ఏం లిఖించను?

జీవన గమనపు గతుకుల గ్రంధమే కనులముందుంటే
అక్షరగణాలు ఎరుగని నేను గద్యమే వ్రాయలేని స్థితిలో
దోషాల్లేని దోహాలు వ్రాయలేను, ద్విపదాలు దొర్లించలేను!

నవ్వుతున్న పెదాలకి దురాలోచనల ధూళంటుకునుంటే
సాంగత్యమే ఇచ్చిపుచ్చుకునే వ్యాపారమై కదలాడే కళ్ళతో
కల్తీలేని ప్రేమ అని, కమ్మని కావ్య కవితలు నే రాయలేను!

ఎత్తు పై ఎత్తులేసి ఎదుటి వారిని చిత్తు చేయాలనుకుంటే
అంచనాలు తారుమారు చేసే తంత్రం తెలియని మాటలతో
తాత్పర్యము తెలిపే పద్యపాండిత్య ప్రవచనాలు చెప్పలేను!

వెసులుబాటు కోసం వెకిలి మాటలాడే వింత జాడ్యముంటే
చర్చకు ఛందస్సు జోడించి చైతన్యవంతపు చమత్కారాలతో
జనోద్ధరణ జానపద గీతికలు, పాటలు రాసి మెప్పించలేను!

అరమరికలు లేని భావాలకు అక్షరాలు తోడు ఉంటానంటే
ఘజల్స్, ముషాయిరాలో లేక అవి ఏ కంద, సీస పద్యాలో
తెలియక పోయినా రాస్తూ తప్పులెన్నో చేస్తూనే ఉంటాను!

41 comments:

  1. తప్పుచేద్దాం రండి!

    ReplyDelete
  2. వ్రాస్తూ ఉండండి
    చదివేస్తుంటాం..

    ReplyDelete
  3. జీవితం కాలమనె తెరచాప తో సాగే పయనం
    గతుకుల అతుకులతో పడుతు లేచే కెరటం
    ఆడంబరాల అదుపుతో కుదుపు లేకా సాగే ఝరి
    కపటమనే భావన దరిచేరని జీవితానికి సరాసరి

    మనిషి మనిషికి నడుమ కానరాని తెర అహంభావం
    నిత్యం సతమతమయ్యేను తనకదే కదా అనుభవం
    కాలికి గాయం ఐతే ఓర్చుకోవచ్చు
    మనసుకి గాయం ఐతే ఏడుపే వచ్చు

    మంచి అనే భావన ప్రతి ఒకరిలో వెలిగే దీపం
    చమురు మాత్రం ఒక్కో దీపానికి భిన్నం
    సహేతుక పలకరింపులన్ని అజ్యపు దీపాలే
    మసిబారని మనసుకు దర్పణాలే
    స్వార్థమనేవి కర్పుర హారతులే దిస్టి తీసి
    కన్నులకు హత్తుకోగా నల్లగా చేతికి మసి

    అగాధాల మాటునా రగిలే నిప్పు ఎరుగని కొలిమిలివే
    మనస వచస కర్మణ త్రికరణశుద్ధిగా ఆచరించే జీవితపు సోపానాలివే
    అచేతనంగా అనాలోచితంగా అప్రయత్నంగా అగమ్యగోచరమై
    కాలమే సమాధాన పర్చగా ప్రతి ఘడియ కదిలేను త్రివేణి సంగమమై


    క్షమాపణలతో..

    ఆలోచింపజేసే కవిత పద్మ గారు.. నేటి సమాజానికి వాస్తవిక రూపాన్ని పదాలకు అతిచిన తీరు బాగుంది.. అంతే అసహనం అసమతుల్యత ఉట్టి పడేలా చిత్రం చక్కగా నప్పింది..

    ~శ్రీ~

    ReplyDelete
  4. తిరుగులేని పయనం మీ కవితా ప్రవాహం. సాగిపొండి.

    ReplyDelete
  5. జీవితంలో ఒడిదుడుకులు, అఫ్స్ అండ్ డౌన్స్ లెక్క చేయక, మీవైన భావాలు మాకు అందించండి. చిత్రంలో మీ ఠీవీ కనబడుతుంది

    ReplyDelete
  6. అసామాన్య భాషా పటిమ మీ కవితల్లో.

    ReplyDelete

  7. జీవన గమనపు గతుకుల
    జావళి పాడే జిలేబి జాబిలి పద్మా !
    కావాలి నీ కవిత సరి
    నీవే! కల్తీ గననిది నీ పలుకే నోయ్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  8. samajamloa Unna kaltee gurici caalaa baagaa cepparu Padma gaaru

    ReplyDelete
  9. రాస్తుండు తల్లో...లేకుంటే మస్తు ధూపైతది

    ReplyDelete
  10. కల్తీలేని ప్రేమ అని, కమ్మని కావ్య కవితలు నే రాయలేను..రాస్తూనే రాయలేను అనడం ఎందుకో?

    ReplyDelete
  11. Awesome Pic
    Rocking Mam

    ReplyDelete
  12. జీవన గమనపు గతుకుల గ్రంధమే కనులముందుంటే
    ఇలాంటివి వ్రాయడం మీకు మేము నేర్పించాలా చెప్పండి.

    ReplyDelete
  13. నవ్వుతున్న పెదవులకు దురాలోచ ధూళి అంటుకోవడం
    పరిచయాలు ఇచ్చిపుచ్చుకునే వ్యాపార ధోరణి అయితే...నిజమే లోకం అంతా కల్తీ , కపటమే అని చక్కగా చెప్పారు. చిత్రానికి 100 మార్కులు

    ReplyDelete
    Replies
    1. ఈ కాలం లో ఏ కాలం లోను కల్తి లేనిది అమ్మ ఆప్యాయత.. కల్మషమెరుగనిది నాన్న దీవెన.. మచ్చలేనిది స్నేహం.. సాటిలేనిది అనుబంధం.. విశ్వసనీయతకు ఆలంబనం నమ్మకమనేది.. తక్కినవన్ని మీరు చెప్పిన విధంగా కల్తిలకు దాసోహమయ్యాయి ఆకాంక్షగారు..

      Delete
  14. Your all thoughts and feelings are heart touching.
    Telugulo type yela cheyavalenu evarina chepagalaru.

    ReplyDelete
    Replies
    1. సాహెబ్ పాషా జి.. అ సలామ్ వాలైకుమ్ తెలుగు ట్రాన్సలిటరేషన్ కొఱకు మీరు క్విల్ ప్యాడ్ ను వాడవచ్చును..

      మీరు ముందుగా ఆ పోర్టల్ లో తెలుగు పై క్లిక్ చేసి అనక ఇంగ్లిష్ లో తెలుగు వర్డ్ టైప్ చేస్తే సులువుగా తెలుగులో మారుతుంది..
      It supports both these versions Sir..

      bagunnaaraa బాగున్నారా
      bAgunnArA బాగున్నారా


      ఆదాబ్ అర్జ్ హై

      ~శ్రీ~

      Delete
  15. Mobile lo panichestundaa E vidhamga chstey

    ReplyDelete
    Replies
    1. Mobile lo aithey meeru keyboard select chesukovaali sir..

      Settings.. Language and Inputs.. Keyboards and Input Methods.. Language Settings.. Keyboard Selection.. EN, HI, TE..

      This will enable Multi Language Input Support, thereby, one can easily type in the language of their interest sir..

      Thank you

      Delete
    2. Samsung Galaxy Note 4 SM N910G

      Delete
  16. little bit difficult to understand.

    ReplyDelete
  17. పాండిత్య బురదల బరిలోని దురదతో
    పోట్లాడు దున్నల పొత్తులేల ?
    జనవాడుక పదాలు చంధస్సులో వాడ
    రాదన్న జడులతో వాదులేల ?
    పదిమంది మెచ్చినా , పదపడి తప్పులు
    వెదుకు నసూయకు వెరవ నేల ?
    తప్పులే గాని , యేయొప్పు గానగ లేని
    ధృతరాష్ట్ర గాళ్ళతో తీర్పులేల ?

    లక్షలాదిగ చదువరుల యెదలందు
    చోటు దక్కించుకున్న మీ సాటి రారు ,
    ‘ సరస సాహిత్య కవితా వసంత గాన
    కోకిలవు నీవు , పద్మార్పితా ! ’ కనంగ .

    ReplyDelete
    Replies
    1. లెస్స పలికినారు వెంకట రాజారావుగారు.

      Delete

    2. వారెవ్వా ! సెహభేషు "లక్షాకుల" !
      జిలేబి

      Delete
    3. పాతో పోల జడ రాల పలు వెల తని దృల లదు చోరు సన కోగ..

      ఇదేదో వింత భాష అనుకునేరు.. లక్కాకుల వేంకట రాజా రావు సర్ గారి పద్యం తాలుకు మొదటి, చివరి అక్షరాలతో తయారైన ద్విపదాలు.. సరదాగా మెచ్చుకోలుగా ఇలా రాస్తిని.. క్షమాపణలతో..

      Delete
    4. వారెవ్వా ! సెహభేషు "లక్షాకుల" !
      @జిలేబి .....
      లక్షాకులు మారేడువ ?
      లక్షాకులు పుణ్యతులసి రమణీయములా ?
      లక్షాకులు తమ్ములముల ?
      లక్షాకులు లక్షలాది రసహృదయములా ?

      Delete

    5. శ్రీధర్ బుక్యా గారూ !
      ఆదరముగ మొదటి చివరి యక్షరక్రమముల్
      మోదమ్ముగ కూర్చితిరి , ఇ
      దేదో యొక వింత మెప్పు తీరుగ నుండెన్ .

      Delete
    6. ధన్యోస్మీ రాజారావు సర్..

      పదాలను కలగల్పితే పదబంధమగును..
      పదాలను పలుకగా మాటలగును..
      అటులనే
      మనిషి మనిషి నడుమ స్నేహబంధం పటిస్టమైనచో.. కలకాలం నిలుచును..

      క్రమేపి అక్షరక్రమములతోడ లిఖించే కావ్య భావం యెటులనైనా పదవినియోగమ్ గావింపగ కఠినాతికఠినమైన పదము దెచ్చినా అర్దము ఉండకనుండన

      మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు రాజారావు సర్

      Delete
  18. అక్షర జ్ఞానసంపత్తు మొత్తం మీ సొత్తు
    జీవితంలో ఎదురైయ్యే ఎత్తుపల్లాలు మీకొక లెక్కా చెప్పండి.
    అందమైన భావాలతో అందరినీ మెప్పించగలరు..వ్రాయండి

    ReplyDelete
  19. మీకు మీరు అనుకుంటే సరిపోతుందా

    ReplyDelete
  20. అరమరికలు లేని భావాలకు అక్షరాలు తోడు ఉంటానంటే
    ఏ కంద, సీస పద్యాలో తెలియక పోయినా రాస్తూ తప్పులెన్నో చేస్తూనే ఉంటాను!Good padma

    ReplyDelete

  21. జయఁతి తే సుకృతినః రస సిద్ధాః కవీశ్వరాః
    నాస్తి తేషాం యశః కాయే, జరామరణజం భయం

    రస సిద్ధి కలిగిన కవి పుంగవులకు మహామహులకు చావు పుట్టుకల భయం ఉండదు వారు వారి వారి మంచి పనులతో కలకాలం సుస్థిర స్థానం సంపాదించేదరు

    ReplyDelete
  22. అభిమాన కవయిత్రికి అభినందనలు
    "World Poetry Day"

    ReplyDelete
  23. హన్ననా..మీరు తప్పులు చేస్తే ఊరుకుంటామా

    ReplyDelete
  24. oooixviiiivxiiixivxxiiooo
    వర్ణనకు వర్ణాలైనా సరితూగని సప్తవర్ణాల హోళి
    సప్తవర్ణాల సమాహారం ధవళకాంతుల పౌర్ణమి
    oooixviiiivxiiixivxxiiooo

    ReplyDelete
  25. so far you are writing well. continue

    ReplyDelete
  26. ఏమి వ్రాసినా బాగుంటుంది
    వ్రాస్తూ ఉండండి.

    ReplyDelete
  27. మీ ఆప్యాయ వ్యాఖ్యలకు అభివందనములు.

    ReplyDelete
  28. meerila raastu undaali memila chaduvutu undaali.. super pic..

    ReplyDelete