కుర్రకారు కాస్త ఆలోచించండి......

మొన్నీమద్య తమ్ముడి పెళ్ళి గురించి ఇంట్లో చర్చిస్తుంటే వాడు చూసిన ప్రతీ అమ్మాయిని కాదంటుంటే నాకు కోపం వచ్చి తడుముకోకుండా నా మనసు నుండి వెలువడిన ఆశు కవితండి.........

"కావాలని నిన్ను కోరివచ్చిన కన్యను కాదని అంటే
నీవు కావాలని అనుకున్నప్పుడు కన్యలే కారు
కాంతలు కూడా కంటికి కనపడకుండా కనుమరుగౌతారు ఖబర్దార్"

ఇది చదివి మీరు తిట్టినా, మొట్టినా, కామెంట్ పెట్టినా......... సమ్మతమేనండి.

( అప్రస్తుతమే కానీ ప్రస్తుతిస్తున్నాను.....తమ్ముడికి ఈ నెల 10వ తేదీన నిశ్శితార్ధమండి )

7 comments:

  1. మరింకేం శుభం.కాబోయే నూతన వధూవరులకు శుభాశీస్సులు...

    ReplyDelete
  2. బావుందండి అర్పిత గారు మొహమాటానికి పొతే ఏదో అయ్యిందని మీకు భయపడి మీ తమ్ముడు ఏదో అమ్మాయికి వు కొడితే రేపు మొదటి రోజు పాలగ్లస్సు తీసుకుని నన్ను దీవించండి అంటు పాదాల మిద పడితే గిడితే కనక అతను అరమోడ్పు కన్నులతో తలమీద నుంచి కొంగు ని తీస్తూ ఖంగు తిన్నడనుకోన్డి ఆమె ఎత్తు పళ్ళు చూసి?అందు కోసం చేతులు కాలక ఆకులు పట్టుకునే కంటే మీ వాడిని తేరిపార అమ్మాయిల్ని చుడనిచ్చి వాళ్ళల్లో నచ్చిన ఆమె ని పెల్లికుతుర్ని చెయ్యడమే సబబు. మీ తమ్ముడి పెళ్ళికి మమ్మల్ని కూడా పిలిస్తే కాస్త చూసి(పెళ్లిని లెండి, పెల్లికుతుర్ని కాదు)వెళ్లిపోతాము.నిదానమే ప్రధానము అంతే గాని ప్రధానమే ప్రధానం కాదు.

    ReplyDelete
  3. విజయమోహన్ గారు మీ ఆశీసులు తప్పకుండా అందజేస్తాను.....Thank you...

    ReplyDelete
  4. రవిగారు.... ఈ రోజుల్లో ఎవరండి ఎగాదిగా చూడకుండా మాట్లాడకుండా తలవంచుకుని పెళ్ళిచేసుకునేది.........ప్రస్తుతం వాళ్ళు gifts & views exchange లో busy వున్నారండి . పెళ్ళి ముహుర్తం పెట్టాక శుభలేఖ పంపుతాను. పెళ్ళికి వచ్చి విందారగించి వారిని ఆశీర్వదించండి...... ( జంటని చూడండి made for each other అంటారు)

    ReplyDelete
  5. బాగుందండి.. కాని ఒక సందేహం ,కాంత అంటె ఎక్కువ వయసు ఉన్న అమ్మాయి అనా?కాని ఒకటి లెండి అమ్మయిలకంటె అబ్బాయిల పెళ్ళి కోసమే చెప్పులు అరగ దీసుకోవలసి వస్తుంది ఈ రోజుల్లో :)

    ReplyDelete
  6. కాంతలంటే వయసు ఎక్కువైన వారేనండి ఇక్కడ....మీరు అన్నది నిజం నేస్తం.... ఈరోజుల్లో అబ్బాయిలకి అమ్మాయిలే కొదవండి...

    ReplyDelete