నేనున్నాను..

రేపన్నది నేను లేకుండానే మొదలై...
సూర్యోదయాన్ని నేను చూడలేకపోతే,
కన్నీటినే తుడుచుకుని సాగిపో నేస్తమా
సూర్యచంద్రులే నీ నేస్తాలనుకో మిత్రమా!
నీవు నన్ను ఎంతగా చూడాలనుకుంటావో
నేను నిన్ను అంతగా చూడాలనుకుంటాను
తలచుకున్నదే తడవు వెక్కిళ్ళుగా వస్తాను!
వాగ్దానం అయితే చేయబోను రేపు నీదేనని...
నేడు మాత్రం నీ ఆత్మవిశ్వాసమై తోడుంటాను,
నమ్మకానికి ఆదరిన నీవుంటే ఈ దరిన నేనుండి
నా అసంపూర్తి విజయాల్ని నీలో చూసుకుంటాను
కాబట్టి తలుచుకో చాలు నీ గుండెల్లో నేనుంటాను!

22 comments:

  1. వావ్ సో బ్యూటిఫుల్ మై ఫ్రెంఢ్. థ్యాంక్యూ

    ReplyDelete
  2. స్నేహానికి సరైన న్యాయం ఇదే అన్నంతగా అలరించావు అర్పిత, భవ్యం నీ ప్రతీ అక్షరం మరియు చిత్రం-హరినాధ్

    ReplyDelete
  3. ఇటువంటి స్నేహం అందరికీ దక్కాలి. చాలబాగుంది పద్మగారు.

    ReplyDelete
  4. మాకు మీ దోస్తి చాలా ఇష్టం.

    ReplyDelete
  5. మిత్రమ త్యాంక్యు

    ReplyDelete
  6. స్నేహమో, బంధమో.. మొత్తానికి మనమేం చేసినా ఒక బలం ఉండాలి. లేకుంటే ఆత్మవిశ్వాసానికి బూస్ట్‌ ఉండదు. ఆ ధైర్యం ఎవరైనా స్నేహమా, ప్రేయసా, పేగుబంధమా అని లేదు. తలుచుకుంటే కళ్లముందు కనిిపంచే ఆ ప్రేరణ ఇచ్చే మూర్తిమత్వాన్ని చూపించినందుకు థాంక్స్‌.

    ReplyDelete
  7. Great poem padma. thank you.

    ReplyDelete
  8. మీ రాతలతో మాకు తెలియని మరో కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తున్నారు..పద్మ గారు

    ReplyDelete
  9. స్నేహానికి మీరు ఇచ్చిన నిర్వచనం చాలాబాగుంది పద్మగారు.

    ReplyDelete
  10. స్నేహం అంటే ఇదేరా అనే లెవెల్ లో వ్రాశావు. ఇంత అందమైన స్నేహం దొరికితే ఎంత అదృష్టమో!

    ReplyDelete
  11. పద్మగారు మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా ఈ కవితని షేర్ చేసుకున్నం. త్యాంక్సండి

    ReplyDelete
  12. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

    ReplyDelete
  13. భవిష్యత్ కాల కాల్పనిక అనిశ్చిలో ఒక ఒక ఆరాధ్యకుడి ఆపన్న మిత్రురాలి అదృష్యాన్ని సందర్భంగా మలిచి మీహృదయానుభూతిని జోడించి సమపాళ్ళలో లిఖించబడ్డ కవిత.
    పూర్వం కవులు పురాణేతిహాసాల్లో ఒక సందర్భాన్ని అష్టాదశ వర్ణనలతో వర్ణించేవారు, దాన్ని ప్రభంధం అంటారు... భవిష్యత్తును ఊహాగా మలిచి వ్యాపకంలో జ్ఞాపకమై, ఆచరణలో ఆత్మవిశ్వాసమై చిత్రకాలం తనలో మిగిలిపోయే భావాల్ని హృద్యంగా జొప్పించి అవాగ్దానభారితమని అంటూనే హృదయం ద్రవించే వాగ్దానమిచ్చారు... సలాం! మేడం...

    ReplyDelete
  14. నేనూ ఉన్నాన్ను... మర్చిపోయారా బహుకాల దర్శనమని... :-) మీ నేనున్నాన్ను నాకు నేనున్నానన్నట్టు నన్ను ఇంకో నన్నులా అనిపించేట్టు చేస్తోంది...

    ReplyDelete
  15. మీ స్నేహమయ హస్తాన్ని అందించి హృదయాన్ని మీటినారు అంటే అపార్ధం చేసుకోకండి. వండల్ఫుల్ కవిత.

    ReplyDelete
  16. కవిత ద్వారా స్నేహ హస్తాన్ని చక్కగా అందించారు.

    ReplyDelete
  17. మనసుని తాకిన కవిత.

    ReplyDelete
  18. అధ్భుత స్నేహమయి అనురాగం పంచినట్లుంది మీ కవిత. చిత్రం కూడా నప్పింది.

    ReplyDelete
  19. స్నేహానికి నీరాజనం మీ కవిత

    ReplyDelete