అనిశ్చలం


గుండె గాయమే చేసి గమ్యాన్నే మార్చేసి
మరువలేని మనసును మభ్యపెట్టుకుంటే
మారిపోయానని మంచీ చెడూ తెలిసెనని
తిరిగివచ్చి తలవాల్చి సేద తీర్చమనంటే
గడచిన గంటలు కొన్నైన తిరిగి వచ్చునా!!
మనసుకైన గాయపుమరక మాయమగునా?ఆశలసౌధాలనే అణచి ఆశయాన్ని ముంచేసి
జీవితాశయమే లేకుండా జీవశ్ఛవమై బ్రతికుంటే
చెట్టువేర్లకే చెదలడితే నీరుపెట్టి  చైతన్యమొచ్చెనని
చెలిమి అంటూ చెంతకుజేరి చేరదీయరాదా అంటే
నేలపై రాలిపోయిన ఆకులు చెట్టెక్కి చిగురించునా!!
చిరిగిన జీవితం క్రొత్తకాంతులతో చిందులు వేయునా?సరైన అవగాహన కరువై సాహసమని సర్కస్ చేసి
బోర్లాపడి బొక్కలిరిగి బొడిపకట్టినాక బుద్దిమంతులంటే
తెలివి తెల్లారిపోయినాక తీర్పు చెప్పినట్లు ఉందనుకుని
శిక్ష అని గాలిలోన తాడుకట్టి ఉరితీసి ఉత్సవమనుకుంటే
జాగ్రత్తలే చెప్పి జీవించమన్నా, జరిగేది జరగక ఆగునా!!
కాలమే తీరిపోతే, జీవితం కడదేరక ముందుకి సాగునా?

31 comments:

 1. నిరాశని సైతం నిండైన విగ్రహంతో సమర్పించారు. అమోఘమైన పదసంపద మీ సొత్తు.

  ReplyDelete
 2. భలే తిట్టారు

  ReplyDelete
 3. గడిచిన కాలం తిరిగి రాదని తెలిసినా వగచడం మానవ నైజం. అందమైన చిత్రం పెట్టి చూస్తుంటే చెళ్ళుమని చెప్పవలసినవి చెప్పేస్తారు. ఆపై మా తిప్పలు మావి:-) ఏదైనా అందంగా వినేలా చెప్పి బంధిస్తారు. ఇంతకీ ఈ కసి ఎవరిపైనండి?

  ReplyDelete
 4. జరిగేది జరుగుతుంది. తెలిసి ఆరాటం దేనికని? మరోమారు మీ కవిత భావాల సడితో ఝంమంది.

  ReplyDelete
 5. ఆహా ఓహో అంటే వ్యధాభరితమైన కవితకు బాగుండదని. అద్భుతంగా భావప్రకటన చేసారు. చిత్రం నిండుగా చాలా బాగుందండి.

  ReplyDelete
 6. కవితలో మీరు వాడిన పదబంధాలు కొత్తగా...
  భావం ఆలోచింపజేసేదిగా ...
  చలా బావుందండి...
  కిప్ రైటింగ్ మేడం.!!

  ReplyDelete
 7. చెట్టువేర్లకే చెదలడితే నీరుపెట్టి చైతన్యమొచ్చెనని
  నేలపై రాలిపోయిన ఆకులు చెట్టెక్కి చిగురించునా
  Sooper like padma

  ReplyDelete
 8. wooof....oka vedi nittoorputo patu meku dandam. chala bagundi madam

  ReplyDelete
 9. ఒక్కోపలుకు ఒక్కో రైఫిల్ అయి గుండెలో దూసుకెళ్ళి పిండేస్తుంది. ఎక్సెలెంట్ పద్మాజీ

  ReplyDelete
 10. జీవితాశయమే లేకుండా జీవశ్ఛవమై బ్రతికుంటే
  చెట్టువేర్లకే చెదలడితే నీరుపెట్టి చైతన్యమొచ్చెనని
  చెలిమి అంటూ చెంతకుజేరి చేరదీయరాదా అంటే
  నేలపై రాలిపోయిన ఆకులు చెట్టెక్కి చిగురించునా!!
  శభాష్ పద్మార్పితా....నీకు నీవే సాటి-హరినాధ్

  ReplyDelete
 11. మంచి భావకవిత పద్మార్పితగారు.

  ReplyDelete
 12. సరైన అవగాహన కరువై సాహసమని సర్కస్ చేసి
  బోర్లాపడి బొక్కలిరిగి బొడిపకట్టినాక బుద్దిమంతులంటే
  పడిలేస్తేనే నొప్పితెలుస్తుంది...బాగుందండి.

  ReplyDelete
 13. అందమైన అక్షరాలు అంతమించిన చిత్రమండి పద్మగారు.

  ReplyDelete
 14. పద్మగారు ఈ కవితకు ఈ సారి నేను వ్యాఖ్య పెట్టలేను. ఎందుకంటే నా వ్యాఖ్యలు కొంతమేరకు హాస్యరసం నిండేలా ఇస్తాను. కాని ఇక్కడి స్థితి వలన ఇవ్వలేకపోతున్న. ఆ హుదుద్ భీబత్సం ఇంకా కళ్ళెదుటే ఉంది. కోలుకున్నాక యథాప్రకారం మీ బ్లాగ్ కి వ్యాఖ్యాలిస్తానని మనవి.

  నా ఈ 28 ఏళ్ళలో ఎ వొక్కరోజు నేను ఇలాటి తూఫాను చూడలేదు. You may go through the Poem I have drafted and posted it on my Kaavyaanjali blog. The Images are of my own and are unedited.

  Thank you Padma Gaaru.

  Anischalam is Instability.. Here we have witnessed the Instability of the Nature's Fury.

  The Link is at: http://kaavyaanjali.blogspot.in/2014/10/the-natures-fury.html

  ReplyDelete
  Replies
  1. అంతా క్షేమమనే అనుకుంటాము.

   Delete
  2. Haa Aakanksha gaaru Nature Chese Vintallo Ee Aapada Oka Machchutunaka.. Gata vaaram rojulanundi mottam edaarini talapistundi ekkada choosina virigina chettu kommalu and road blockages. No Potable Water Yet. Power Restored Just Yesterday. We are all safe. Painunna link click cheste You can see the devastation caused by this natural calamity. Rumours are there that there is one more impending cyclone by 25-10-2014.

   We have to defy nature.

   Thank you for the concern Akaanksha gaaru.
   We are all fine here.

   Delete
  3. ఇలాంటివి తట్టుకోవడం విషాఖ వాసులకి అలవాటే. ధైర్యం కోల్పోతే ఎలా శ్రీధర్ గారు. మేము అక్కడివారమే. Let us fight with natural calamities.

   Delete
  4. తప్పదు కదండీ. కొన్ని సందర్భాల్లో మనోధైర్యమే ఆలంబన
   అన్నిటిని తట్టుకుని నిలబడటమే మనిషికి ప్రకృతి నేర్పిన పాఠం

   Every thing seems to be Normal Now.

   Delete
 15. అనిశ్చల వాస్తవాలే మఱి .

  ReplyDelete
 16. మనసు touch చెసినారు పద్మార్పిత. Truth of Life. Good collection

  ReplyDelete
 17. జీవితసారంలోని ప్రశ్నలు జవాబులు మీరే చెప్పేస్తారు. ఇంక చదివి చిన్నబోవడం తప్ప ఏంచెప్పగలం చెప్పండి. చిత్రం మీ స్టైల్ లో కనువిందుగా కుదిరింది మీ కవితకు.

  ReplyDelete
 18. painful touching words. past is past never come back.
  మంచిగుంది మీ కవిత

  ReplyDelete
 19. గుండె గాయమైతే మార్క్ అట్లనే ఉంటది మేడంజీ. పద్యం చాల అర్థం ఉంది. బొమ్మలు కళ్ళను జిగేల్ జిగేల్ అనిపిస్తున్నాయి

  ReplyDelete
 20. మీరు రాసినవి ఏకబిగిన చదవడం కాస్తా కష్టంగా వుందీమధ్య. కుదురుగా వుండి చదవాల్సి వస్తొంది. భావానికి తగ్గ చిత్రం బాగుంది. కుదురుగా కూచున్నా అనిశ్చలత్వం ఆమె కాలి బొటనవేళ్ళ కదలికలో కనిపిస్తోంది. మీ ప్రత్యేకత ఎక్కడా మిస్సవ్వనివ్వరు కదా? అభినందనలతో..

  ReplyDelete
  Replies
  1. కుమారవర్మగారు మీకే కష్టం అంటే మాబోటివాళ్ళం ఏం చదవగలం చెప్పండి. :-) సతీష్ కొత్తూరిగారి డ్యూటీ చిత్రం గురించి వర్ణించడం. ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నరో మరి. మీరు బర్తీ చేసారు చిత్రం గురించి చిన్నముక్కలో చెప్పి.

   Delete
 21. మీ కవితలోని వాస్తవాలు మదిని దొలుస్తున్నాయి అర్పితగారు.

  ReplyDelete
 22. అద్భుతమైన కవిత మరోమారు మీ భావఝరి నుండి. అభినందనలు.

  ReplyDelete
 23. హాయ్ హల్లో....ఇంత అందమైన చిత్రం అర్థవంతమైన భావం ఉన్న కవితకి నా అతకని కతకని సామెత వ్రాయను గాక వ్రాయను. (సామెత దొరకలేదండి అదొ వేరే విషయం :-) పద్మాగారు కవిత సూపర్బ్.

  ReplyDelete
  Replies
  1. "బాధను దిగమింగి సంతోషాన్ని పంచినట్టు"
   లేని సామెత పుట్టుకొచ్చే

   Delete
 24. పేరుపేరునా ప్రతిఒక్కరికీ నమస్సుమాంజలి.విడిగా జవాబివ్వలేదని అలగకండి. సహృదయంతో మన్నించాలి. _/\_

  ReplyDelete
 25. మనోభావాల ఉప్పెన ఈ మీ కవిత

  ReplyDelete