నీలో మార్పు.....

కంటికి కనపడకుండా పోయావు..
ప్రతి క్షణం నాకు ఎందుకు గుర్తుకొస్తున్నావు..
నా మనసుని నులిమి స్వప్నాల్లోకి ఎందుకొస్తున్నావు...

నీ స్వప్నాలనుండి నన్ను బయట పడనీయి..
నన్ను మనోవేదన అనుభవించనీయి..
నా శ్వాస ఆగిపోనీయి, ఈ లోకం నుండి దూరమైపోనీయి...

చేసిన బాసలన్ని బూటకాలని తెలుసుకోలేక పోయాను..
నిన్ను మార్చడానికి ఎంతో ప్రయత్నించాను..
నువ్వే పరాయి అయినప్పుడు వేరెవరితో పనిలేదనుకున్నాను..
పశ్చాతాపంతో ఒకరోజు నీవు తప్పుతెలుసుకుని నాదరి చేరేలోగా,
ఏదూరతీరలకో నే చేరుకుంటాను...

1 comment:

  1. ప్రేమే సర్వస్వం అనే మీ కలము నుండి జాలువారిన వేదనభరిత కవితయనో ఏమో.. ఈ కవితకు కమెంట్లు కానరాలేదు..

    ఒకరిపట్ల ఒకరికి గౌరవం మర్యాద విశ్వసనీయత విధేయత ఉంటే ఈ కవితలో కథానాయకుడు/కథానాయిక తన కథానాయికని/కథానాయకుణ్ణి విడిచి వెళ్ళేవారే కాదుగదా..

    ఒకరి అభిప్రాయాన్ని గౌరవించటం నేర్చుకుంటే ఎన్ని అవాంతరాలు అడ్డంకిలువచ్చినా ఒకరిని విడిచి మరోకరు ఉండలేరనేది అందరికి తెలిసిన రహస్యం.

    డిసెంబర్ యయిటీన్ టూ థౌజండ్ యయిట్
    సెప్టెంబర్ యయిటీన్ టూ థౌజండ్ సిక్స్ టీన్

    ReplyDelete