చేజారాక....

వెతకి వేసారినా నాలో దాగిన నన్నుకానక
నా అనుకున్నా ఎవరిలో స్వార్థం నేజూడక
తెలిసింది ఈ నిజం పలుమార్లు పడి లేచాక
తెరచాప ఒడ్డున వాలె నావ నీటమునిగాక

మదినొకటి పెదివిపై పలుకొకటని తెలిసాక
నమ్మకమే పోయె అన్నీ చేజారిపోయాక
సంపాదనలో అంబరమంత ఎత్తు ఎదిగాక
తెలిసె చందమామ తారలకే సొంతమైనాక

కోప ద్వేషాగ్నితో చేతులు కాల్చుకున్నాక
శాంత లేపనం పూయనేల బొబ్బలెక్కాక
అంధకారంలో ఆశ్రయ ఆసరాలనందించక
కొవ్వొత్తై కరగనేల సూర్యుడు ఉదయించాక

ఏమైనా గడచిన కాలాన్ని మరింక తలవక
నిరాశచెంది నిసృహలతో కాలం వెళ్ళదీయక
గతం నేర్పిన పాఠాల అనుభవంతో చలించక
జన్మకి సార్థకత చేకూర్చుకోవాలన్నదే కోరిక

22 comments:

  1. బొమ్మ బాగుంది.

    ఏమైనా గడచిన కాలాన్ని మరింక తలవక
    నిరాశచెంది నిసృహలతో కాలం వెళ్ళదీయక
    గతం నేర్పిన పాఠాల అనుభవంతో చలించక
    జన్మకి సార్థకత చేకూర్చుకోవాలన్నదే కోరిక

    ఇలా జరిగితే ఎంత ఆనందం.

    ReplyDelete
  2. అనుభవాలతోనే కదండీ మనసు గట్టిపడేది.ఆ పాఠాలతోనే కదా !జీవితం సాగాల్సింది.
    మదినొకటి పెదివిపై పలుకొకటని తెలిసాక...
    ప్రస్తుతం లోకం ఇలా సాగుతోంది మరి.జీవిత సారం తెలియజేసారు.

    ReplyDelete
  3. కనిపించేదంతా బంగారం కాదు...
    అన్నది ముందు తెలిస్తే...
    మోసపోము కదా!
    మన అనుభవాలే మనకి పాఠాలు...గుణపాఠాలు
    చాలా బాగుంది పద్మ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  4. బాగుంది పద్మార్పిత గారు:-)
    సందేశాత్మకంగా

    ReplyDelete
  5. పద్మ గారూ, గడచిన కాలాన్ని తలవకూడదంటే దాన్ని మరిచిపోయే సన్నిహితం దొరకాలి.
    ఆ సన్నిహితం అల్లాగే ఉంటుందని నమ్మకం మనసుకు కుదరదు . వెరసి చరిత్ర పునరావృతం.
    ఇదంతా మనసు మాయావి మహత్యం. కవిత ఆలోచింప చేస్తుంది బాగుందమ్మా
    ఇలాగే ఇంకా ఎన్నో కవితలు రాయాలని ఆసిస్తూ..మెరాజ్

    ReplyDelete
  6. Inspiring poetry & pic is too good.

    ReplyDelete
  7. అలా చివరిలో ఒక కంక్లూజన్ ఇచ్చేతీరు నాకు నచ్చుతుందండి.Keep it up.

    ReplyDelete
  8. చాలా బాగుందండి. ఆఖరి నాలుగు చరణాలూ మరీ బాగున్నాయి.అయితే కోప ద్వేషాగ్ని,శాంత లేపనం లాంటి సమాసాలు పరిహరిస్తే కవిత ఇంకా రాణిస్తుంది.

    ReplyDelete
  9. Meerilaa jeevana saaraanni kaachi vadabosi kavitveekarinchaaka kaadanagalama Padmagaru..

    Pic is also nice as usual...

    ReplyDelete
  10. మదినొకటి పెదివిపై పలుకొకటని తెలిసాక
    నమ్మకమే పోయె అన్నీ చేజారిపోయాక..
    కళ్ళతో పలుకరించి నొసటితో వెక్కిరించేతనం నిండుగా వున్న లోకమండీ..బాగుంది మీ కవితా ఝరి...అభినందనలు..

    ReplyDelete
  11. మీకేం పద్మగారు ఎన్ని అడ్డంకాలైన హాయిగా దాటేయగలరు.
    మీలో ఆ ధైర్యం, ధీమా ఉన్నాయిగా...సదా జయహో!:)

    ReplyDelete
  12. chaala bagundi padmarpita garu

    ReplyDelete
  13. nice pic and very very nice poetry

    ReplyDelete
  14. పదహారు చరణాలు -
    చరణాల చివర పదహారు 'క' ళలు - చూస్తుంటే ...
    ఆ షోడశ కళల' చంద్రున్ని ' మరవడం -
    సాధ్యం కాదేమో -
    అనే సంకేతం ధ్వనిస్తోంది కవితలో .
    ----- సుజన-సృజన

    ReplyDelete
  15. Inspiring but little bit lack in expressing padmarpita:)

    ReplyDelete
  16. nenu good good ani 2 saarlu cheppina thanks cheppaledu

    ReplyDelete
  17. I'm a rain tear in a storm, A drop of water in the huge ocean, A piece of dust in the hot desert, The breath of wind wing, The sea kiss on the shore, A book with lot’s of pages unwritten, An ephemeral moment of earthly existence, That help hand given to a friend, hope and curse. I'm so many things in the same time…. And NOTHING important/special for the world! Only a human being, I’m GOD creation! As all of us!


    baaga comment cheyalani undhi.cheyamantara

    ReplyDelete
  18. mee blog lo paintings anne meray vesara chaala bavunnayi.inthaku mundu ee vishayam evarina cheppi unte valla maatalu nammakandi.nannu matrame nammande.ee prapamcham lo andaru abaddala korule nenu thappa hahahahaha

    ReplyDelete
  19. పద్మ గారూ, గడచిన కాలాన్ని తలవకూడదంటే దాన్ని మరిచిపోయే సన్నిహితం దొరకాలి.
    --------------
    Very True

    ReplyDelete