ప్రేమలో అంతరం!!!

ప్రేమకి మరణం లేదంట!
అందుకే మరల మరల ప్రేమిస్తారంట!

ఒకరు మనసు విరిస్తే వేరొకరు అతికిస్తారంట!
ఇదీ నేటితరం ప్రేమికుల మాట!!!


ముందు ప్రేమనేది ఒకరికే అయేది సొంతం!

అందుకే అప్పుడు దేవదాసు పార్వతీలు అయ్యారు అంతం
!
ఇప్పుడు చూడు ప్రేమకి మారింది అర్ధం
!
మునుపటిలా ఎవరూ ప్రేమను చేయడంలేదు వ్యర్ధం!!!

దేవదాసుకి పార్వతి కనిపిస్తుంది అందరిలో!

పార్వతి చూస్తుంది దేవదాసుని కొందరిలో!

ఏది ఏమైనా ప్రేమనేది వుంది ప్రతి ఒక్కరిలో!
మార్పు వచ్చింది మానవుని ఆలోచనా సరళిలో!!!

11 comments:

  1. విశ్వవ్యాప్తమైన ప్రేమను ఒక్కరికే పంచవద్దనే ఆలోచన బాగుంది. అయితే అది ఎంత వరకు సాధ్యం

    ReplyDelete
  2. మార్పు అత్యంత సహజం అండి.. అంత్యప్రాస కోసం బాగా కృషి చేసినట్టున్నారు కదా..

    ReplyDelete
  3. Anonymous02 May, 2009

    bhalea vundea!

    ReplyDelete
  4. ప్రేమిస్తావా చితి నుండి లేచొస్తాను అన్నది పాత మాట

    మన సిస్తావా పతి నైనా వదిలేసి వస్తాను

    అన్నది ఈ తరం నయా ప్రేమికుల మాట

    బాగుందండి మీ భావన

    ReplyDelete
  5. చాలా బాగుంది.....

    ReplyDelete
  6. Yeh! its interesting.

    ReplyDelete
  7. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

    ReplyDelete
  8. నిజానికి ప్రేమ అన్నదానికి అర్థం, నిర్వచనం కనుక్కునే ప్రయత్నంలోనే వున్నానేమో కూడా. ప్రేమ అజరామరం. అది నిజం. ఇక ప్రేమించే మనసుకి గమ్యం వుండదు, అందుకది ఆగదు.
    >> ఒకరు మనసు విరిస్తే వేరొకరు అతికిస్తారంట!
    ఒకరు విరిచినా, వంచించినా మరొకరు ప్రేమతోనే నయం చేస్తారన్నది మాత్రం నేను అంగీకరిస్తాను.

    IMHO love is something to do with learning, learning by living. You may learn something not taught anywhere and never even imagined. And finding a true love and proving to yourself that it is not just lust nor a need/desire has to come from the mind that gives, shares and deserves the same in return. It is mutual and got to be mutual. Love is hence again a blessing from god, you have a mind to love yet are you blessed to find a mind that has love for you? Love is an eternal feeling and some mistakenly take a provisional relation to be love.

    ReplyDelete
  9. Padma garu namaste andi meru cheppindi correct

    ReplyDelete
  10. దేవదాసుకి పార్వతి కనిపిస్తుంది అందరిలో!
    పార్వతి చూస్తుంది దేవదాసుని కొందరిలో!

    ademiTanDi maga vallani anthaga takkuva chesesaru

    ReplyDelete
  11. బాగుంది. బాగుంది. అనురాద్ కాశ్యప్ కొకసారి ఈ కవిత చూపించాలి.

    ReplyDelete