ప్రవరాఖ్యుడికి పాఠాలు నేర్పమని ప్రాధేయపడ్డాయి!
సిగ్గుపడ్డ చెక్కిళ్ళని చూసి మందారానికే మతితప్పి...
చాటుగా నక్కిన నారదుడినే ముద్దు ఇమ్మనడిగింది!
మల్లెపూలు మత్తెక్కి మెలికలు తిరిగి మైమరచి...
మంటలురేపమాకని మన్మధుడిని మందలించాయి!
పొదివిపట్టుకున్న చేతుల్ని పొగడపూమాల చూసి...
బ్రహ్మను బ్రతిమిలాడి సొగసులీయమని పోరుపెట్టింది!
చిలిపిసరాగాలని చిత్రంగా చిట్టిచేమంతులు గాంచి...
సోయగాల చిరునామా ఏదని చితగుప్తుడ్ని కోరాయి!
ఊసులన్నీ విని ఉడుక్కున్న ఉమ్మెత్త ఉసురుపెట్టి...
పక్షపాతని పరమశివుడ్నే పరుషమాటలు పలికింది!
గడియలే క్షణాలని గాబరాపడ్డ గన్నేర్లు పెదవి విరచి...
ప్రేమ పొందాలన్నా పెట్టిపుట్టాలని భక్తితో ప్రార్ధించాయి!
మనం ఏకమైన దృశ్యాన్ని చూసి నందివర్ధనం నవ్వి...
ఇచ్చిపుచ్చుకునేది ప్రేమని కృష్ణుడ్ని క్రీగంట చూసింది!
అలసిన మనసులపై ప్రణయ పూలవాన కురిసినట్లుంది మీ కవిత.
ReplyDeleteఅదరగొట్టేసారు అందమైన అక్షరాలతో ప్రణయాన్ని వర్ణించి
ReplyDeleteగిట్ల రాస్తె మస్తుగా నచ్చిపోతావ్, ఏమైన నువ్వు మా హైద్రబాదీ గందుకే గిట్ల మస్తుగ రాస్తున్నావ్
ReplyDeleteఔ మల్ల మస్తుగా జెప్పినారు మాత జననిగారో.మీది భాగ్మతి నగరమా. మాది ఓరుగల్లు గజ్జ ఘల్లు. విశాదమైనా సంతోషమైనా వ్యక్తపరిచగల మాధ్యమం కవిత.
Deleteహర్ష_సిరి
మల్లెపూలు మత్తెక్కి మెలికలు తిరిగి మైమరచి...
ReplyDeleteమంటలురేపమాకని మన్మధుడిని మందలించాయి!
supero super
నాకిక్కడ రాధకృష్ణ మాత్రమే కనిపిస్తున్నారు పద్మగారు. ఆ మోహనరూప ముకుందుని ఇన్స్పిరేషనల్ పోయేమ్ మార్వెలస్.
ReplyDeleteకృష్ణ గోపాల చక్కనయ్య జగదీశ్వర
హర్ష_సిరి
శ్రీ
నేను కమెంట్ రాయలేదన్న బెంగతో శ్రీధర్ గారు ఇంపుల్ గా కమెంటారా!
Deleteఅయినా ఈ మధ్య బ్లాగ్ పాటకులు కరువయ్యారు అనిపిస్తుంది. సతీష్ గారు ఏమైనారో? శ్రీపాదగారు తప్పిపోయినట్లున్నారు :-)
అధ్భుతం!!
ReplyDeleteఈ కవిత గురించి ఎంత చెప్పినా తక్కువే.
పురాణ పురుషుల్ని వారి గుణాల ఆధారంగా కవిత్వంలో జొప్పించి పూల గంధాలతో పరవశింపజేసేలా అందమైన అమరికతో చక్కని సాహిత్యాన్ని అందించారు.
హ్యాట్సాఫ్ మేడం...
ఇలాంటి కవితలు మీకే సాధ్యం.. దటీస్ పద్మార్పిత...
ReplyDeleteసోయగాల చిరునామా ఏదని చితగుప్తుడ్ని కోరాయి!
పోదురు లెండి బడాయి ! చిత్రగుప్తు ల వారిని చిరునామా అడిగితే, ఏమని చెబ్తాడు ? నరకం అడ్డ్రేస్సు కాదూ !!
మనః ప్రళయం !
శుభాకాంక్షల తో
చీర్స్
జిలేబి
ఇంతకీ ఈ ప్రణయసరాగాల సారం ఏంటో చెప్పండి పద్మగారు
ReplyDeleteఇది పూపూర్తిగా పద్మార్పితగారి ప్రణయభావాల సమమాల...మనసుని రంజింపజేసెను మీ దృశ్య కావ్యం
ReplyDeleteSuper romantic poem padmaji. ప్రేమ చెప్పింది పోల్చింది బాగుంది
ReplyDeleteకవిత చదివినాక గుండె వేగంగా పరుగులు పెట్టింది. సమల్నా ముష్కిల్
ReplyDeleteభవ్యమైన ప్రణయానుభూతి పద్మా. రసరమ్యంగా ఉంది-హరినాధ్
ReplyDeleteరాధాకృష్ణుల ప్రణయంలా బహుపసందుగా ఉందండి మీ కవితను మలచిన తీరు ప్రశంసనీయం
ReplyDeleteప్రవరాఖ్యుడు, నారదుడు, చిత్రగుప్తుడు లాంటి క్యారక్టర్స్ ని కూడా కవితలో పరిచయం చేయడం మీకే చెల్లింది. మొత్తానికి ప్రణయాన్ని పుష్కలంగా పడించారు.
ReplyDeleteచిత్రాల్లో పదాల్లో ప్రణయం రసరమ్యంగానే ఉంటుంది పద్మగారు. అది దక్కని వాళ్ళని అడగండి అని అంటున్నారు మా మిత్రబృందం . దీనికి మీ సమాధానం ????
ReplyDeleteఅక్షరం అక్షరంలో ప్రణయ భావుకత వెన్నెల్లా కురిపించారు. అద్భుతః పద్మార్పిత గారూ...
ReplyDeleteకూసింత బ్లాగ్ కి అరుదెంచి రిప్లైస్ ఇవ్వండి మాడం
ReplyDeleteపూలచెండుతో కొట్టారు పరిమళాలని ఆస్వాధించాలే తప్ప కమెంట్ కూడదని కాంగా ఉన్నాను :-)
Deleteనా రాతలకి ప్రేణాస్పూర్తినిచ్చే మీ కమెంట్లకు శతాభివందనాలు_/\_
ReplyDeleteరొమాంటిక్ కవిత బాగుందండి.
ReplyDeleteExcellent mdm
ReplyDelete