అరువు బంధాలు...

ఉమ్మడిగా ఉండడమన్న ఊసే వింతగా ఉంది
ఉమ్మడి కుటుంబాల అర్థమేంటో తెలియకుంది!
అమ్మ-నాన్న,అక్క-బావ,చెల్లి-మరిది
అన్న-వదిన,తమ్ముడు-మరదలు,మేనత్త-మేనమామ,
పిన్ని-బాబాయ్,పెద్దమ్మ-పెదనాన్న, 
తాతయ్య-అమ్మమ్మ,నానమ్మ,ముత్తాత-తాతమ్మ...
ఇటువంటి వరుసలు ఉండేవని చెబితే 
నేటితరం విచిత్రంగా చూస్తూ నివ్వెరపోతూ
మమ్మి-డాడీ, అంకుల్-ఆంటీ అనేవి తెలిస్తే చాలు
లోకంలో బంధువులకు కొదవు లేదన్న భావనలో ఉంది!
అందానికి అమ్మపాలు అరువెట్టి పోతపాల పెంపకాలు
మూతి తుడిచి ముడ్డి కడగకుండా డైఫర్స్ వాడకాలు
పుట్టిన పిల్లల్ని ఆయాలకు, క్రెచ్ లో వేయడాలు...
రెసిడెన్స్ స్కూళ్ళు, కాన్వెంట్ చదువులు, ఏవో కోర్సులు
అమ్మచేతి ముద్ద పోయే, పిజ్జా బర్గర్లైన పిండి వంటలు  
వీటితో రక్తసంబంధం అంటే ఏమిటో తెలియని దుస్థితి
ఎవరు చుట్టాలో, ఎవరు మనవారో తెలియని పరిస్థితి
ఇంకెక్కడి నుంచి పుట్టేను ప్రేమాభిమానాలు ఆప్యాయతలు?

29 comments:

  1. నేటి కాలపు బంధాలకు అద్దం పట్టారు పద్మ గారు..
    ఐతే బాంధవ్యాలలో దాగి ఉన్న తీపిని క్రమేపి ఈతరం మరిచిపోతోంది..
    బంధాలలో ఆ పిలుపులు పలకరింపుల జోషే వేరు..
    భావి తరాలు పచ్చని చెట్లను.. కాలుష్యరహిత భూమిని.. కల్మషంలేని బంధాలని.. ఆప్యాయతానురాగాలను మరుగున పెట్టే దుస్థితి రాకూడదనే అభిలాషా..

    అందుకే ఈ మారు కవితాక్షరాలుగా కాకుండ ఇలా కూర్చాను వ్యాఖ్యను పద్మ గారు

    ReplyDelete
    Replies
    1. కాలమనే ఇసుక తిన్నెల్లో జ్ఞాపకాల అడుగుజాడలు

      Delete
    2. కొంత మంది కోడళ్ళకి మెట్టినింటి కంటే పుట్టినిల్లే కావాలి. సంవత్సరములో సగటున పది నెలలు పుట్టినింటిలోనే ఉండటానికి ఇష్టపడతారు, కాని మెట్టినింటి ఆస్తి మాత్రం దక్కాలని ఆపసోపాలు పడుతుంటారు. అటువంటి వారిని ఏమనాలో తెలియదు. భర్త, మెట్టినిల్లే సర్వస్వం అనుకునే ఇల్లాలికి పుణ్యం, ధనధాన్యాదులు, ఆయురారోగ్యాలు ఆశిర్వచనం పుష్కలం.

      Delete
  2. కలసి ఉండాలి కుటుంబాలు...సూపర్ చెప్పారు

    ReplyDelete
  3. ఏమైనారు అనుకుంటి
    మస్తు సెప్పిండ్రు మాడం

    ReplyDelete
  4. నేటితరం బంధాలు అనిశ్చలం. :(

    ReplyDelete
  5. చిన్న కుటుంబం చింతలేని కుటుంబమని గొంతు చించుకుని చెప్పి ఇప్పుడు బాధపడి ప్రయోజం ఏముందండి. మంచి ఉపయోగకరమైన పోస్ట్ వ్రాశారు.

    ReplyDelete
  6. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా స్త్రీ పురుషులు ఇరువురు ఉద్యోగం చేయవలసి వస్తుంది దానికి తోడు ఉమ్మడి కుటుంబాలను వద్దనుకుని విడిగా ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు అనుబంధాలు ఆప్యాయతలకు చోటు ఎక్కడ ఉంటుంది. జనం వీటిని విస్మరించినా క్రమేణా ఈ జీవనశైలికి విసుగు చెంది మరల పాతరోజులే కావాలని కోరుకుంటారు ఇది తధ్యం-హరినాధ్

    ReplyDelete
  7. ముత్తాత తాతమ్మ....
    ఇలా వరుసలు ఉన్నాయని, ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
    మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
    ఇవి రెండు తెలిస్తే చాలు....
    ఇదే నేటి ప్యాషన్...
    మంచి పోస్ట్ రాసి ఆలోచింపజేసినారు

    ReplyDelete
  8. ఇంకెక్కడి బందాలు?
    బందుత్వాలు?
    అందుకే-కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది
    రోజుకొక ఓల్డ్ ఏజ్ హోం సంఖ్య పెరుగుతూ పోతుంది.

    ReplyDelete
  9. ఆలస్యంగా ఆలోచనా విధానాన్ని మార్చి ఆలొచించే విధంగా వ్రాసారు పోస్ట్.
    పిక్ కూడా వెరైటీగా ఉందండోయ్.:-)

    ReplyDelete
  10. క్రింది విధంతో మొదలు..
    కాన్వెంట్లు..రెసిడెన్సు స్కూళ్లు
    ఎవడు చుట్టమో..ఎవడు పట్టమో తెలియదు
    ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప
    ఇంజనీరింగో మెడిసనో చేయడం
    ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం
    వాట్సాప్ లో చాటింగ్
    ఐ ఎం ఓ లో విజిటింగ్
    స్కైప్ లో వీడియో కాలింగ్
    అమేజాన్ ద్వారా షాపింగ్
    నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపి ఆనందం
    పెళ్లి ముందురావడం..అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం
    ఇంకెక్కడి ప్రేమలు అభిమానాలు..ఇది నేటితరం

    ReplyDelete
    Replies
    1. చేదుగా అనిపిస్తున్నా.. ఈ తరం కాస్త అటు ఇటుగా మీరు చెప్పినట్లే ఉంది ఈ కాలపు వ్యవహారం..!

      ఐతే సమాజంలో కనీసం ప్రతి కుటుంబంలో అమ్మ నాన్న, భార్య భర్త, పిల్లలు కలసికట్టుగా ఉంటే అనురాగాత్మీయతకు ప్రేమానురాగాలకు కొదవ ఉండదు. ఒంటరితనమనేదే సమసిపోతుంది తుదకు.. నైతిక విలువలు.. సంస్కారం.. గుణగణాలు మెఱుగు పడ్తాయి..!

      తరం మారినా బంధాలలో పట్టు సడలకూడదు

      Delete
    2. కలసి ముచ్చటించి
      ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి
      ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం..ఆశిద్దాం

      Delete
  11. దయలేని దుస్థితి
    చూడలేని పరిస్థితి
    :( :( :(

    ReplyDelete
  12. ప్రస్తుతం బంధాలు అన్నీ ఇలాగే ఉన్నాయండి.

    ReplyDelete
  13. బాల్యం నుండే మార్పు రావాలి. బంధాలు పెరగాలి.
    అమ్మమ్మ, నానమ్మల కథలు వినాలి.తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి.
    కుటుంబంలో ఉండే ఆనందం తెలపాలి. అది మనింటినుండే ప్రారంభం కావాలి.

    ReplyDelete
  14. బంధాలు బీటలుబారి ముక్కలైనాయి అనుబంధాలు రాను రాను అరువు తెచ్చుకోవలసిందే. బాధాకరమైన నిజాలు రాశారు.

    ReplyDelete
  15. నేడు అయ్యా, అమ్మ సస్తే తప్ప...
    కనీసం దాయాదులు పోయినా దగ్గరోడు సచ్చినా వచ్చి చూసేది లేదు, పరామర్శా లేదు మానవత్వం సచ్చింది అనిపిస్తుంది ప్చ్ ప్చ్ :(

    ReplyDelete
  16. చించారు పోస్ట్
    గుండెల్లో తూటాలు గుచ్చారు

    ReplyDelete
  17. కుటుంబవ్యవస్థలు నేడు దెబ్బతిన్నాయి. చక్కగా వివరించారు.

    ReplyDelete
  18. పద్మార్పితగారూ...ఎలా ఉన్నారు?
    హఠాత్తుగా ఇదేమిటి ఇలా దర్శనం?

    ReplyDelete
  19. ఇంకెక్కడి ప్రేమాభిమానాలు?

    ReplyDelete
  20. జరుగుతున్న వాటికి పరిష్కార మార్గం చెప్పండి పద్మాజీ.

    ReplyDelete
  21. హైటెక్ సొసైటిలో అన్నీ హైటెక్ ఆలోచనలు వాటి ప్రతిఫలం ఇదే...
    భూమి గుండ్రంగా ఉన్నట్లే తిప్పి తిరిగి మళ్ళి పాతపద్దతులకే చేరుకుంటాం

    ReplyDelete
  22. అందరికీ అభివందనం _/\_

    ReplyDelete