కనువిప్పు

వానకు తడిసిన గోడలు కూలిపోయినట్లుగా
మమకారమున్న మనసుపొరలు మాసిపోతే
నిర్లిప్తభావాలు నిస్సంకోచంలో సగం చిట్లిపోయి
గోడ పై అందంగా పేర్చబడ్డ గాజుముక్కలయ్యే!

గెలవాలన్న ప్రయత్నం యుద్ధం చేసినా కూడా
వందమార్లు ఓడి నూటొకటవసారైనా గెలవలేక
వానవెలిసాక కరెంటుతీగకు వేలాడే నీటిచుక్కలై
చేతకాని ఆశలన్నీ ఆత్మహత్యకు తయారయ్యే!

ఇంధ్రధనస్సే విల్లై వంగి ధైర్యమే దూసుకురాగా
నిబ్బర నిక్షేపాలు ఉరుములై వెచ్చని ఊపిరైతే
నీడ కంపించి నిజాలెన్నింటినో కక్కి నిలకడనిస్తే
చూరట్టుకు వ్రేలాడుతున్న సూక్తులే జారిపొయ్యే!

పదాలు వెచ్చని పందిర్లు కాగా నిశ్శబ్దం నవ్వగా
ఓర్చుకోలేనన్న బాధని ఉప్పెనైనా ఊరడించలేక
ముసురు పట్టిన భావాలు బురదలో కొట్టుకుంటూ
విరిగిన చెట్టుకొమ్మపై నిలచి శోధనకి సిధ్ధమయ్యే!

52 comments:

  1. వేదనాత్మకం.

    ReplyDelete
  2. నీడ కంపించి నిజాలెన్నింటినో కక్కి నిలకడనిస్తే
    చూరట్టుకు వ్రేలాడుతున్న సూక్తులే జారిపొయ్యే!

    ReplyDelete
    Replies
    1. నిజం ముందు ఏదీ నిలబడలేదు కదా ఆశ

      Delete
  3. పదాలు వెచ్చని పందిర్లు కాగా అధ్భుత భావం

    ReplyDelete
    Replies
    1. సున్నితమైన మాటలు లేపనాలుగా పనిచేస్తాయని

      Delete
  4. మమకారమున్న మనసుపొరలు మాసిపోతే
    నిర్లిప్తభావాలు నిస్సంకోచంలో సగం చిట్లిపోయి
    గోడ పై అందంగా పేర్చబడ్డ గాజుముక్కలయ్యే! వేదనలో పదప్రవాహం

    ReplyDelete
    Replies
    1. మమకారానికి మసిపూసి కొన్నాళ్ళే కాపాడగలం, ఒక్కమారు మనసు విరిపోయిన తరువాత అతుక్కున్నా అలంకారప్రాయమే కదా...

      Delete
  5. గుండెల్ని పిండే పదజాలం మీ కవితావలలో చిక్కుకుని విలవిలాడుతున్నట్లుంది

    ReplyDelete
    Replies
    1. ఒకోమారు ఈ అక్షరాలే నాకు ఆసరా ఏమో అనిపిస్తా ఆకాంక్ష

      Delete
  6. /* జీవితం గడుస్తున్నకొద్దీ రోజుకో బాంధవ్యాల క్రీడ.. అన్నీ ముసుగేసిన మనసులే... కొన్ని సంతోషపెట్టడానికి...మరికొన్ని మనస్సును కప్పి పుచ్చుకోవడానికి .. ఇంకొన్ని మోసగించడానికి.... ఈ క్రీడా ప్రయాణం నిర్లిప్త భావాల్లో చాలా సార్లు మనస్సు పగిలి ముక్కలవడం సహజం... */ గెలుపే జీవిత పరమార్థం అని లక్షల మేధావులు అంటుంటారు... ఓటమి విజయానికి మెట్టు... ప్రయత్నం చెయ్ గెలుపు నీదే... ఇలాంటి ఎన్నో సూక్తులు చూస్తుంటాం... కొన్ని నిర్దిష్ట అంశాలకు సంభందించిన గమ్యాలకు ఒక పరిధి గీస్తే చాలా వరకు అక్కడ మనస్సు కోరుకున్నది పరిధిలో ఉండదు... మనస్సును తృప్తిపరుచుకున్నవాడే అంతిమ విజేత .. కానీ ఎన్ని విజయాలు చూసినా .. ఓటములు వరించిన మనస్సు అలిసిపోదు .. త్రుప్తిపడదు... కోరికలను జయిస్తే సుఖంగా ఉంటాడు అన్న గౌతమభుద్ద అష్టాంగ మార్గాలు బహుశా మనుషులకి ఇప్పుడు వర్తించవు అనుకుంటా... కానీ పరిణితి చెందిన వైరాగ్యభావాలు హృదయంలో మెదిలినపుడు ఇలాంటి రాగాలే ధ్వనిస్తాయి... కాని ఇక్కడ మీరు పూర్తిగా వ్యతిరేకం... ఇంకొకటేదో బలీయమైన జిజ్ఞాశ మీ యెదలో... విజయం ..ఓటమి కన్నా అది అతీతమైనది.... ఆశలు ఆత్మహత్యకు గురయ్యే... అని రాసినంతమాత్రాన ఈ కవితని నిరాశావాద ధోరణిలో చూడ్డం భావ్యం కాదనిపిస్తోంది... ఎందుకంటే ఒక నిబ్బరత్వం... ఇంద్రధనస్సునుంచి విల్లులా దూసుకుపోయే ఒక తత్వం ... సనాతన సూక్తుల త్యాజత్వం... కలగలిసి కొత్తభావాలకు పునాదులు వేస్తున్నాయి... భాదని ... నిశ్శబ్దాన్ని ఒక శూన్యంలో నెట్టేసి వసంతాన్ని వెన్నెల్ని కలగలిపి కొత్త రుతువుని సృష్టించాలనే తపన కనిపిస్తోంది... సరికొత్త శోధనలకి నాంది పలుకుతోంది మీ కవిత.... మొత్తానికి ఆశావాదస్పూర్తి అడుగంటినట్లు అనిపిస్తూ ఆశలకి అంకురాలు తోడుగుతూ మళ్ళీ సంకెళ్ళు వేసే ప్రయత్నం అయితే ఈ కవిత్వంలో జరుగుతోంది.... */ అద్భుతమైన పదబంధాలను సమయస్పూర్తిగా వాడి కవితలోని వ్యక్తి యొక్క అంతర్గత బాధని వ్యక్తపరిచారు... సలాం!!

    ReplyDelete
    Replies
    1. ఈ కమెంట్ ఖచ్చితంగా సతీష్ కొత్తూరిగారు వ్రాసిందే అని చెప్పొచ్చు. మొత్తానికి జీవితసారాంశం గురించి చెప్పి మెప్పించారు.

      Delete
    2. Kadandi inks menu comment rayaledu. Evaro chala baga rasaru

      Delete
    3. నమ్మలేకున్నా వేరెవరో అంటే

      Delete
    4. Padmarpita Fans blog...కర్త, క్రియ, క్రియేటర్ ఎవరో కానీ వారికి ముందస్తుగా వారికి నా హృదయపూర్వక అభివందనాలు. నా మనసులోని అలజడులకి ప్రతిరూపం ఏమో అనిపించే విధంగా వ్యాఖ్యలు రాసారు. మొత్తానికి అభిమానానికి పరాకాష్టలా నా రాతల్లో నా మనసుని చదివిన మీ అభిమానానికి నమోఃవందనం.

      Delete
    5. @ఆకాంక్ష...నేను ముందు మీలాగే అనుకున్నాను.
      @సతీష్ కొత్తూరి... నిజమే చాలా బాగా మనసు చదివారు. మీరు మెప్పు పొందడం మరో ప్లస్ పాయింట్ వాళ్ళకు:-)

      Delete
  7. ఈ ఏడుపుగొట్టు కవితలు ఆపరా...
    బహుశా ఇవే మీకు ఆసరా...
    కొంపదీసి మీరు బాసర సరస్వతీదేవి ఆవహించిన తిరుమల పద్మావతీ దేవి స్వరూపమా... hi hi haa haaa,....

    ReplyDelete
    Replies
    1. కొంతమంది బాధల్లో ఉన్నా సంతోషాన్ని పంచుతారు,కొంతమంది సంతోషంగా ఉన్నా అసంతృప్తితో బాధలని" కొని " తెచ్చుకుంటారు.ఏమీ చెయ్యలేం..... అగ్రిగ్రేటర్ కి వస్తే అన్నిటినీ భరించాలి లేదంటే అన్నీ వదిలేసి అడవుల్లోకి పోవాలి.అడవిలో కూడా సుఖపడతారని గ్యారెంటీ లేదు.

      Delete
    2. Well said Vinod ....
      ఈ ఏడుపుగొట్టు కవితలు ఆపరా...? ఇవేనా మీకు ఆసరా...?
      You have almost stolen my words .

      Delete
    3. వినోద్జీ మరి వెంకట్జీ అసలు వేదనలో పస ఉంటుందని అనేకసార్లు పద్మార్పితగారు అందంగా కవితల్లో అలరించి రుజువు చేసారు. మీరు ఏడుపుగొట్టు అనడం బాగున్నట్లులేదు

      Delete
    4. మనం వద్దంటే మాత్రం మానేస్తారా ఏంటి పద్మార్పిత :-), ఏడవాలన్నా ఏడిపించాలన్నా ఆమెకే సొంతమని గతంలో ఎన్నోసార్లు రుజువుచేసారు కదా :-)

      Delete
    5. @ వినోద్..నవ్వించడం అతి సులభం, మనం ఏడుస్తూ ఇతరులని కూడా ఏడిపిస్తున్నాము అంటే వారిలో మనసులో మనం స్థానం సంపాధించుకున్నట్లే కదా. మీరు ఏడుపు ఆపరా, ఇంక చాలించరా అంటే నేను ఏడిస్తే చూడలేకపోవడం అటుంచి రాస్తే చదవలేరు కూడా అని అర్థం అయ్యింది నాకు. ధన్యురాలిని.
      నీహారికగారు & వెంకట్ గారు మీరు వినోద్ గారిని ఉద్ధేసించి రాసారు కనుక నేను సమాధానం ఇస్వ్వడం బాగుండదేమో. క్షమించాలి.

      Delete
    6. @ యోహంత్... మీ అభిమానానికి ధన్యవాదాలు. అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలి నచ్చాలి అని లేదు కదా. అయినా అందరినీ నవ్వించలేనట్లే ఏడిపించనూ లేము :-) :-(
      @ఆకాంక్ష..అప్పుడే తిట్టి అంతలోనే పొగిడేస్తారు :-)

      Delete
  8. heart touching kanuvippu

    ReplyDelete
  9. ఇంతకీ కనువిప్పు కలిగింది ఎవరికో నాకు అర్థం కాలేదు.

    ReplyDelete
    Replies
    1. ఇంకెవరికి నాకే...కేవలం నాకే ;-)

      Delete
  10. ఓర్చుకోలేనన్న బాధని ఉప్పెనైనా ఊరడించలేక
    ముసురు పట్టిన భావాలు బురదలో కొట్టుకుంటూ HEART TOUCHING

    ReplyDelete
    Replies
    1. భరించలేని దుఃఖాన్ని కన్నీరు ఉప్పెనల్లే వచ్చినా కూడా ఊరడించలేదు కదా..

      Delete
  11. ఇంధ్రధనస్సే విల్లై వంగి ధైర్యమే దూసుకురాగా
    నిబ్బర నిక్షేపాలు ఉరుములై వెచ్చని ఊపిరైతే
    నీడ కంపించి నిజాలెన్నింటినో కక్కి నిలకడనిస్తే...that's the spirit.

    ReplyDelete
    Replies
    1. ఇంక చేసేది ఏమీ లేనప్పుడు ధైర్యంగా దూసుకుపోవడమే కదా సంధ్యగారు..it's may be spirit or demerit.:-)

      Delete
  12. కరెంటుతీగకు వేలాడే నీటిచుక్కలై..పవర్ ఉంటే షాక్ కొట్టి చచ్చిపోతారేమో కదా ఇలా జరిగితే అర్థం కాలేదు

    ReplyDelete
    Replies
    1. ఆశలే చచ్చిపోయాక ఇంక ఆత్మ ఉన్నా చచ్చినట్లే కదా :-)

      Delete
  13. ఎందుకు ఇంత వ్యధ

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడూ నవ్వలేక :-)

      Delete
  14. నర్మగర్భంగా ఆత్మవిశ్వాసాన్ని పెెంచడమే పద్మార్పితం కాబోలు. చీకటి గోడలను పగలగొట్టి వెలుగు రేఖలను పంచడమే ఆ ఆక్షరాల నిశ్వాస కాబోలు. నివురు గప్పిన స్వార్ధాన్ని తరిమే ఖడ్గం కాబోలు. అపజయాన్ని తరిమే జయాధుయం కాబోలు. అనుభవాల నగ్న సత్యాన్వేషణ కాబోలు. యుద్ధాన్ని మించిన తత్వశోధనలో... కనిపించని అక్షరసమరం కాబోలు... ఏమో ఆమె మనోగతంలో రుధిర తాండవమేదైనా.... ఈతరం వాణి పద్మార్మితే కాబోలు. ఈ కవిత చూశాక.... నాలో రగిలిన ఆక్షరావేశం కాబోలు. వ్యధ కాదిది... వర్తమానాన్ని మార్చే ఆవేశం.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు

      Delete
    2. @సతీష్ గారు...ఆత్మస్థైర్యం, మనోఃనిబ్బరం పట్టుతప్పి ఒకోసారి అంతా శూన్యం అనుకుని ఏదారీ లేనప్పుడు గోదారిలో ఎదురీదాలి అనుకుని అరువుతెచ్చుకున్న ధైర్యం నుండి వచ్చిన భావాలు ఇలా ఉంటాయి అని చెప్పే ప్రయత్నం.
      మీ వివరణాత్మక స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  15. బాగుంది నిరాశావాదం నుంచి వచ్చిన స్ఫూర్తి వాక్యాలు

    ReplyDelete
    Replies
    1. ఓహో...పసిగట్టేసారు

      Delete
  16. ఇంకో మాట సెప్పు అర్పితమ్మో

    ReplyDelete
    Replies
    1. నేనేం చెప్పినా తుపాకీతో కాలుస్తారుగా :-)

      Delete
  17. నేను వినోద్ తో ఏఖీభవిస్తున్నాను. జీవితంలో ఎలాగో ఏడుస్తున్నాము కవితల్లో కూడానా

    ReplyDelete
    Replies
    1. మహీ...ఎప్పుడూ ఒకేలా ఉండడం కష్టం కదా, :-) :-(

      Delete
  18. బంధాలు అంత సులువుగా తెగిపోవు త్రెంచుకోవాలి అనుకున్నప్పటికీ. మంచి కవితను అందించారు.

    ReplyDelete
  19. తెలుగుభాష నేర్పించిన గురువుగారి అభివందనములు.
    "ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు"

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ యోహంత్. మరచిపోకు. అప్పుడప్పుడూ రాస్తూ ఉండు

      Delete
  20. పదాలు వెచ్చని పందిర్లు కాగా నిశ్శబ్దం నవ్వె బాగుంది పద్మగారు వ్యధ

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ లిపిగారు.

      Delete