయపడితే పళ్ళికిలిస్తూ నాతో ఆడుకుంటాడు!
ఏ దాహం తీర్చమని నన్ను అడగలేని వాడు...
లవ్వంటూ జివ్వుమని లొట్టలేస్తూ జుర్రుకోలేడు
అన్నిటికీ ఒకే భావం చూపి నా మదిని దోచాడు!
వీడు అగ్గిలో బూడిదై మనసంటూ లేనివాడు..
మనస్సాక్షంటూ బాసలుచేసి బంధం వీడిపోడు
ఖాళీపుర్రెతో నన్నేమెచ్చి నాకేనచ్చిన హీరో వీడు!
అందుకేనేమో వీడు నాకు భలేగా నచ్చేసాడు...
మూడుముళ్ళంటే మూడార్లు నెత్తిన చూపుతాడు
తిట్టినా మొట్టిన గాలిలో తిరుగుతూ నా వెంట వస్తాడు!
పుచ్చిన సచ్చు ఆలోచనలు లేని రానివాడు
భయపడితే పళ్ళికిలిస్తూ నాతో ఆడుకుంటాడు!
ఏ దాహం తీర్చమని నన్ను అడగలేని వాడు...
లవ్వంటూ జివ్వుమని లొట్టలేస్తూ జుర్రుకోలేడు
అన్నిటికీ ఒకే భావం చూపి నా మదిని దోచాడు!
వీడు అగ్గిలో బూడిదై మనసంటూ లేనివాడు..
మనస్సాక్షంటూ బాసలుచేసి బంధం వీడిపోడు
ఖాళీపుర్రెతో నన్నేమెచ్చి నాకేనచ్చిన హీరో వీడు!
అందుకేనేమో వీడు నాకు భలేగా నచ్చేసాడు...
మూడుముళ్ళంటే మూడార్లు నెత్తిన చూపుతాడు
తిట్టినా మొట్టిన గాలిలో తిరుగుతూ నా వెంట వస్తాడు!
మీకు నచ్చేసాడంటే తప్పకుండా స్పెషల్ పెర్సనాలిటీ ఆండ్ గ్రేట్ సెలబ్రిటీ అయి ఉంటారు :-)
ReplyDeleteమీకు నచ్చితే మాకు నచ్చినట్లే. ఆలస్యం ఎందుకు మూడు ముళ్ళు కాదు కాదు 666 ముళ్ళు వేయమనండి చచ్చి వ్రేలాడుతుంటాడు మీ వెంట :)
ReplyDeleteమీకు కావలసిన వారు గాలిలో తెలిపోయే దెయ్యమై ఉండాలా :-)
ReplyDeleteఅన్యాయం అక్రమం దురాగతం దౌర్జన్యం భూమిపై బ్రెయిన్ లేని వాళ్ళం మేమంతా వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే మీరు గాల్లో ఎగిరి ఊగే పుర్రెని మీ హీరోగా సెలెక్ట్ చేసుకోవడం. నచ్చేసాడంటూ మా గుండెలపై బాంబులు రువ్వడం అమానుషం :-)
ReplyDeleteదీపావళి స్పెషల్ ఏమో మహి గారు ఈ కొత్త పుర్రె బాంబు :-)
DeleteHa ha ha.... మేడం ఇలా ఎలా రాసేస్తారో మీరు . భలే ఉన్నాడండి మీ హీరో....
ReplyDeleteమొత్తానికి భయపెట్టారు :-)
నైస్ సెలక్షన్
ReplyDeleteనేను బాధలో ఉన్నా ఈ కవితతో అలరించారు
ReplyDeleteఏదేమైనా గ్రేట్ అండి తమరు పద్మగారు
ఇహ
నిటారుగా నిలవని వాడు
అస్తికల పుర్రేవాడు
ఎలా సరితూగాడు
తునిక యంత్రాన జోకిన తన ఎముకలకు మించి ఏమిలేనోడు
గుండెకూడా ఎక్కడుందో (ఎక్కడ పడిపోయిందో) ఎరుగనివాడు
పైనుండి కిందదాకా ఎముకలే బొక్క బోర్ల పడితే విరిగిపోయే వాడు
అవయవాలు లేని ప్రేతాత్మ పంజరం వాడు ఎలా నచ్చాడు
భావాలు భావోద్వేగాలు తెలినోడు
నవ్వమన్న ఎదవామన్న పళ్ళు మాత్రమె ఎకిరించే వాడు
మూడు ముళ్ళకు బదులు మూడార్లు పెట్టె ఘనుడు
ఎలా ఎలా ఎలా నచ్చాడు ఇప్పటికే బ్రతికి సచ్చాడు :-)
(హాస్యం వ్యంగ్యం ప్రయోగించాను పద్మగారు )
మీ దీపావళి కవిత బాగుంది.
అమ్మో...మీ కలల రాకుమారుడిని చూస్తే భయమేస్తుంది...అయినా ఇంత భయాన్ని గొల్పే ఈ పుర్రె మనిషి మీకెలా నచ్చాడండి..కాకపోతే మీ మదిని దోచిన వాడు, మనస్సాక్షంటూ బాసలుచేసిన వాడు కాబట్టి మీ కవితలో కథానాయకుడిగా మాకూ నచ్చేశాడు..
ReplyDeleteహా హా ఎముకల వీరుడు మీ మీరాకుమారుడు. చూడచక్కనోడు మీ మనసు దోచినాడు :-)
ReplyDeleteమీరు కపాళం పైన కూడా కరుణ చూపించి ప్రేమించగలరు. గొప్ప మనసు మీది.
ReplyDeleteపుర్రెలని ప్రేమిస్తానంటూ తుపాకీ తూట్లు పేల్చకండి మా మనసులో. :-)
ReplyDeleteఇంతమంది ఉండగా వీడు నచ్చాడేవిటో...పద్మ అన్నిటిలో స్పెషల్
ReplyDeleteనిజంగా మాయా మర్మం తెలీనోడు, నాకూ నచ్చేశాడు పద్మా.
ReplyDeleteపద్మా బాగున్నాడు నీకు నచ్చినవాడు.
ReplyDeleteతప్పకుండా ప్రత్యేకలక్షణాల గుణసంపన్నుడేవాడు-హరినాధ్
పద్మగారు ఏంటో అంతా మీ భ్రమ :-) మీకవితలు చదివి బొమ్మలు చూసి పుర్రె కూడా పిచ్చెక్కి వెర్రివేషాలు వేస్తుందేమో:-)...ఆలోచించండి.
ReplyDeleteఏమోనండి ఆకాంక్ష గారు. నిజంగా దయ్యాలు చదవగలరంటారా?
Deleteదాహం తీర్చమని ఇప్పుడు మిమ్మల్ని అడగడు సరే,
ReplyDeleteగతంలో కూడా ఎవరినీ అడిగిన దాఖలాలు కనబడటం లేదు
అన్ని పళ్ళూ రాలకుండా అలాగే ఉన్నాయి చూడండి!
Madamji marie bhootalakanna teesipoyama manushulam. meru chepparu ante adi rule anthe :-)
ReplyDeleteవామ్మో గిట్ల సెప్పి పరేషాన్ జేయమాకు ఓయ్ పదమ్మ.సచ్చి నేను పీనుగును గాలేను గదా :) :p
ReplyDeleteమీరు వెరైటీగా ప్రేమించగలరేమో కానీ మాయవిశ్వం జంట మనుషుల మధ్యనే సుమా
ReplyDeleteyour choice is unltimately good padmaji.బాగుంది
ReplyDeleteeeayanaite mari no more danger kadaa.. proceed..:-P
ReplyDeleteమీకు నచ్చినోడు నాకు నచ్చాడు
ReplyDeleteఏ దాహం తీర్చమని నన్ను అడగలేని వాడు...
ReplyDeleteలవ్వంటూ జివ్వుమని లొట్టలేస్తూ జుర్రుకోలేడు
మనస్సాక్షంటూ బాసలుచేసి బంధం వీడిపోడు
ఈ మూడులైన్స్ లో లోతట్టుభావాన్ని పలికించారు పద్మా,
మీ భావాలోచనల సారాంశం అమోఘం.
స్పందించి నా భావాలకి ఊపిరిపోస్తున్న ప్రతి అభిమాన హృదయానికి మనస్పూర్తిగా అంజలిఘటిస్తున్నాను.....మీ పద్మార్పిత. _/\_
ReplyDelete