ఇది కేవలం భా.రా.రె గారి హృదయస్పందనల చిరుసవ్వడి బ్లాగ్ లో "సంక్రాంతి కి విడుదల కాబోతున్న హారం పత్రికా ప్రతికై రచయితలకాహ్వానం. ఇరవై వేల పైన బహుమతులు"..... ఆహ్వానాన్ని చూసి స్పందించి స్నేహభావాల చనువుతో కాసేపు నవ్వుకుందామని చేసిన చిరుప్రయత్నంగా భావిస్తారని ఆశిస్తూ.....
భాస్కర రామిరెడ్డిగారికి అంకితం!
ఆహ్వానాన్ని చూసి ఆనందంతో గెంతులేసి కాలువిరగొట్టుకుని కూర్చుని మరీ కవితలు కధానికలు రాసేద్దాం అనుకున్నానండి!!!!అంతలో కొన్ని సూచనలు అంటూ అంకెల గురించి ప్రస్తావించేసరికి తుస్ స్ స్ స్.....అక్షర జ్ఞానమే సరిగ్గాలేని నేను అంకెల జ్ఞానం ఏం అర్థంచేసుకోను చెప్పండి!!!!అయినా ప్రయత్నిద్దామని...... అంశాలన్నింటినీ రోజుకొకటి పదిహేనుసార్లు చదివితే దాని పర్యవసానం ఇదన్నమాట.!!!ఛీ... ఛీ అని అనకుండా నా అజ్ఞానానికి నాలుగు చీవాట్లు పెట్టండి!మీ మనసు నొప్పిస్తే మన్నించండి!మీరు ఏమన్నా నవ్వేస్తా:-)భా.రా.రె గారి బహుమతుల హారమా మజాకా:-)1. ఆంధ్రమహాభారత, భాగవతాల ఇండెక్స్ ఇప్పుడిప్పుడే చదువుతున్న నేను ఎప్పటికి పరిశోధన చేసేది ఏమిరాసేది?:(
2. మొన్న రంజాన్ పండుగ ఇఫ్తార్ విందు అరగనేలేదు ఇంతలో క్రిస్టమస్ కేక్ తయారీలో బిజీగా ఉన్న నేను వచ్చే సంక్రాంతి ఎలా జరుపుకోవాలో అని అలోచిస్తుంటే.... భారతదేశంలో ఈ మతాల పాత్ర గోల ఏంటండిబాబు?
3. పట్నం నుండి పల్లెకు వెళ్ళి పదిరోజులుండి పచ్చనిపొలాలు చూసి పసందైన పలహారాలంటే.....ఓకే! కాని కధానికలేం రాయగలను చెప్పండి?
4. నన్ను ఇలా పెంచి పెద్దచేసిన నా తల్లిదండ్రుల మనోభావాలని గౌరవించి వృధాప్యంలో వారిని ఆనందింప చేస్తే చాలనుకుంటున్న నాకు పిల్లల మనస్తత్వం గురించి వ్రాసే జ్ఞానం ఎక్కడిదండి?
5. మహాత్మాగాంధీగారిని హత్యగావించింది గాడ్సే పేరు తప్ప స్పెలింగ్ కుడా తప్పురాసే నేను తదానంతరం భారతదేశంలో మార్పులపై పాతికపేజీలు రాయడం మాటలా చెప్పేయడానికి?
6. కుమ్మరి, కమ్మరి, శాలి, చాకలి, మంగలి, శిల్పి, పౌరోహిత్యం, జ్యోతిశాస్త్రం......ఇలా ఒక్కరేంటి అందరూ కంప్యూటర్ల ముందు తలవంచితే కులవృత్తులపై కధలు కమామిషలు ఏమి వ్రాయను ఎలా మెప్పించను?
7. పనికిరాని చెత్త వ్రాసి మీ అందరికి విసుగు తెప్పించి మీతో చీవాట్లు తింటూ కూడా నవ్వుతున్న నన్ను చూసి మీరు నవ్వుతారుగా......నన్ను మించిన బఫూన్ పాత్ర కాకుండా ఇంకెవరైనా ఉంటే చెప్పండి?
8. ఆహా...నాకు కావలసిన టాపిక్ దొరికింది కవితలు-తవికలు కూడా రాసేద్దాంకదా అని....ఒక తెలంగాణ పోరడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకుని అమెరికాకు వెళదాం రండి అంటే..... ఛస్! నీఅవ్వ....అత్తమ్మోల్లు అంత్ర్వేధిలుంటే పండ్గకు పోయి అర్సెలు తినక అమెరికా అంటావేందే??? బొక్కలిరగదంతా అన్నడు.....ఇంకెక్కడి అమెరికాలో కాపురం? దానిపై కధలు కవితలు?:-(
9. చరిత్ర చెప్పకుండా చెప్పినట్లు బొమ్మ వేస్తే
భా.రా.రె గారు నాకు బహుమానం గ్యారంటీగా ఇస్తారని కుంచెపట్టి అడ్డ గీతలు నిలువుగీతలు గీస్తే అవన్నీ కలసి భావంలేని ఒకటి అంకెగా మారితే అదిచూసి ఒక్కటిస్తారేకాని బహుమానమా నా మొహానికి చెప్పండి?
10. బాబోయ్....భయం వేస్తుంది ఎందుకంటే టెంత్ క్లాస్ లో నాకు భౌగోళికశాస్త్రంలో సున్నా....ఇప్పుడు అదేవేస్తే పరువుపోతుంది.... కాదంటారా?
11.రాసేసానోచ్!!!......అరపేజీ పద్యగద్య పదాలతో కుమ్మేసాగా....:-) ఛా! అంతలేదు నీకు అరపేజీలో సంక్రాంతి సోయగాలన్నీ ఏం చెబుతావులే అంటారా? (అయితే నేను అలిగానుగా: ( ఆ అరపేజీని మీకు పంపనుగా...)
12.ఈనాటికాలం గురించే జుట్టుపీక్కుంటుంటే శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటిపై కధకాదు....నాటిక/నవల ఎంతవరకు న్యాయం చెప్పండి? (మనలోమాట హిస్టరీలో నాకు రెండు మార్కులు వచ్చాయి టెంత్ లో ఎందుకంటే రాజులపేర్లు స్పెలింగులు కరెక్టుగా వ్రాసానని ప్రశ్నలో ఉన్నాయని మాస్టార్ కి తెలియదుగా మరి)
13. రంగులుచూపే కనుగుడ్డు నలుపు
కన్నుమూస్తే ప్రపంచమంతా నలుపు
ఆపేయ్ ఇంక... కవితకాదు సినిమా తీయమంటారా?
సారీ బాస్......నెలాఖరులో బడ్జెట్ లేదు:-)
14. ఇదండి నాకు నచ్చిన అంశం....అందుకేగా ఇలా పదిహేనురోజులు పాట్లు...బహుమానంకై అగచాట్లు.!
15. హూ...లలలా...
లల లల లలా
హారమా...హారమా
నీవు మా నేస్తమా
హూ...లలలా...
లల లల లలా
నీవే ఒక బహుమానమా
భా.రా.రె అంటే తెలుసుకొనుమా
హూ...లలలా...
లల లల లలా
"
భా" అంటే భారీగా
"
రా" అంటే రాసులుగా
"
రె" అంటే రెమ్యునరేషన్ /బహుమానంగా
ఇచ్చేవారని తెలుసుకొనుమా.....
హూ...లలలా...
లల లల లలా........
ఏంటో....ఫ్లోలో ఇలా పాట పొడుచుకొస్తుందండి....
అయినా మిమ్మల్ని మీరే పొగిడేసుకుంటానన్నారుగా....
ఇంకేం రాసి పాడను....చిత్తగించండని చల్లగా జారుకుంటాను!
బహుమానం ఏమిద్దామా అని అలోచిస్తున్నారా???? తప్పదులెండి! థింక్ ....థింక్ ....థింక్:-) :-)