నాకు నచ్చేసాడు

వీడెందుకో నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసాడు...
పుచ్చిన సచ్చు ఆలోచనలు లేని రానివాడు
భయపడితే పళ్ళికిలిస్తూ నాతో ఆడుకుంటాడు!

ఏ దాహం తీర్చమని నన్ను అడగలేని వాడు...
లవ్వంటూ జివ్వుమని లొట్టలేస్తూ జుర్రుకోలేడు
అన్నిటికీ ఒకే భావం చూపి నా మదిని దోచాడు!

వీడు అగ్గిలో బూడిదై మనసంటూ లేనివాడు..
మనస్సాక్షంటూ బాసలుచేసి బంధం వీడిపోడు
ఖాళీపుర్రెతో నన్నేమెచ్చి నాకేనచ్చిన హీరో వీడు!

అందుకేనేమో వీడు నాకు భలేగా నచ్చేసాడు...
మూడుముళ్ళంటే మూడార్లు నెత్తిన చూపుతాడు
తిట్టినా మొట్టిన గాలిలో తిరుగుతూ నా వెంట వస్తాడు!

26 comments:

  1. మీకు నచ్చేసాడంటే తప్పకుండా స్పెషల్ పెర్సనాలిటీ ఆండ్ గ్రేట్ సెలబ్రిటీ అయి ఉంటారు :-)

    ReplyDelete
  2. మీకు నచ్చితే మాకు నచ్చినట్లే. ఆలస్యం ఎందుకు మూడు ముళ్ళు కాదు కాదు 666 ముళ్ళు వేయమనండి చచ్చి వ్రేలాడుతుంటాడు మీ వెంట :)

    ReplyDelete
  3. మీకు కావలసిన వారు గాలిలో తెలిపోయే దెయ్యమై ఉండాలా :-)

    ReplyDelete
  4. అన్యాయం అక్రమం దురాగతం దౌర్జన్యం భూమిపై బ్రెయిన్ లేని వాళ్ళం మేమంతా వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే మీరు గాల్లో ఎగిరి ఊగే పుర్రెని మీ హీరోగా సెలెక్ట్ చేసుకోవడం. నచ్చేసాడంటూ మా గుండెలపై బాంబులు రువ్వడం అమానుషం :-)

    ReplyDelete
    Replies
    1. దీపావళి స్పెషల్ ఏమో మహి గారు ఈ కొత్త పుర్రె బాంబు :-)

      Delete
  5. Ha ha ha.... మేడం ఇలా ఎలా రాసేస్తారో మీరు . భలే ఉన్నాడండి మీ హీరో....
    మొత్తానికి భయపెట్టారు :-)

    ReplyDelete
  6. నేను బాధలో ఉన్నా ఈ కవితతో అలరించారు
    ఏదేమైనా గ్రేట్ అండి తమరు పద్మగారు

    ఇహ

    నిటారుగా నిలవని వాడు
    అస్తికల పుర్రేవాడు
    ఎలా సరితూగాడు

    తునిక యంత్రాన జోకిన తన ఎముకలకు మించి ఏమిలేనోడు
    గుండెకూడా ఎక్కడుందో (ఎక్కడ పడిపోయిందో) ఎరుగనివాడు
    పైనుండి కిందదాకా ఎముకలే బొక్క బోర్ల పడితే విరిగిపోయే వాడు
    అవయవాలు లేని ప్రేతాత్మ పంజరం వాడు ఎలా నచ్చాడు

    భావాలు భావోద్వేగాలు తెలినోడు
    నవ్వమన్న ఎదవామన్న పళ్ళు మాత్రమె ఎకిరించే వాడు
    మూడు ముళ్ళకు బదులు మూడార్లు పెట్టె ఘనుడు
    ఎలా ఎలా ఎలా నచ్చాడు ఇప్పటికే బ్రతికి సచ్చాడు :-)

    (హాస్యం వ్యంగ్యం ప్రయోగించాను పద్మగారు )

    మీ దీపావళి కవిత బాగుంది.

    ReplyDelete
  7. అమ్మో...మీ కలల రాకుమారుడిని చూస్తే భయమేస్తుంది...అయినా ఇంత భయాన్ని గొల్పే ఈ పుర్రె మనిషి మీకెలా నచ్చాడండి..కాకపోతే మీ మదిని దోచిన వాడు, మనస్సాక్షంటూ బాసలుచేసిన వాడు కాబట్టి మీ కవితలో కథానాయకుడిగా మాకూ నచ్చేశాడు..

    ReplyDelete
  8. హా హా ఎముకల వీరుడు మీ మీరాకుమారుడు. చూడచక్కనోడు మీ మనసు దోచినాడు :-)

    ReplyDelete
  9. మీరు కపాళం పైన కూడా కరుణ చూపించి ప్రేమించగలరు. గొప్ప మనసు మీది.

    ReplyDelete
  10. పుర్రెలని ప్రేమిస్తానంటూ తుపాకీ తూట్లు పేల్చకండి మా మనసులో. :-)

    ReplyDelete
  11. ఇంతమంది ఉండగా వీడు నచ్చాడేవిటో...పద్మ అన్నిటిలో స్పెషల్

    ReplyDelete
  12. నిజంగా మాయా మర్మం తెలీనోడు, నాకూ నచ్చేశాడు పద్మా.

    ReplyDelete
  13. పద్మా బాగున్నాడు నీకు నచ్చినవాడు.
    తప్పకుండా ప్రత్యేకలక్షణాల గుణసంపన్నుడేవాడు-హరినాధ్

    ReplyDelete
  14. పద్మగారు ఏంటో అంతా మీ భ్రమ :-) మీకవితలు చదివి బొమ్మలు చూసి పుర్రె కూడా పిచ్చెక్కి వెర్రివేషాలు వేస్తుందేమో:-)...ఆలోచించండి.

    ReplyDelete
    Replies
    1. ఏమోనండి ఆకాంక్ష గారు. నిజంగా దయ్యాలు చదవగలరంటారా?

      Delete
  15. దాహం తీర్చమని ఇప్పుడు మిమ్మల్ని అడగడు సరే,
    గతంలో కూడా ఎవరినీ అడిగిన దాఖలాలు కనబడటం లేదు
    అన్ని పళ్ళూ రాలకుండా అలాగే ఉన్నాయి చూడండి!

    ReplyDelete
  16. Madamji marie bhootalakanna teesipoyama manushulam. meru chepparu ante adi rule anthe :-)

    ReplyDelete
  17. వామ్మో గిట్ల సెప్పి పరేషాన్ జేయమాకు ఓయ్ పదమ్మ.సచ్చి నేను పీనుగును గాలేను గదా :) :p

    ReplyDelete
  18. మీరు వెరైటీగా ప్రేమించగలరేమో కానీ మాయవిశ్వం జంట మనుషుల మధ్యనే సుమా

    ReplyDelete
  19. your choice is unltimately good padmaji.బాగుంది

    ReplyDelete
  20. eeayanaite mari no more danger kadaa.. proceed..:-P

    ReplyDelete
  21. మీకు నచ్చినోడు నాకు నచ్చాడు

    ReplyDelete
  22. ఏ దాహం తీర్చమని నన్ను అడగలేని వాడు...
    లవ్వంటూ జివ్వుమని లొట్టలేస్తూ జుర్రుకోలేడు
    మనస్సాక్షంటూ బాసలుచేసి బంధం వీడిపోడు
    ఈ మూడులైన్స్ లో లోతట్టుభావాన్ని పలికించారు పద్మా,
    మీ భావాలోచనల సారాంశం అమోఘం.

    ReplyDelete
  23. స్పందించి నా భావాలకి ఊపిరిపోస్తున్న ప్రతి అభిమాన హృదయానికి మనస్పూర్తిగా అంజలిఘటిస్తున్నాను.....మీ పద్మార్పిత. _/\_

    ReplyDelete