వక్రించిన విధి....

బ్లొగర్స్ అందరికి విన్నపం..... ఇది నేను మొదటిసారిగా వ్రాస్తున్న కధ, ఎంతో కుదించి వ్రాయాలి అన్న ప్రయత్నంలో ఎక్కడైనా భావాలని వ్యక్త పరచడంలో లోపాలు జరిగితే సరిచేస్తారని ఆశిస్తున్నాను ....

శిరి ఫోన్ లోని మాటలు విని చప్పునలేచి నిముషాల మీద తయారై హాస్పిటల్ రిసెప్షన్ లో ఫైల్ తీసుకుని కిడ్నీదాత వివరాలు చదవసాగింది....
ఎవరైనా దొరికారా...? అంటూ ఎవరో అడిగిన దానికి లేదంటూ జవాబు ఇచ్చింది రిసెప్షనిస్ట్.
ఎలాగైనా ప్రయత్నించండి .....అతని గొంతులో నిరుత్సాహం....
ప్రయత్నిస్తున్నామండి... అయినా మీరు ఆరునెలలకే ఇలాగంటే పాపం మేడంకి మూడేళ్ళ తరువాత ఇప్పుడు దొరికారండీ దాతలు... అన్న మాటలతో తల తిప్పి చూసిన శిరి నిర్థాంతపోయింది.
నిజమా!...శ్రీ...నా శ్రీకాంత్...ఇక్కడా!.....మూడేళ్ళ పైనే అయింది చూసి. ఎటువంటి మార్పు లేదు ముఖంలొ ఏదో నిరుత్సాహం తప్ప...
ఒక్క ఉదుటన వెళ్ళి అతన్ని గట్టిగా కౌగలించుకుని నేనే నీ శిరీషని.... నీ శిరిని అని చెప్పాలి అన్న ఆలోచనలకి కళ్ళెం పడింది, అతని ప్రక్కన ఉన్న ముద్దులొలికే చిన్నారి అతని చేయిపట్టి నాన్న...నాన్న, అన్న మాటలతో.
గతంలోకి వెళితే......
అవి ఉద్యోగంలో చేరిన కొత్తలో కంపెనీ వాళ్ళ సెమినార్ లో చూసింది శిరి అతన్ని...ఆరడుగులు, చురుకైన కళ్ళు, పెదాలమీద చిరునవ్వుతో చలాకీగా అన్నిపనులు చూస్తూ చేయిస్తున్నాడు. చూసినవెంటనే ఆకట్టుకునే నవ్వు శిరిని కూడా అతని వివరాలు కనుక్కునేలా చేసింది. వివరాలు తెలుసుకుంది కానీ పరిచయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తూనే ఆరు వారాలు గడిచాయి. అప్పుడు వచ్చింది ఒక ఆలోచన.....తనకిష్టమైన నవల వెన్నెలలో ఆడపిల్ల కధానాయికలా కవ్వించి, కొన్నాళ్ళు ఏడిపించి వెరైటీగా కలవాలని....ఎక్కడో ఏదో అపశృతి , అయినా అనుకున్నదే తడవు సెల్ ఫోన్ తీసి స్నేహ భావనతో కూడిన sms చేసింది, రెండు....నాలుగు.....ఎనిమిది.... పదహారు smsలు జవాబు రాలేదు. కాని రోజూ వివిధ నంబర్ల నుండి కాల్స్ వచ్చేవి , శిరి మాట్లాడేది కాదు. చివరికి ఆరవరోజు వచ్చింది message, ఎవరు మీరు, మీ sms లు మీగురించి ఆలోచించేలా చేసాయి అంటూ .
అలా మొదలైన పరిచయం ఆరు నెల్లలో ఒకరిని ఒకరు చూడకుండానే రోజూ గంటల తరబడి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని కల్పించింది. రోజూ రాత్రులు గంటల తరబడి మాట్లాడేవాడు ,బ్రతిమాలి, బుజ్జగించి, లాలించి వివరాలు చెప్పమనేవాడు. అలా అడిగినప్పుడు కలసినప్పుడు చెపుతానని చిలిపిగా శిరి అతన్ని ఏడిపించేది. మూడు రోజుల్లో కలుస్తామనగా తెలిసింది పిడుగులాంటి వార్త శిరికి అప్పుడప్పుడు తీవ్రంగా వచ్చే నొప్పికి కారణం తన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, తనకి నప్పే కిడ్నీదాతలు కూడా అరుదుగా వుంటారని. విషయం శ్రీకాంత్ కి చెప్పాలవద్దా... చెబితే ప్రేమ , అభిమానం అంతా సానుభూతిగా మారితే శిరి దాన్ని భరించలేదు, అందుకే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. అతనితో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించిన శిరి, వాటిని కలలకే పరిమితం చేసుకుని అతని కంటికి కనబడక, కంఠానికి దూరమై మూడేళ్ళు ఎలాగడిపిందో ఆమె గుండెల్లోకి జారి ఇంకిపోయిన కన్నీటిచారల్ని గుండెలోతుల్లోకి వెళ్ళిచూస్తే తెలుస్తుంది.
వాస్తవంలోకి...
రిసెప్షన్ లో అడిగితే తెలిసింది శ్రీకాంత్ భార్యకి కూడా తనకి సరిపడే కిడ్నీ దాతయే అవసరమని. శిరికి ఎప్పుడో విన్న సినిమా పాట గుర్తుకు వచ్చింది, "విధి చేయు వింతలన్ని మతిలేని చేష్టలేనని.... విరహాన్న వేగి కూడా విలపించే కధలు ఎన్నో".....శిరి కిడ్నీదాతతో తనకి కిడ్నీ అవసరం లేదని కిడ్నీని శ్రీకాంత్ వాళ్ళ భార్యకి అమర్చే ఏర్పాట్లు చేయమని రిసెప్షన్ లో చెప్పి, లోపల డాక్టర్ గారితో మాట్లాడి బయటికి వెళ్ళుతుంటే....".ఎక్స్ క్యూజ్ మీ ప్లీజ్ అన్న"మాటలు విని ఆగిపోయింది. శిరికి తెలుసు చెప్పండి అంటే కూడా శ్రీ తనని గుర్తుపడతాడని మౌనంగా నిలుచుంది. అతనే ...మీరు చేసిన మేలు జన్మలో మరచిపోనంటూ వాళ్ళ పాపతో రెండు చేతులు జోడింప చేసి..." శిరి బంగారం ఆంటికి థాంక్స్ చెప్పమ్మా అన్నాడు. అదే... అదే పిలుపు మూడు సంవత్సరాల తరువాత విన్నది...పదే పదే తనని బుజ్జగించి లాలించిన పిలుపు...ఇంక ఆగవు కన్నీళ్ళు తనలో అని తెలుసు, అవి బయటికి వస్తే వాటిని అతడు ఆపేస్తాడనీ తెలుసు. అందుకే మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది శిరి.

14 comments:

 1. పద్మార్పిత గారు మీ కదా చదివాకా క్షణ క్షణం సినిమాలో పరేష్ రావల్ ,నర్సింగ్ యాదవ్ మద్య సీన్ గుర్తు కొచ్చింది. అందు లో పరేష్ రావల్ మౌత్ ఆర్గాన్ మిద ఏవో పిచ్చి tunes వాయించి ఏం పాటరా ఇది అంటే తెల్వద్ సారూ అంటుంటాడు అలాగా వెన్నెల్లో ఆడపిల్ల కదకే కొంచెం characters పేర్లు మార్చి , కాన్సర్ బదులు కిడ్నీ సమస్య పెట్టి,శారీరకం గా చచ్చే బదులు మానసికం గా చచ్చే కధానాయికను పెట్టి కదా రాసే ప్రయత్నం చేసారేమో అని పించింది.అలాగే మరోచరిత్ర లో అద్బుతమైన విరహ ప్రేమికుల మధుర గీతం విధి చేయు వింతలన్నీ మీ కధ లో సన్నీ వేసానికి అస్సలు నప్పలేదు.ఆ టైం లో వచ్చేది జాలి కరుణ. విరహం కాదు.అయిన మీ మొదటి ప్రయత్నం అభినంద నీయం.

  ReplyDelete
 2. రవిగారూ... కధలు చదివి సినిమాలు చూసి ఆస్వాదించి రాసిందే కాని అనుభూతిని పొంది, అనుభవంతో రాసింది కాదు కదండీ. ఈ కధలో మరెన్నో సినిమాలు, నవలలు దాగి ఉండవచ్చు...
  అయినా నిర్మొహమాటంగా మీరు చేసిన వ్యాఖ్య ప్రశంసనీయం...

  ReplyDelete
 3. మొదటి ప్రయత్నం అభినంద నీయం.

  ReplyDelete
 4. నాకు ఆసినిమాలు తెలీవు కనక కథ కథగానే చదివేను. బాగుంది.

  ReplyDelete
 5. ఇది నేను మొదటిసారిగా వ్రాస్తున్న కధ, ఎంతో కుదించి వ్రాయాలి అన్న ప్రయత్నంలో .... కుదించి ఒక కధను ఎలారాయగలరు?మీ పని రాసుకుంటూ పోవటమే,అలా అభ్యాసము కూసు విద్య అయ్యాక,తినగతినగ వేము తియ్యనయ్యాక,అప్పుడు శిల్పం వగైరా సాంకేతికవిషయాల జోలికెళ్ళండి.అసలు చిన్న కధలు రాయటం సాహిత్యరచనలో చాలా పెద్దపని కాబట్టి కాస్తాగి మీరు ఆపని చెయ్యాలని,మీరు సాధనతో,శ్రమతో ఆ పరిణితి త్వరలో సాధిస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నాను.

  ReplyDelete
 6. padmagaru

  mee katha chadivanu entho nachindi.

  kani seershika title peru lo konchem vividyathanu pradarsinchandi.
  ika ravigaru chesina comments chadivanu andaru ayana antha etthu edagalani bavistharu kani rathriki rthre avvaru kada time paduthundi meeru ilanti vyangya coments ki veravakunda dhiryam ga rayandi.
  inka manchi manchi kathaltho mammalni alristharani asissthu ...........

  ReplyDelete
 7. రాధికగారికి,మాలతిగారికి ధన్యవాదాలండి.....
  అనుకుమార్ గారు ఈసారి టైటిల్ విషయములో శ్రధ్ధ వహిస్తాను, థాంక్సండి......

  ReplyDelete
 8. రాజేంద్ర కుమార్ గారు..మీకు నా ప్రత్యేక ధన్యవాదాలండి.
  నిజానికి భ్లాగ్ లో వ్రాయడం అంటే పుంఖానుపుంఖలుగా రాయకూడదేమో అన్న మిడి మిడి జ్ఞానంతో కధని కుదించాలనుకున్నానండి.మీ ఆశ్శీసులు సదా కోరుతూ....once again thanks for ur suggestion.

  ReplyDelete
 9. మొదటి ప్రయత్నమైనా బావుందండి. ఇంకా క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తారని ఆశిస్తూ

  ReplyDelete
 10. థాంక్సండి.......ప్రయోగాల ప్రయత్నంలో ప్రక్కదోవ పడితే సరిచేస్తారని ఆశ్శిస్తున్నాను.

  ReplyDelete
 11. మీ తొలి ప్రయత్నం అభినందనీయం. అక్షరాలు పదాలు, వాక్యాలు,సన్నివేశాలు ఎక్కడినుండొ ఒకచోటనుండి వినియోగించుకుంటెనే కదా వ్రాయగలుగుతాం. ఏ అక్షరమూ ఎవరిదీకాదు .మీ మనసులో వెల్లువెత్తే భావాల అలలను అణచిపెట్టకండి. ప్రొసీడ్ .శెభాష్ .మీరు వ్రాయ గలుగుతున్నారు . అభినందనలు... శ్రేయోభిలాషి ....నూతక్కి

  ReplyDelete
 12. మొదటి ప్రయత్నం..ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో చేయాలని .. ...

  ReplyDelete
 13. Manasunu dravimpa chesina katha. vaasthava jeevitaaniki mudi padi unda kudadu ani aasa

  ReplyDelete