బ్లాగర్స్అందరిచే... కొంత స్నేహాన్ని కాస్త అభిమానాన్ని కొందరి మన్ననలని అయినా పొందాలని ఆశిస్తూ కోటి ఆశలతో కొన్ని ఆశయాలతో కొత్తసంవత్సరానికిస్వాగతంపలుకుతూ...........
బ్లొగర్స్ అందరికి విన్నపం.....ఇది నేను మొదటిసారిగా వ్రాస్తున్న కధ, ఎంతో కుదించి వ్రాయాలి అన్న ప్రయత్నంలో ఎక్కడైనా భావాలని వ్యక్త పరచడంలో లోపాలు జరిగితే సరిచేస్తారని ఆశిస్తున్నాను ....
కంటికి కనపడకుండా పోయావు.. ప్రతి క్షణం నాకు ఎందుకు గుర్తుకొస్తున్నావు.. నా మనసుని నులిమి స్వప్నాల్లోకి ఎందుకొస్తున్నావు...
నీ స్వప్నాలనుండి నన్ను బయట పడనీయి.. నన్ను మనోవేదన అనుభవించనీయి.. నా శ్వాస ఆగిపోనీయి, ఈ లోకం నుండి దూరమైపోనీయి...
చేసిన బాసలన్ని బూటకాలని తెలుసుకోలేక పోయాను.. నిన్ను మార్చడానికి ఎంతో ప్రయత్నించాను.. నువ్వే పరాయి అయినప్పుడు వేరెవరితో పనిలేదనుకున్నాను.. పశ్చాతాపంతో ఒకరోజు నీవు తప్పుతెలుసుకుని నాదరి చేరేలోగా, ఏదూరతీరలకో నే చేరుకుంటాను...
ప్రేమనేది అందరికీ దొరకదు, అది కొందరినే వరిస్తుంది... ప్రేమ ఎన్నో కష్టాలను కొని తెస్తుంది... ప్రేమలో మనసు కాలుతూ మనిషిని కాలుస్తుంది.... అందుకే అందరూ స్నేహభావంతో మెలగమంటుంది... స్నేహానికి ఎటువంటి అడ్డంకులు లేవంటుంది... స్నేహం ఎదుటివారి ఆనందాన్ని కోరుతుంది... స్నేహం ప్రాణం తీయదు ప్రాణమే ఇస్తానంటుంది...
ఇద్దరం కలసి జీవించన్నప్పుడు....... నాపై శ్రధ్ధ చూపకు నేను దానికి అలవాటు పడిపోతాను. నా నుండి ఏమీ ఆశించకు నేను వాటిని నెరవేర్చలేను. నాపై నమ్మకాన్నుంచకు నేను దాన్ని నిలబెట్టుకోలేను. నా హృదయాన్ని హత్తుకొనేలా ప్రవర్తించకు నీ నుండి విడలేకపోతాను. నాలో ఆరాధనా భావాన్ని కలిగించకు దాన్నుండి బయటపడలేను. నా జీవితంలో భాగమైపోకు నీవు లేకుండా నేను జీవించలేను.
మార్పు... నిన్ను చూడకుండా వుండాలనుకున్నాను.... నీవుండగలవని తెలుసుకున్నాను... నీలాగే నేను ఉండాలని ప్రయత్నిస్తున్నాను... నేను మారకపోతే నిన్నే నాలా మారిపొమ్మంటాను...
నీ తలపు... నీవు నా చెంత లేవు, నా పెదవులపై నవ్వు లేదు... కంటికిపై కునుకు లేక కలలోకి కుడా రావడం లేదు... వెక్కిళ్ళు కూడా రావడం లేదు, బహుశ నీవు నన్ను తలవడం లేదు... అయినా నిన్ను నేను మరువ లేదు, అది నాకు చేత కాదు...
ఇదండీ సంగతి.....
నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను, అప్పుడప్పుడు భాధని కనబడనీయకుండా అతిగా నవ్వేస్తుంటాను. ఇలాగే కాలాన్ని వెళ్ళబుస్తుంటాను.
తోటలో పూల కోసం వెళ్ళిన ప్రతీసారీ నాకు పసిడిమొగ్గలే దొరికాయి.. నడచిన ప్రతి దారిలో ముళ్ళే ఎదురైనాయి.. పసిడి మొగ్గలతోనే నా బాటని పూలబాటగా మలచుకున్నాను.. అందులోనే ఆనందాన్ని వెతుక్కొని జీవిస్తున్నాను..
అత్యాశకు పోకూడదని తెలుసుకున్నాను, అందుకే ఇతరులు సంతోషంగా వుంటే చూసి ఆనందిస్తుంటాను. ఇలాగే కాలాన్ని వెళ్ళబుస్తుంటాను.
మృతి చింత... మనిషిని మనుషులు మోసుకెళ్తున్నారు... తెల్లని వస్త్రంలో అతని ఆశలని కట్టకట్టి తీసుకెళ్తున్నారు... ప్రాణాలతో వున్నప్పుడు ఏమి సాధించాడో తెలుసుకోలేకున్నారు... భువిలో దొరకని శాంతి చితిలో దొరకదని తెలిసి కూడా రోధిస్తున్నారు... బ్రతికి ఉన్నప్పుడు మంచిపనులు చేయాలని ఎంత మంది ఆలోచిస్తున్నారు...
కుర్రకారు కాస్త ఆలోచించండి......
మొన్నీమద్య తమ్ముడి పెళ్ళి గురించి ఇంట్లో చర్చిస్తుంటే వాడు చూసిన ప్రతీ అమ్మాయిని కాదంటుంటే నాకు కోపం వచ్చి తడుముకోకుండా నా మనసు నుండి వెలువడిన ఆశు కవితండి.........
"కావాలని నిన్ను కోరివచ్చిన కన్యను కాదని అంటే నీవు కావాలని అనుకున్నప్పుడు కన్యలే కారు కాంతలు కూడా కంటికి కనపడకుండా కనుమరుగౌతారు ఖబర్దార్" ఇది చదివి మీరు తిట్టినా, మొట్టినా, కామెంట్ పెట్టినా......... సమ్మతమేనండి.
( అప్రస్తుతమే కానీ ప్రస్తుతిస్తున్నాను.....తమ్ముడికి ఈ నెల 10వ తేదీన నిశ్శితార్ధమండి )
మాట.... ఒక మాటుంది పదే పదే మనసుని కలవర పెడుతుంది మనసులో దాగను అంటుంది.... అది విని నీవు నాపై అలిగితే తట్టుకునే శక్తి నా మనసుకి వుంది.... కాని నీ మనసు కలవరపడి కలత చెందితే, శాశ్వితంగా కనులు మూసుకుని వుంటానంటుంది...
ప్రేమకి ఉనికి.......... సువాసనలని అనుభవించ వలసిన అవసరం లేదు, ఆస్వాదిస్తే చాలు. ప్రేమను మాటల ద్వారా తెలియపరచ వలసిన పనిలేదు, రెండు మనసులు ఒకటైనప్పుడు, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే చాలు. నాకంటూ ఏ ప్రత్యేకతలు లేవు అయినా అందరూ నన్ను గుర్తిస్తారు... ఎందుకో తెలియదు కాని నేను ప్రేమించిన వారు తప్ప నా ప్రేమను అందరు గుర్తించారు....