బహుమానం!!

వస్తువు రూపంలో బహుమతులు అందరూ ఇస్తారు....
ఈ విధమైన బహుమతులు ఇస్తే ఎలా వుంటుందంటారు??

మనకిమనం....స్వాభిమానం, ఆత్మపరిశీలన, వ్యాయామం, సంతృప్తి!
తల్లిదండ్రులకి....ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞతలు, ఆత్మీయత, ఓదార్పు!
జీవితభాగస్వామికి....ప్రేమ, ప్రశంస, నమ్మకం, తోడు, సమయం!
సోదరీసోదరులకు....అనురాగం, మనోధైర్యం, సహాయం, అర్థంచేసుకోవడం!
సంతానానికి....జ్ఞానం, సలహా, ప్రేమ, దయ, నీడ!
స్నేహితులకు....చేయూత, సద్భావం, సమయం!
సహాయపడినవారికి....మెచ్చుకోలు, కృతజ్ఞతలు, గుర్తుంచుకోవడం!
తోటి ఉద్యోగులకు....పలకరింపు, సహాయగుణం, హాస్యం!
అధికారికి....గౌరవం, నమ్మకం, నాణ్యత, సమయపాలనం!
శత్రువులకి....క్షమించడం, చిరునవ్వు, స్నేహభావం!
దేశానికి....గౌరవం, అభివృధ్ధికి మార్గం!
దేవునికి....నిర్మలమైన మనసుతో ప్రణామం!
మరింకెందుకు ఆలస్యం....పదండి బహూకరిద్దాం!!

16 comments:

  1. వస్తున్నామండీ మీవెంట. :)

    ReplyDelete
  2. స్నేహితునికి
    సమయంతో చెయూతనిచ్చి
    శత్రువుకి
    స్నేహభవం పంచే మీ మనసుకు జొహర్లు..

    ReplyDelete
  3. meru drawing chesi pics pedutey rnka baguntayi padmarpita garu andi

    ReplyDelete
  4. విలువైన బహుమానాలు...బావున్నాయండీ..

    ReplyDelete
  5. prati bloger ki voka comment kuda bahumati gaa ivvali andaru .

    ReplyDelete
  6. భలే ఉన్నాయి...శత్రువుకి కుడా రాసేరె .

    ReplyDelete
  7. ఇలాంటి బహుమతులు ఇస్తే మనల్ని మనసున్నవారే పిలుస్తారేమో! అని చిన్న డౌట్.

    ReplyDelete
  8. పద్మగారు....మరి ప్రేమికులకి బహుమతులు అవసరం లేదాండి?

    ReplyDelete
  9. ఏ బంధంలోనైనా అసలు షరతులు పెట్టకపోవటమే విలువైన బహుమతి. దాన్నుంచే అపభ్రంశలు. మీ బహుమతుల చిట్టా బాగుంది,

    ReplyDelete
  10. బహు బాగుంది మీరు ఇచ్చిన బహుమతులు ఫద్మ గారు. కాని ప్రేమికులుకు యేమి బహుమతి ఇస్తారొ సెలవియ్యలెదు. లెక ప్రేమికులుకు బహుమతులు అవసరం లేదు అని మీ అభిప్రయమా! కాస్త అదికూడ సెలవియ్యండి.

    ReplyDelete
  11. ప్రేమకు ప్రేమే ఒక ప్రియమైన బహుమానం అనుకుంటాను...ఏవంటారు కృష్ణగారు?

    ReplyDelete
  12. విలువైన బహుమతులు!

    ReplyDelete