ముగ్ధమనసు

ప్రేమను చెప్పలేక ప్రేమలేఖ రాయబోతే
అక్షరాలే అలిగి నా గుండె భారమైనట్లు
పరిసరాలు పరవశించి పరిహసించినట్లు
నెమళ్ళు నాట్యమాడి న్యాయం చెప్పినట్లు 
వనమే వగలాడిని అని వత్తాసు పలికినట్లు!

తడారని తలపులతో నిన్ను పలకరించబోతే
పదాలే పెదవిదాటక మాటలే దిగమింగినట్లు
అరమోడ్పు కనులు సైతం నీస్పర్శ కోరినట్లు
మత్తెక్కిన మల్లెలే నిన్ను పిలవమనన్నట్లు
జారినపైట జాణతనమేమాయనని అడిగినట్లు!

బిగుసుకున్న బిడియమే విడిచి నిను చేరబోతే
అందియలే అల్లరిచేస్తూ నన్ను వెక్కిరిస్తున్నట్లు
ఎరుపెక్కిన చెక్కిళ్ళను చూసి గోరింట అలిగినట్లు
సిగ్గు దొంతర్లు సైయంటూ మచ్చిక చేసుకున్నట్లు
అడుగు తడబడి ఆడతనమేదో ఆగిపొమ్మన్నట్లు!

నువ్వు నాలోనే ఉన్నావన్న భరోసాతో తోడుకోరితే
గిలిగింతలే పెట్టి గోముగా ముద్దులెన్నో అడిగినట్లు
అందమైన మాయలో హత్తుకుని అత్తర్లు చల్లినట్లు
మైమరపులే పులకరింతై పరవళ్ళతో పెనవేసినట్లు
మనోహరమొంది ముగ్ధమనసు మూగబోయినట్లు!

52 comments:

  1. మనోహరమైన మగువను అద్భుతంగా అభివర్ణించి ఆమె అందాన్ని పెంచారు. ఫోటోకి ఫుల్ మార్కులు. మీ కవితకు మార్కులు వేయలేం * * * * * 5stars

    ReplyDelete
    Replies
    1. శ్రీనాధ్ గారు మార్కులు వేసి పాస్ ఫెయిల్ చెప్పేస్తారా :-)

      Delete
  2. గుండెలో బులెట్స్ దిగినా హాయిగా ఉన్నట్లు
    ముగ్ధ అందం మీ అక్షరాల్లో పెరిగినట్లు-సూపర్



    ReplyDelete
    Replies
    1. తుఫాకీ గుళ్ళకి కూడా తొణకని వణకని ధైర్య వంతులన్నమాట :-)

      Delete
  3. వః చెప్పడానికి కామెంటు రాయబోతే
    అక్షరాలే అలిగి నా గుండె భారమై పోయిందిస్మీ !!

    దీపావళీ శుభకామనలతో

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీకు అక్షరాలు కొదవా...నన్ను ఆటపట్టిస్తున్నారు :-)

      Delete
  4. అందమైన అక్షరాలతో ముగ్దమనస్సును కవిత్వీకరించినతీరు కడు ప్రశంసనీయం.
    కవితలో మీరు పలికించిన భావాలు స్వచ్చంగా అచ్చంగా మగువ మనసును ప్రతిభింబిస్తున్నట్లు...
    సూపర్ మేడం....

    ReplyDelete
    Replies
    1. మరి నేను మనసున్న మగువను కదా! :-) thank you

      Delete
  5. అంతా ప్రేమ మయమే.. జగమంతా ప్రేమైక జీవితాల సారమే..మీ కలం నుంచి జాలువారిన ముగ్ధ మనసు హృదయాలను పరవశింపజేసే మనోహర కవితాత్మక గీతమే ....

    ReplyDelete
    Replies
    1. నిజంగా జగమంతా ప్రేమమయం అయితే ఎంతబాగుంటుందో కదండీ.

      Delete
  6. ఈ ముగ్ధ మనోహరి మనసు ఎవరి కోసమో! మొత్తానికి మహా అదృష్టజాతకుడు:-)

    ReplyDelete
    Replies
    1. అయితే ఆ అదృష్టమేదో నాకే అన్నమాట :-)

      Delete
  7. ఎంతందంగా ఉందో మనోహరి విరహభావంలో కూడా వగలు విరబూయిస్తూ నెమలి ఈకతో సుతారంగా మనసును తాకిన ప్రణయ సమీరంలా....పద్మా మీ భావాలకి దాసోహం.

    ReplyDelete
    Replies
    1. సంధ్యగారు....ప్రణయసుధా మధురం మీ కమెంట్.

      Delete
  8. అరమోడ్పు కనులు సైతం నీస్పర్శ కోరినట్లు
    మత్తెక్కిన మల్లెలే నిన్ను పిలవమనన్నట్లు
    జారినపైట జాణతనమేమాయనని అడిగినట్లు!
    ఇలాంటి అంతరమర్మ భావాక్షరాలు మీ కలానికే చెల్లు.
    మీ కళాతృష్ణకు కరచాలం చేస్తున్నాను...Salute Padmaji

    ReplyDelete
    Replies
    1. రసానుభూతితో ఆస్వాధించిన మీకు నమస్కారం.

      Delete
  9. ఎంతైనా మీ కవితా నాయకి గడుసరిది ధైర్యశాలి కూడానండోయ్. అందంగా అమాయకంగా అన్నీ నిర్భయంగా చెప్పేస్తుంది :-)

    ReplyDelete
    Replies
    1. చెప్పడం చెప్పేసి తరువాత ఎవరైనా తిడితే బాధపడుతుంది కూడా :-)

      Delete
  10. జాణతం జారిన పైటలో మాయమైనట్లు
    భ్రమించిన మా కన్య్లు తెరుచుకున్నట్లు
    ముగ్ధ చెప్పకనే చెప్పాల్సినవి చెప్పినట్లు
    కవిత చదివి మేము పరవశమొందినట్లు
    పద్మగారు శభాష్ అని మెచ్చుకున్నట్లు
    బాబోయ్ నేను నాలుగు లైన్స్ మించి రాసేసాను...అంతా ప్రేమార్పిత మాయాజాలం...ha :-) haaaa :-)

    ReplyDelete
    Replies
    1. నాలుగు పంక్తుల చిటిపొట్టి కవితల అభిలాషిణి ఆకాంక్ష గారు
      నలుదిక్కుల చిమ్మచీకటున్న నడిరేయి జాబిలీ వెలుగులు
      నలువైపులా నలుపు ఉన్నా నక్షత్రాలే చూపించారు
      ఎన్నో రాద్దామన్న మీ కవితకి మరల నాలుగే అని అనిపించారు

      ఇదుగోండి మీ 4 లైన్ ల చిట్టి కవిత ఆకాంక్ష గారు

      Delete
    2. శ్రీధర్ గారు ఎలా ఉన్నారు?
      నా కవితలు నాలుగు పాదాలు దాటవని మీకు తెలిపోయిందా :-) థ్యాంకులు

      Delete
    3. బాబోయ్ నేను నాలుగు లైన్స్ మించి రాసేసాను...

      అని మీరే ఆ పైన రాశారు ఆకాంక్ష గారు

      నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ?

      నాలుగు పాదాల మీద సాగేది ధర్మం
      క్రమేపి మూడు రెండు నుండి ఒకటయ్యింది అదే కలియుగామాయే కలియుగ"మాయే"

      మీ చిట్టి కవితలు పేరుకే చిట్టి, పద్మగారి కవితకు పరిపాటి
      మీ ఇరువురికి మించి లేరు ఎవరు ఘనాపాటి
      రాసేద్దురు మరల కవితలు చేరోటి

      Delete
    4. ఆవిడతో నేనా...ఎప్పటికి అలా రాయగలనో.? కాని నాకు ప్రేరణ, స్ఫూర్తి ఆవిడేనండి. నా రోల్ మాడల్ ఆమె. ధన్యవాదములు.

      Delete
    5. నాలుగు లైన్స్ రాసినా నలుగురికీ ఉపయోగపడేవి రాస్తారుగా :-)
      మీరు మీరే...నేను నేనే వై దిస్ కంపారింగ్ కోలావరీ :-)

      Delete
  11. మది పులకరింతల పరవసాన్ని ముగ్ధమనోహర రూపంతో వర్ణించిన మీ కలానికి కుంచెకు జోహార్లు పద్మార్పితాజీ.. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. పులకరించిన మీ మదికి వందనాలు.

      Delete
  12. నువ్వు నాలోనే ఉన్నావన్న భరోసాతో తోడుకోరితే
    గిలిగింతలే పెట్టి గోముగా ముద్దులెన్నో అడిగినట్లు
    అందమైన మాయలో హత్తుకుని అత్తర్లు చల్లినట్లు
    మైమరపులే పులకరింతై పరవళ్ళతో పెనవేసినట్లు
    superb lines madam...picture amazing

    ReplyDelete
    Replies
    1. నచ్చేసి మెచ్చేసి మదిని ఆనందంతో ముంచేసారు.

      Delete
  13. మనసు మనోహరం
    మీ కవిత సుమధురం
    చిత్రం నయనానందం.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యలు మనసుపై జల్లింది పరిమళం

      Delete
  14. ఎంతకాదనుకున్నా మంచి మనసున్న ముగ్ధ మనోహర మనసు మీది అందుకే స్త్రీ మనోభావాలని ఇంతందంగా వ్రాయగలరు.

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా ఆస్వాధించే మనసుంటేనేగా నేను రాయగలిగేది. థ్యాంక్యూ

      Delete
  15. పటుత్వమున్న కవిత

    ReplyDelete
    Replies
    1. పట్టుజారనివ్వకుండా ప్రయత్నిస్తానండి :-)

      Delete
  16. రసరమ్య కావ్యం వెరసి ముగ్దమనొహరముగ
    రేయి మాటునా జాబిలీ వెలుగు జిలుగులన్ని ఆమె కన్నుల్లో కొనియాడగా
    ప్రకృతి తానై విరబూసే నవ్వే తనకు ఆభరణమై
    ప్రకోపిత హాస్యరసము తన మోముపై వాలుతుండగా
    మయురమే తన ఎదురునిలిచే మైమరిచి శిలల ఒదిగిపోయే

    బహుచక్కని కావ్యరూపం
    వెన్నెల్లో దీపం లా మిరుమిట్లు గోలిపింది ఆ చిత్ర విచిత్రం పద్మగారు

    ReplyDelete
    Replies
    1. ఇలా అంటే...మీ కమెంట్ నుండి కరెంట్ పాసై మనసు విప్పారి ముఖం వెలిపోతుందండి :-)

      Delete
  17. వర్ణనాతీతం మీ ముగ్ధమనోహర మనసును పొగడ. చాలా చాలా బాగా వ్రాసారండి పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. నన్ను పొగిడేసారుగా పసందుగా...బాగుందండి నచ్చేసారు

      Delete
  18. ఇంత అందంగా వ్రాసే మనసు మీకే ఉందండి.

    ReplyDelete
    Replies
    1. :-) కేవలం వ్రాయడమేనంటారా :-)

      Delete
  19. ముగ్ధమనసుకి అందమైన వాక్యాలు వ్రాయాలని ఆలోఎచించి భాషరాక మనసు మూగబోయింది. నీ అక్షర అల్లిక అమోఘం. చిత్రాల ఎంపికలో కళపై నీకున్న అంకితభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ధీర్ఘాయుష్మాంభవ-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీ ఆదరణాభిమానమే అక్షరభాంఢం...అవిచాలండి. ధన్యవాదములు.

      Delete
  20. ఇట్ల మీరు జబర్దస్త్ గా ముచ్చట్లు చెప్తే మస్తుగుంటది.

    ReplyDelete
    Replies
    1. మజా చేసుకోవాల మాటలని...పరేషా కావద్దు మల్ల.

      Delete
  21. ప్రేమించడమే తెలుసునేమో మీ భావాలకి అనేలా ఉండండి ఈ కవిత.

    ReplyDelete
    Replies
    1. ప్రేమే కదా మీకు నాకు మనందరికీ ఉండవలసింది

      Delete
  22. actually i want to write a comment in telugu for this post. but my telugu words are not enough to describe about this wonderful woman heart feel. beautiful as your heart padmaji. మి మనసు వలె ఉంది.

    ReplyDelete
    Replies
    1. Payal iam really feeling happy that you are trying.అలా రాస్తూ ట్రై చెయ్యండి వచ్చేస్తుంది. thank you.

      Delete
  23. అలవికాని అనురాగాన్ని అక్షరాల్లో అందంగా అమర్చి రాసిన కమ్మని దృశ్యం

    ReplyDelete
    Replies
    1. అభినందించిన మీ మనసు అభిమాన కోశాగారం

      Delete
  24. ప్రణయరసాభరితం మీ ముగ్ధమనసు

    ReplyDelete
  25. ఈ కవిత ఒక మాస్టర్ పీస్. మీ కళాతృష్ణ కవితాపఠిమా రంగరించిన ప్రేమ వర్ణకావ్యం. అద్భుతం. keep it up

    ReplyDelete