రంగులద్దుదాం రండి....

 లోకంలోని రంగులన్నీ రంగరించి ఒకటవనీ
రంగువెలసి కళచెదిరిన చిత్రాలని పూర్తికానీ
రక్తం అందరిదీ ఎరుపేనని చిత్రానికి బొట్టద్దనీ
మిగిలున్నవారికి మన అన్న భరోసానివ్వనీ
ఆకుపచ్చరంగద్ది బ్రతుకుపై ఆశను చిగురించనీ
స్వచ్ఛందంగా సేవలందించి క్రొత్తజీవితాలనివ్వనీ
అధికార అహంకారాలపై తెల్లని ముసుగువేయనీ
ప్రాంతాలువేరైనా అంతా మానవజాతేనని తెలుపనీ
నీలంలో ప్రేమపాలుపోసి గంగకోపానికి లేతరంగద్దనీ
ఆ రంగే ఆకాశంలో వంతెనై వారిని గమ్యానికిచేర్చనీ
ప్రళయభీకర చిత్రం చూసి కార్చిన కన్నీటిని కలవనీ
 సహాయపు ఐక్యతాకుంచెలతో చిత్రకారులుగా మారనీ

మనిషిలో ప్రాణమిచ్చే కళాకారుడున్నాడని తెలుపనీ
పూరించిన చిత్రాన్ని చూసి ప్రకృతే యోచిస్తూ జంకనీ
మానవత్వం ముందు వైపరీత్యాలు ఎంతని పారిపోనీ!

(ఉత్తరాఖండ్ విషాదంపై నా భావం)

23 comments:

  1. అత్యంత విషాదమైన ఉత్తరాఖండ్ సంఘటనపై మీ ( మా ) ఆవేదనను వర్ణ ( వ్యధ ) భరితంగా విషాదకరించిన మీ విధానం ప్రశంసనీయం ...

    ReplyDelete
    Replies
    1. Mahadi Ali Gaaru,
      "Vishaadakarinchina" kaaadandoi.. "Vishidikarinchina"

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. Bhukya Sridhar gaaru ...
      nijame ..aa padam tappugaa raasaanu ..naa matru bhasha kaakapovadam valana Telugulo kaasta poor ...i saariki manninchandi..

      Delete
  2. మనిషిలో ప్రాణమిచ్చే కళాకారుడున్నాడని తెలుపనీ
    పూరించిన చిత్రాన్ని చూసి ప్రకృతే యోచిస్తూ జంకనీ
    మానవత్వం ముందు వైపరీత్యాలు ఎంతని పారిపోనీ!.. (Y)

    లోకంలోని రంగులన్నీ ఏకమై శాంతి కపోతాన్ని ఎగరనీ..
    మీ రంగుల మానవతా చిత్రం బాగుందండీ పద్మార్పిత గారు..

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యలో మొత్తంసారాన్ని చెప్పారు.

      Delete
  3. జాతులను రంగులుగా భావించి కుంచెతో చేయూతనిస్తున్న నీ భావం కవిత , చిత్రం బాగుంది .
    ప్రార్ధించే చేతులు కన్న ( చేయూతమిచ్చే )చేయూతనిచ్చే చేతులు మిన్న కరెక్ట్ .

    ReplyDelete
  4. అందరూ ఏకమై అవసరానికి ఆదుకోవాలని మీదైన భాషలో రంగులద్ది చిత్రాన్ని చక్కగా పూరించారు.

    ReplyDelete
  5. Anonymous03 July, 2013

    claps to your thoughts mam

    ReplyDelete
  6. ఉత్తరాఖండ్ బాదితులనుద్దేసించి ఎంతో చక్కని కూర్పు తో అల్లిన పదబంధాన్ని చదివాను. మీలో కళాత్మకత కు దర్పణం పట్టే viదంగ ఉంది. విధి వైపరిత్యాలకంటే మానవమాత్రులం మన నుండే ప్రకృతి సహజత్వం కొల్పొఇ ఇలాటి దురదృష్టకర వరదలు వస్తు ఉంటాయి. విధిని అనే ముందు మనం చేసేది తప్పో ఒప్పో నిర్ధారించుకుని చేస్తే అది లోక కల్యాణానికి దారి తీస్తుందని నా ప్రగాడ నమ్మకం

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  7. Anonymous03 July, 2013

    padma konchem elaborate cheste inka baagundedani maa friends antunnaru. ranagulaki bhashyam cheppadam neeke sontam.

    ReplyDelete
  8. nijanga chaala badakaramaina vishayam! maa inti daggarinundi 28 members velite 9 members tirigivacharu, aa shock nundi nenu inka kolukolekapotunnanu, valla atmaki shanti chekuri vall kutumbaalaku mano dhyryaanni ivvalani korukuntunnanu, kavita chaala bagundi:-))

    ReplyDelete
  9. రంగులంత కళాత్మకంగా భావాలనీ అద్దగలరని నిరూపించారీకవితలో.
    సంతోషాన్నే కాదు, విషాదాన్నీ కళాత్మకంగా చూపొచ్చు బొమ్మల్లో. కానీ రంగుల్లోనే కాదు భావాల్లోనూ కళాత్మకంగా ఆలోచించొచ్చు అని చేసి చూపారీ కవితలో.
    అసామాన్యం!

    ReplyDelete
  10. Anonymous03 July, 2013

    yenta baga chepparu chinna aasha garu. padmarpita kalaahrudam baga artham chesukunnatlu.

    ReplyDelete
  11. నీలోని మానవత్వానికి దర్పణం ఈ కవిత ఇంకా చిత్రం.

    ReplyDelete
  12. చాలా బాగుందండి మీ కవిత మిణుకుమిణుకు మంటున్న మానవత్వపు దీపానికి చమురు పోసి ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపిన మన సైనికులకు hatsoff

    ReplyDelete
  13. మీ మనసుకేకాదు మీ కుంచెవికూడా మంచిభావాలే.....అభినందనలు.

    ReplyDelete
  14. ఈ విషాద ఉధంతంపై స్పందించిన ప్రతిమనసుకి నమోవందనం.

    ReplyDelete
  15. అందమైన మనసున్న మానవతా చిత్రకవిత్వం

    ReplyDelete
  16. pic lone mottam chepparu, touched with humanity.

    ReplyDelete