లోహంలో లోకం...

ఈ ఇత్తడి లోకాన్ని పుత్తడిగా మార్చాలని
కంచు కంఠంతో అరిచాను కీచు కీచుమని!
బడాయిచాలించు బంగారానికి భద్రతేలేదని
చిలుము పట్టిన ఇత్తడి చిద్విలాసంగా నవ్వె!

వెసులుబాటుకైనా వెండి వలె మెరిసిపొమ్మని
రాని రాగి రాగమే ఆలాపించా మారిపొమ్మని!
విలువలేని వాటిపై కాంస్య కారుణ్యం కూడదని
పాపమైనా పర్వాలేదు ప్లాటీనంలా ప్రాకుతాననె!

తుప్పుపట్టిన ఇనుము నయం తురాయి ఏలని
బుజ్జగించా స్టెయిన్లెస్ స్టీల్ లా తళతళలాడమని!
క్రోమియంలా కోప్పడె తుత్తునాగము సూక్తులని
తెలివిలేనివాడితో తల్లి తర్కిస్తే టైటానియం తిట్టనె!

ఇంగితం లోపిస్తే ఇరిడియం యురేనియం అగునని
మూర్ఖుడికి పసుపుబంగారం మెగ్నీషియా మెరుగని
సీసము కదాని సర్దుకుంటే పాదరసమైనా పొంగునని
మనిషి పుట్టగతికి మట్టియే మాగొప్ప  లోహమైపోయె!



_/\_లోకం తీరును లోహాలతో పోల్చి చేసిన ఈ ప్రయత్నంలో దొర్లిన లోపాలని సహృదయంతో స్వీకరిస్తారని....పద్మార్పిత _/\_

59 comments:

  1. పద్మా !
    సూపర్బ్ , మార్వలెస్ .

    ఎలాంటి విషయాన్నైనా నీకు కావలసిన విధంగా మల్చుకోగలిగిన మహా శిల్పివి .

    కనుక ,

    ప్రముఖ పత్రికలకు పంపే ప్రయత్నం ఆరంభించు , ఆలస్యం ఏమాత్రం చేయకు . అలా ఈ ప్రవాహం ప్రవహిస్తూనే వుండాలి . ఆగకూడదు . అంతే కాదు , నిజానికి నువ్వే జాబ్ చేస్తున్నావో తెలియదు . అందువల్లనే యిటువంటి సలహాలు యిస్తున్నాను. ప్రముఖ పత్రికలలోని రచనలకు చిత్రకారిణిగా కూడా కొనసాగవచ్చు .

    అవకాశం వున్నప్పుడే అందుకోవాలి , సావకాశమున్నప్పుడే సమయం చేసుకోవాలి , ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అని మాత్రం గుర్తు చేస్తున్నా.

    ReplyDelete
    Replies
    1. శర్మగారు....మీరు వ్రాసిన స్పూర్తిదాయక వ్యాఖ్యాలు చదువుతుంటే వెంటనే పుస్తకం అచ్చువేయించాలన్నంత ఆత్రుత ఆవేశం...:-) thanks a lot. కొన్నాళ్ళ తరువాత

      Delete
  2. ఓహ్ .. కవిత 'మాగ్నెటిక్ ' గా ఉంది

    ReplyDelete
    Replies
    1. ఇనుములా హత్తుకుపొండి మరి :-) thank you

      Delete
  3. Wonderful....నీ ఙ్ఞానసంపదకు ఈ కవిత ఒక తాత్కారణం. అధ్భుతంగా వ్రాసి అలరించావు అర్పిత. ప్రతి వస్తువుకు ప్రాణం పోసి పలికేలా చేయడమే కాకుండా అంతో ఇంతో మంచిని భోధించి మురిపిస్తావు.
    నిండునూరేళ్ళు చల్లగా ఉండు-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీ ఆశ్శిస్సులు నాకెప్పుడూ ఉంటాయని ఆశ.

      Delete
  4. metals made by us and we use them.
    meru metal la manishini marchadam impossible.
    me prayatam krushi poem lo kanabadutunnay.
    wel narrated padmagaru

    ReplyDelete
    Replies
    1. Impossible lo I am possible daagi undi chudandi :-)

      Delete
  5. మాడంగారు మీ మెటీరియలిస్టిక్ ధాట్స్ కి నమోఃవందనము.
    ఈ మెటల్స్ ఏంటి?
    వాటిలా మెంటల్గా మమ్మల్ని మార్చాలి అనుకోవడం ఏంటి ?
    ఏమైనా మీ మాటలకి మెస్మిరైజ్ అయ్యాము.:-)

    ReplyDelete
    Replies
    1. మెస్మిరైజ్ అయ్యాను అని నన్ను బ్రతికించారు ఆకాంక్ష. మాయ చేసాను అనలేదు. :-)

      Delete
  6. సతీష్గారూ.....ఎక్కడ ఉన్నారెక్కడున్నారో!:-)

    ReplyDelete
    Replies
    1. కులాసా అని తలుద్దాము. విజయనగరంలో ఉన్నారు కామోసు.

      Delete
  7. నేడు స్వార్థం పెరిగి గుండె బండగా మారి సిలికాన్ నే తలపించినా
    కాలుష్య కోరల్లో చిక్కి మనిషి ఆక్సిజన్ తక్కువ కార్బన్ అణువణువునా మిగిలి ఉన్నా
    నదులు నేడు హైడ్రోజన్ ఆక్సిజన్ కాకా క్లోరిన్ ఫ్లోరిన్ ఎక్కువై రోగాలే వస్తు ఉన్నా
    యంత్రాల మాటున వొల్ఫార్మ్ లా లోలోపల కాగిపోతున్నా
    లిథియం మెరుపులా చురకలే తగిలించినా సోడియం లా పెళుసు బారిన బంధాలే ఉన్నా
    కాల్షియమ్ లాగా మనసు తెల్లగా ఉన్నా మనిషి బంధాలలో మార్పులు రాకాపొయినా
    థోరియం యురేనియం లా మారి బందాలకే ఎసరు పెట్టకని మొరపెట్టుకున్నా
    డోపంట్స్ ఎక్కువై మనిషి మెదడులో పొటాసియం తగ్గినా మరుపన్నదే రాని మరమనిషిలా మనిషి మారిపోతున్నా ఉనికిని చాటటానికి హీలియం లా మిన్నకున్నాడు.

    హలిన కర్బ సెస్ ఫ్రా బెంజ్ కస్ర బారా స్కై లాక్ టిజ్ర్ హఫ్ వనబ్ ట క్రమొవ మంటక్రే ఫెరుఒస్ కోరేహిర్ నిప్డప్ట్ కుఅగౌ జన్కడ్ హగ్ బాల్గైన్టాల్ కసిగెసన్పబ్ నప్పస్సబ్బి ఒస్సేటేపో ఫక్లబ్రిఅట్ హెనెఅర్క్ర్జేరన్

    మనిషి పుట్టినప్పట్టినుంది మనిషిలో అణువణువునా ఈ లోహ ధాతువులే అని మీ ఫర్మా మెడికల్ డిపార్టుమెంటు గర్వ పడేలా ఈ పోయెమ్. అద్దిరింది ఇమేజ్ లో సిల్వర్ బ్రోమైడ్ తగ్గినట్టుంది అయినా దర్క్రూం లేని కాలం సిల్వర్ అయోడైద్ కాకా పిక్షెల్స్ కాలమాయే కాలం 'మాయె' 'కలికాలమాయే కలవని కాలమాయే మాయె. :)

    ReplyDelete
    Replies
    1. కంగారు పడాల్సిన పని ఎం లేదు పద్మ గారు ఆ మధ్యనున్న లైన్ పీరియాడిక్ టేబుల్ . పదునాలుగేళ్ళ క్రితం నాటిది :-)

      Delete
    2. మరోమారు విజృంభించారు.:-)

      Delete
    3. నేనెప్పుడు అలా ఫీల్ కాలేదండి నయని గారు. పద్మగారి కవితకు సాటి పరిపాటి ఇంకేదైనా సరితూగగలద లేక మీ సామెతలకు నానుడులకు ధీటు ఏదైనా ఉందంటారా :-)
      ముకుందమాధవ మురారి మోహన పీతవసనధారి రాధిక మనోవిహారి

      Delete
    4. అద్భుతంగా అభివర్ణించారు శ్రీధర్ గారు. అభినందనలు.

      Delete
  8. This poem is tough for me to understand. what i understood is this....people are like brass and you want to change them like gold metal. And you compared our lifestyle with Alloys & Metal. Madam you chosen a good concept.

    ReplyDelete
    Replies
    1. It is all about the Personalities and Behaviour and Lifestyles of Some people. You grasped it right Payal ji.

      Delete
    2. Yes Payal, what you said its right. మెల్లగా చిన్ని చిన్ని పదాలు తెలుగులో రాయండి.

      Delete
  9. అంశమేదైనా ఆకట్టుకునే కవిత్వం మీది.
    మనస్సును స్తానభ్రంశం చెందనీయక
    స్తబ్దుగా మీ బ్లాగ్లో కట్టిపడేస్తారు.
    మీ ఈ మెటల్ మానియా కవితాలోకంలో కొత్తదనాన్ని ఆపదించుకొని
    మెమరబుల్ గా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.
    జస్ట్ మార్వలస్.

    ReplyDelete
    Replies
    1. ఇలా పొగుడుతుంటే నేను పాదరసమై ప్రాకుతానేమో :-)

      Delete
  10. ఈ ఇత్తడి లోకాన్ని పుత్తడిగా మార్చాలని
    కంచు కంఠంతో అరిచాను కీచు కీచుమని!
    బడాయిచాలించు బంగారానికి భద్రతేలేదని
    చిలుము పట్టిన ఇత్తడి చిద్విలాసంగా నవ్వె!
    మొదటి నాలుగు లైన్స్ తోనే ఆకట్టుకున్నావు..
    Mind blowing post from U..Padma

    ReplyDelete
    Replies
    1. సంధ్యగారు....ఎలా ఉన్నారు. కమెంట్స్ తో మనసులో స్థానం పెంచేసుకున్నారు :-)

      Delete
  11. మా Gunmetal/పసుపు బంగారాన్ని కించపరిచినా మంచి బంగారంలాంటి మాటలు చెప్పారు. గౌరవంగా ప్రశంసిస్తూగాలిలో మూడుసార్లు తుపాకీ పేలుస్తూ క్లాప్స్ స్వీకరించండి.

    ReplyDelete
    Replies
    1. తుపాకీ గుళ్ళు ఉన్నా లేకపోయినా గురి తప్పనివ్వకండి :-)

      Delete
  12. Just a big salute to your thoughts and creativity padma mam.

    ReplyDelete
  13. స్కూల్లో చదువుకున్నా లోహాల లిస్ట్ వాటి గుణగణాలని చదివి మీ కవితకి కమెంట్ రాద్దాం అనుకున్నా. చదవడమైతే చేసాను కాని రాయడానికి పదాలు రావడంలేదు. అందుకే సింపుల్ గా ....అద్భుతహా

    ReplyDelete
    Replies
    1. మీకా శ్రమలేకుండా నా కామెంట్ లో పీరియాడిక్ టేబుల్ ని పొందుపరిచాను తెలుగమ్మాయి గారో :-)

      Delete
    2. అంటే మళ్ళీ మిమ్మల్ని బడికి పంపిన ఘనత నాకే అన్నమాట ::-)

      Delete
  14. పట్టుసడలని పదబంధంతో కవితను అలరించారు

    ReplyDelete
    Replies
    1. మీకు ధన్యవాదాలు

      Delete
  15. లోహ శాస్త్రంలో ఇంత ప్రావిణ్యం సంపదిచడానికి మీరు చేసిన కృషి అధ్బుతం.. అమోఘం.. మీకు మాత్రమే సాధ్యమయ్యే విధంగా అందంగా మలిచారు... సూపర్..

    ReplyDelete
    Replies
    1. శృతీ మరీ ఇంతలా పొగిడేయమాకు....సిగ్గేస్తుంది :-)

      Delete
  16. అర్థం చేసుకోవడానికి అరగంట పట్టినా కమెంట్ పెట్టడానికి వర్డ్స్ లేక చప్పట్లే చప్పట్లు కొడుతున్నాను.

    ReplyDelete
    Replies
    1. చేతులు కందిపోనీయకండి. :-)

      Delete
  17. మీ క్రియేటివిటీకి నా జోహార్లు. లోహాలతో జీవితాన్ని పోల్చడం అద్భుత ప్రయోగం.

    ReplyDelete
  18. మీరు ఇలా వ్రాయడంలో అందెవేసిన చేయి. ఇలా ఎన్ని వ్రాసినా ప్రతి ఒక్క దానిలో నూతనత్వం ఉంటుంది. అది మీ ప్రత్యేకత.

    ReplyDelete
  19. దేహమంతా అనేక లోహ ధాతువుల మిశ్రమం. ఇక ఘడియకో లోహ లక్షణాన్ని సంతరించుకుంటూ మారిపోయే మనసు. మట్టిలో కలిసే మట్టి మనుషులం మనం. గతాన్ని తవ్వుకున్నపుడల్లా కంగుమనే శబ్దంతో రాతి గుండెపై ఓ గాయం. జీవితమంతా పుత్తడి కోసం గోతులు తవ్వుకుంటూ, చివరికి ఆ గోతుల్లోనే మట్టికింద సమాధయ్యే వేదాంతులం. ఎందుకీ అన్వేషణ? ఎందుకీ వృధా ప్రయాస? ఇత్తడో పాడో, ఏదో ఒక స్వలక్షణంతో సలక్షణంగా ఉండనియ్యండి. ఎందుకంటే అయస్కాంత తత్వం ఇనుముకే ఉంటుందని చెప్తోంది కెమిస్ట్రీ. కానీ మనుషుల మధ్య అలా కాదు. కెమిస్ట్రీ కుదరాలే గానీ ఏ లోహపు మనసైనా మరో లోహపు మనసును ఆకట్టుకుంటుంది. ఇక్కడ అన్ని లోహాలూ ఆకర్శించేవే. అదే బాడీ కెమిస్ట్రీ.

    ReplyDelete
    Replies
    1. గతాన్ని తవ్వుకున్నపుడల్లా కంగుమనే శబ్దంతో రాతి గుండెపై ఓ గాయం...బాగుంది

      Delete
    2. మీ కమెంట్ ముందు నా కవిత చిన్నబోయిందండి.thank you for your beautiful comment.

      Delete
    3. It is the greatness of your poem. My comment is just a ray of reflection

      Delete
  20. nunagoppala chandramohangaru aha em chepparandi.superu

    ReplyDelete
    Replies
    1. aunu nijame chaala baaga raasaru.

      Delete
    2. Akanksha garu alaa cheppela chesindi Padma gari kavitha. Sooper kadaa!

      Delete
  21. బాగుంది మీ ప్రయత్నం. ఎప్పటిలాగానే

    ReplyDelete
  22. వెనుకటికి ఒక గడుసరి కోడలిని అత్త పుట్టింటి నుండి ఏం తెచ్చుకున్నావు అంటే..."ఇత్తడిలాంటి అత్తింటికి పుత్తడంటి కోడలిని వచ్చాను" అందట.
    కవితలో మీరు నేటివిటీని జొప్పించాలని చేసిన ప్రయత్నం అమోఘం. కంగ్రాట్స్.

    ReplyDelete
    Replies
    1. వామ్మో....లోహాల మధ్య ఈ అత్తాకోడళ్ళ లోగుట్టు ఏంటో :-)

      Delete
  23. wonderful metallic analysis.keep it up

    ReplyDelete
  24. మాడం ఉన్నారా లేక మెటాలిక్ గా మారిపోయారా:-)
    Superga raasaru

    ReplyDelete
    Replies
    1. ఎంత లోహాన్నైనా కరిగిపోతానే కాని కనుమరుగు కానులెండి మహిగారు :-)

      Delete
  25. లోహంలాగే లోకం కూడా గట్టిదే

    ReplyDelete
    Replies
    1. చిన్న ముక్కలో చెప్పేసారు.
      నా బ్లాగ్ కి స్వాగతం.

      Delete
  26. Replies
    1. ఏంటో ఇలా సడన్ గా వచ్చి ఇరగదీసారు అంటే హడలి చచ్చా :-)

      Delete