ప్రేమతత్వం

ఆడలేనంటూ గుండె ఆగాగి కొట్టుకుంటే
అడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!

పరుగున వచ్చేసి పొత్తిళ్ళకి హత్తుకుని
నుదుటినే నిమిరేసి సేదతీర్చి వెళ్ళిపోకు!

కొన్నిక్షణాలైనా ఎడబాటు తాపమే ఎరిగి
ఎదభారం మోయలేక మరమనిషివైపోకు!

చెప్పింది వినేసి మౌనమే మందని చెప్పి
నీకంట కన్నీటిని నా కంట కురవనీయకు!

అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
అనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు!

ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి
శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు!

28 comments:

  1. wonderful poetry.... Amazing Pic :-)
    Happy Birthday Madam ...

    ReplyDelete
  2. జన్మదిన శుభాకాంక్షలు జగమెరిగిన పద్మార్పిత.

    ReplyDelete
  3. Wish you a very happy birthday.
    కవితకి తగిన చిత్రంతో అలరించారు పద్మగారు.

    ReplyDelete
  4. అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
    అనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు
    ఎంతో అందమైన భావప్రకటన మాడం
    పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు.

    ReplyDelete
  5. Excellent Painting with touching lines.
    JANAM DIN MUBARAK MADAMJI

    ReplyDelete
  6. శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు
    short cut lo simple ga cheparu...super

    ReplyDelete
  7. Many Happy returns of the day :)

    ReplyDelete
  8. మీ భావకెరటాల్లో ప్రేమతత్వం తడిసి ముద్దై మురిసిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు పద్మా. చిత్రం కళ్ళకింపుగా ఉంది. జన్మది శుభాకాంక్షలతోపాటుగా అభినందనలు నీకు.

    ReplyDelete
  9. WISH YOU HAPPY BIRTHDAY

    kavita & pic adurs

    ReplyDelete
  10. నా అభిమాన కవయిత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  11. పద్మగారు పెయింటింగ్ కెవ్వుకేక. ప్రేమతత్వం మొత్తం భోధపడిందండోయ్ మీ కవితలో.

    ReplyDelete
  12. many more happy returns of the day. poem and picture is good. enjoy the day madamji.

    ReplyDelete
  13. wishing you a very happy birthday.

    ReplyDelete
  14. పుట్టినరోజున అందుకో నా శుభాకాంక్షలు పద్మ.

    ReplyDelete
  15. Belated birthday wishes padma.
    మరో చక్కని కవితను అందించిన మీకు అభినందనలు.

    ReplyDelete
  16. mam awesome pic with beautiful poetry .

    ReplyDelete
  17. ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి...

    ఇలాంటి గొప్ప కొటేషన్ ఎలా వచ్చిందో.. సూపరండీ పద్మాజీ.. చిత్రం కూడా అదిరింది...

    ReplyDelete
  18. ప్రేమతత్వభోధన బ్రహ్మాండం

    ReplyDelete
  19. గుండె ఆగాగి కొట్టుకుంటే
    అడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!
    మీ ప్రియుడు ఇంత స్లోనా ఏంటి పద్మగారు.:-)

    ReplyDelete
  20. బుట్టెడు పూలు
    లారీడు విషెస్స్
    వందకిలోల కేక్...అబ్బో ఇలా ఏవేవో ఊహించుకుని తీరా పుట్టినరోజుని మరచిప్[ఓయాను, అందుకే కమెంట్ పెట్టలేక ముఖం చాటేసాను. ఆగలేక లగెత్తుకొచ్చేసాను. belated wishes

    ReplyDelete
  21. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆలస్యంగా.
    ఇక ప్రేమతత్వం గురించి చాల ప్రేమగా చెప్పారు..పిక్ చాల చాల క్యూట్ గా ఉంది.. మీ బ్లాగ్ని చాల చాల మిస్ అయ్యాను..:-))

    ReplyDelete
  22. మీ ఉజ్వలమైన కవితాస్పూర్తికి I Wish You All the best of Luck..:-)

    ReplyDelete
  23. కవిత్వం అంటేనే మార్మికభావం?
    పద్మార్పిత కది కరతలామలకం!
    మరిన్ని జన్మదినాలు-
    మరిన్ని పద్యప్రసూనాలు?!

    ReplyDelete
  24. అక్కా ముందు ముందు కూడా మస్తు మస్తుగా రాసెయ్

    ReplyDelete
  25. ఎప్పుడూ అందంగా రాసి అలరించండి. పెయింటింగ్ చాలా బాగుంది.

    ReplyDelete
  26. అందరి అభిమానాశ్శిస్సులకు శిరస్సు వంచి ప్రణామములు. _/\_

    ReplyDelete
  27. అంతర్మధనం అర్థమై గుండెల్ని తాకింది.

    ReplyDelete
  28. ఆడలేనంటూ గుండె ఆగాగి కొట్టుకుంటే
    అడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!

    పరుగున వచ్చేసి పొత్తిళ్ళకి హత్తుకుని
    నుదుటినే నిమిరేసి సేదతీర్చి వెళ్ళిపోకు!

    కొన్నిక్షణాలైనా ఎడబాటు తాపమే ఎరిగి
    ఎదభారం మోయలేక మరమనిషివైపోకు!

    చెప్పింది వినేసి మౌనమే మందని చెప్పి
    నీకంట కన్నీటిని నా కంట కురవనీయకు!

    అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
    అనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు!

    ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి
    శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు!

    ------------- kabhi kabi mere dil men is shaayaree aathaa hai...

    ReplyDelete