మన ప్రణయం

మన ప్రణయాన్ని చూసి పారిజాతాలే పరవశించి...
ప్రవరాఖ్యుడికి పాఠాలు నేర్పమని ప్రాధేయపడ్డాయి!

సిగ్గుపడ్డ చెక్కిళ్ళని చూసి మందారానికే మతితప్పి...
చాటుగా నక్కిన నారదుడినే ముద్దు ఇమ్మనడిగింది!

మల్లెపూలు మత్తెక్కి మెలికలు తిరిగి మైమరచి...
మంటలురేపమాకని మన్మధుడిని మందలించాయి!

పొదివిపట్టుకున్న చేతుల్ని పొగడపూమాల చూసి...
బ్రహ్మను బ్రతిమిలాడి సొగసులీయమని పోరుపెట్టింది!

చిలిపిసరాగాలని చిత్రంగా చిట్టిచేమంతులు గాంచి...
సోయగాల చిరునామా ఏదని చితగుప్తుడ్ని కోరాయి!

ఊసులన్నీ విని ఉడుక్కున్న ఉమ్మెత్త ఉసురుపెట్టి...
పక్షపాతని పరమశివుడ్నే పరుషమాటలు పలికింది!

గడియలే క్షణాలని గాబరాపడ్డ గన్నేర్లు పెదవి విరచి...
ప్రేమ పొందాలన్నా పెట్టిపుట్టాలని భక్తితో ప్రార్ధించాయి!

మనం ఏకమైన దృశ్యాన్ని చూసి నందివర్ధనం నవ్వి...
ఇచ్చిపుచ్చుకునేది ప్రేమని కృష్ణుడ్ని క్రీగంట చూసింది!


23 comments:

  1. అలసిన మనసులపై ప్రణయ పూలవాన కురిసినట్లుంది మీ కవిత.

    ReplyDelete
  2. అదరగొట్టేసారు అందమైన అక్షరాలతో ప్రణయాన్ని వర్ణించి

    ReplyDelete
  3. గిట్ల రాస్తె మస్తుగా నచ్చిపోతావ్, ఏమైన నువ్వు మా హైద్రబాదీ గందుకే గిట్ల మస్తుగ రాస్తున్నావ్

    ReplyDelete
    Replies
    1. ఔ మల్ల మస్తుగా జెప్పినారు మాత జననిగారో.మీది భాగ్మతి నగరమా. మాది ఓరుగల్లు గజ్జ ఘల్లు. విశాదమైనా సంతోషమైనా వ్యక్తపరిచగల మాధ్యమం కవిత.

      హర్ష_సిరి

      Delete
  4. మల్లెపూలు మత్తెక్కి మెలికలు తిరిగి మైమరచి...
    మంటలురేపమాకని మన్మధుడిని మందలించాయి!
    supero super

    ReplyDelete
  5. నాకిక్కడ రాధకృష్ణ మాత్రమే కనిపిస్తున్నారు పద్మగారు. ఆ మోహనరూప ముకుందుని ఇన్స్పిరేషనల్ పోయేమ్ మార్వెలస్.

    కృష్ణ గోపాల చక్కనయ్య జగదీశ్వర



    హర్ష_సిరి

    శ్రీ

    ReplyDelete
    Replies
    1. నేను కమెంట్ రాయలేదన్న బెంగతో శ్రీధర్ గారు ఇంపుల్ గా కమెంటారా!
      అయినా ఈ మధ్య బ్లాగ్ పాటకులు కరువయ్యారు అనిపిస్తుంది. సతీష్ గారు ఏమైనారో? శ్రీపాదగారు తప్పిపోయినట్లున్నారు :-)

      Delete
  6. అధ్భుతం!!
    ఈ కవిత గురించి ఎంత చెప్పినా తక్కువే.
    పురాణ పురుషుల్ని వారి గుణాల ఆధారంగా కవిత్వంలో జొప్పించి పూల గంధాలతో పరవశింపజేసేలా అందమైన అమరికతో చక్కని సాహిత్యాన్ని అందించారు.
    హ్యాట్సాఫ్ మేడం...
    ఇలాంటి కవితలు మీకే సాధ్యం.. దటీస్ పద్మార్పిత...

    ReplyDelete

  7. సోయగాల చిరునామా ఏదని చితగుప్తుడ్ని కోరాయి!

    పోదురు లెండి బడాయి ! చిత్రగుప్తు ల వారిని చిరునామా అడిగితే, ఏమని చెబ్తాడు ? నరకం అడ్డ్రేస్సు కాదూ !!

    మనః ప్రళయం !

    శుభాకాంక్షల తో
    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  8. ఇంతకీ ఈ ప్రణయసరాగాల సారం ఏంటో చెప్పండి పద్మగారు

    ReplyDelete
  9. ఇది పూపూర్తిగా పద్మార్పితగారి ప్రణయభావాల సమమాల...మనసుని రంజింపజేసెను మీ దృశ్య కావ్యం

    ReplyDelete
  10. Super romantic poem padmaji. ప్రేమ చెప్పింది పోల్చింది బాగుంది

    ReplyDelete
  11. కవిత చదివినాక గుండె వేగంగా పరుగులు పెట్టింది. సమల్నా ముష్కిల్

    ReplyDelete
  12. భవ్యమైన ప్రణయానుభూతి పద్మా. రసరమ్యంగా ఉంది-హరినాధ్

    ReplyDelete
  13. రాధాకృష్ణుల ప్రణయంలా బహుపసందుగా ఉందండి మీ కవితను మలచిన తీరు ప్రశంసనీయం

    ReplyDelete
  14. ప్రవరాఖ్యుడు, నారదుడు, చిత్రగుప్తుడు లాంటి క్యారక్టర్స్ ని కూడా కవితలో పరిచయం చేయడం మీకే చెల్లింది. మొత్తానికి ప్రణయాన్ని పుష్కలంగా పడించారు.

    ReplyDelete
  15. చిత్రాల్లో పదాల్లో ప్రణయం రసరమ్యంగానే ఉంటుంది పద్మగారు. అది దక్కని వాళ్ళని అడగండి అని అంటున్నారు మా మిత్రబృందం . దీనికి మీ సమాధానం ????

    ReplyDelete
  16. అక్షరం అక్షరంలో ప్రణయ భావుకత వెన్నెల్లా కురిపించారు. అద్భుతః పద్మార్పిత గారూ...

    ReplyDelete
  17. కూసింత బ్లాగ్ కి అరుదెంచి రిప్లైస్ ఇవ్వండి మాడం

    ReplyDelete
    Replies
    1. పూలచెండుతో కొట్టారు పరిమళాలని ఆస్వాధించాలే తప్ప కమెంట్ కూడదని కాంగా ఉన్నాను :-)

      Delete
  18. నా రాతలకి ప్రేణాస్పూర్తినిచ్చే మీ కమెంట్లకు శతాభివందనాలు_/\_

    ReplyDelete
  19. రొమాంటిక్ కవిత బాగుందండి.

    ReplyDelete